Home /News /telangana /

NAAC TEAM AT BASARA IIIT REVIEW FOR GRADING SYSTEM ADB EVK

Basara IIIT : బాస‌ర ట్రిపుల్ ఐటీలో న్యాక్ బృందం.. గ్రేడింగ్‌కి వివ‌రాల సేక‌ర‌ణ‌

బాస‌ర‌ల ట్రిపుల్ ఐటీలో న్యాక్ బృందం

బాస‌ర‌ల ట్రిపుల్ ఐటీలో న్యాక్ బృందం

తెలంగాణ‌ (Telangana) నిర్మల్ జిల్లా (Nirmal Dist.)లోని ప్ర‌సిద్ధ పుణ్యం క్షేత్రం బాస‌ర‌లోని ట్రిపుల్ ఐటీని  న్యాక్ బృందం (Naac Team) సందర్శించింది. మూడు రోజులపాటు ఈ బృందం ట్రిపుల్ ఐటీ పనితీరును పరిశీలిస్తుంది. అనంత‌రం ఏ స్థాయి గ్రేడింగ్ ఇవ్వ‌నుందో రిపోర్టు త‌యారు చేస్తుంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ‌ (Telangana) నిర్మల్ జిల్లా (Nirmal Dist.)లోని ప్ర‌సిద్ధ పుణ్యం క్షేత్రం బాస‌ర‌లోని ట్రిపుల్ ఐటీని  న్యాక్ బృందం (Naac Team) సందర్శించింది. మూడు రోజులపాటు ఈ బృందం ట్రిపుల్ ఐటీ పనితీరును పరిశీలిస్తుంది. ఆరేళ్ల క్రితం చదువుల తల్లి జ్ఞాన సరస్వతి చెంత ఏర్పాటు చేయబడ్డ ఈ ట్రిపుల్ ఐటి ద్వారా 7,500 మంది విద్యార్థులు (Students) వివిధ కోర్సులలో విద్యను అభ్యసించారు. నాక్ గ్రేడింగ్ (Grading) కోసం ఈ ట్రిపుల్ ఐటీ (IIIT) అధికారుల అభ్యర్థన మేరకు న్యాక్ బృందం ట్రిపుల్ఐటీని సందర్శించింది. ట్రిపుల్ఐటీకి ఉన్న అర్హతలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు.  ఈ సంద‌ర్భంగా బృందం ట్రిపుల్ ఐటీలోని వ‌స‌తుల‌ను ప‌రిశీలించింది.

    సిబ్బంది వివ‌రాలపై ఆరా..
    బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో న్యాక్ బృందం సభ్యులు మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు. తరగతి గదులు, ప్రయోగశాలలు, మౌలిక సదుపాయాలు, బోధనలోని నాణ్యతా ప్రమాణాలు, పరిపాలన అంశాలు, రికార్డులు ఇతర సౌకర్యాలు తదితర అంశాలను న్యాక్ బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. వీటి ఆధారంగా ట్రిపుల్ఐటీ కి గ్రేడింగ్ (Grading) ఇవ్వడం జరుగుతుంది.

    Telangana : యాభై ఎక‌రాలు లాక్కున్నారు.. ప‌రిహారం ఇవ్వ‌ట్లేదు.. ఆత్మహత్యకు అనుమ‌తివ్వండి రైతు ఆవేద‌న‌


    ఈ బృందంలో చైర్మెన్, ప్రొఫెసర్ విలాస్ సప్కల్, కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ అభిజిత్ చందా, ప్రొఫెసర్ రవీంద్ర కుమార్ సాహు, ప్రొఫెసర్ కె.జి. శ్రీనివాస్, ప్రొఫెసర్ హాజీ షేక్ మొహమ్మద్ లు ఉన్నారు. కాగా ఈరోజు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్ఖడే ఈ న్యాక్ బృందం సభ్యులను కలిసి ట్రిపుల్ ఐటీకి సంబంధించి, వారు అధ్యయనం చేస్తున్న అంశాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

    బాస‌ర ట్రిపుల్ ఐటీ ప్ర‌త్యేక‌త‌లు..
    బాస‌ర ట్రిపుల్ ఐటీలో ప‌దోత‌ర‌గ‌తి పాసైన విద్యార్థులు చేరుతారు. ఇందుకోసం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్-RGUKT అడ్మిషన్ల ప్రక్రియ నిర్వ‌హిస్తుంది. ప్ర‌తీ ఏడాది బాసర ఐఐఐటీగా పేరొందిన ఈ కాలేజీలో సీటు కోసం పోటీ ఎక్కువ ఉంటుంది. ప్ర‌తీ ఏటా ఇంటిగ్రేటెడ్ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. ఈ కోర్సు వివరాలు వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప్రీ-యూనివర్సిటీ కోర్స్ రెండేళ్లు ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్‌తో రెండేళ్ల ఎంపీసీ కోర్సు ఇది. ఆ తర్వాత నాలుగేళ్లు కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెటల్లార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చేయొచ్చు.

    - క‌ట్ట లెనిన్‌, ఆదిలాబాద్‌, న్యూస్‌18 తెలుగు

    Published by:Sharath Chandra
    First published:

    Tags: Basara, Basara IIIT, EDUCATION, Nirmal district, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు