హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mystery Shadow in Temple: ఆ ‘ఛాయ’ ఓ మాయ.. గర్భగుడిలోని దేవునిపై పడుతున్న నీడ? ఆ ఛాయ ఎక్కడిది?

Mystery Shadow in Temple: ఆ ‘ఛాయ’ ఓ మాయ.. గర్భగుడిలోని దేవునిపై పడుతున్న నీడ? ఆ ఛాయ ఎక్కడిది?

ఆలయ గర్భగుడి

ఆలయ గర్భగుడి

ఛాయ సోమేశ్వర ఆలయం. ఇదో మిస్టరీ టెంపుల్‌. ఇంతకీ ఆ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది. ఈ ఆలయంలో నిత్యం గర్భగుడిలోని దేవునిపై నీడ పడుతుంది. ఇదే ఇక్కడి ప్రత్యేకత. 

(Nagaraj, Nalgonda)

ప్రతి ఆలయానికి (Temple) ఒక ప్రత్యేక చరిత్ర, మహిమ ఉంటుంది. కానీ ఈ ఆలయం ఎంతో చరిత్ర కలిగి ఉండటంతోపాటు.. , అబ్బురపరిచే నిర్మాణ శైలీతో  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అదే ఛాయ సోమేశ్వర ఆలయం (Chaya Someshwara Temple). ఇదో మిస్టరీ టెంపుల్‌ (Mystery temple). ఇంతకీ ఆ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది. ఈ ఆలయంలో నిత్యం గర్భగుడిలోని దేవునిపై నీడ పడుతుంది. ఇదే ఇక్కడి ప్రత్యేకత.  రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌ (Hyderabad)కు ఆనుకొని ఉన్న నల్గొండ (Nalgonda)జిల్లాలో ఈ ఛాయ సోమేశ్వర ఆలయం (Chaya Someshwara Temple) వెలసింది. ఈ ఆలయం గర్బగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా.. అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపు ఆ నీడ (Shadow) కదలకుండా ఒకే స్థానంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత (Temple specialty). భారతీయ వాస్తు శాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే నిలుస్తుంది ఈ ఆలయం.

ఆలయ చరిత్ర..

ఛాయా సోమేశ్వర ఆలయాన్ని.. 11వ శతాబ్దంలో కందూరు చాళుక్య ప్రభువైన ఉదయ భానుడనే రాజు నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం చుట్టూ ఎనిమిది వైపులా చిన్న చిన్న మండపాలు , వీటి చుట్టూ మూడు గర్భగుడులు ఉంటాయి. అందుకే ఈ దేవాలయాన్ని 'త్రికూటాలయం'  అని కూడా పిలుస్తారు. ఆలయంలోని మూడు గర్బ గుడులు కూడా ఒకేరీతిగా ఉంటాయి. అయినా, పడమర దిక్కున ఉన్న గర్బగుడిలోని శివలింగం మీదుగా మాత్రమే ఈ నీడ కనిపిస్తుంది. నిరంతరం నీడ(Shadow)తో కప్పి ఉండటం వల్ల ఈ స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు.

సూర్యుడి గమనం మారినా నీడ మాత్రం అక్కడే ఎలా.!

గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది. పైగా అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు రాదు. సాధారణంగా ‘నీడ’ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది. కానీ, ఈ నీడ సూర్యుడి వెలుతురుతో పనిలేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది.

ఆలయ గర్భగుడి

ఈ ఆలయంలో మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఆ నీడ (Shadow) ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఆలయంలోని రెండు స్తంబాల్లో ఒకదాని నీడై ఉండొచ్చని భావించినా.. ఒకే నీడ రెండు స్తంబాలకు మధ్యలో ఉండే గర్బగుడిలోని విగ్రహం (Statue) వెనుక వైపు పడుతోంది. దీంతో ఈ నీడ దేనిదనేది మిస్టరీగా (Mystery shadow) మిగిలింది. భక్తులంతా ఇది దేవుడి మాయగా నమ్ముతారు.

ఈ ఆలయ శిల్పి.. గర్బగుడిలో పడే నీడకు.. సూర్యుడి కాంతితో పనిలేకుండా పగటి వేళల్లో వెలుతురు మాత్రమే ఉపయోగపడేలా ఆలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. దేవాలయానికే మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే.. ఆలయం పక్కనే ఉన్న ఉదయ సముద్రం చెరువులో నీరుంటే ఈ ఆలయ ప్రధాన గర్భగుడిలో నీరు ఉబికి వస్తుంటుంది.

 ఆలయానికి ఎలా వెళ్ళాలంటే..?

హైదరాబాద్ నుంచి నల్గొండ పట్టణం చేరాలంటే 100 కిల్లో మీటర్ల దూరం ప్రయాణించాలి. హైదరాబాద్‌ నుంచి బస్సు, రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి సుమారు 4 కిలో మీటర్ల దూరంలో గల పానగల్లు గ్రామం (Paanagallu village)లో ఈ ఆలయం ఉంది. ఆలయానికి వెళ్లేందుకు వీలుగా బస్సు తో పాటు ఆటో సౌకర్యం కలదు.

First published:

Tags: Nalgonda, Temple

ఉత్తమ కథలు