బయటపడ్డ అసలు నిజం.. గంటకో కట్టుకథ చెబుతూ ముప్పతిప్పలు.. పోలీసులకు డౌట్ రాకుండా ప్రియుడిని భయ్యా అని పిలిస్తూ..

నౌసిన్ బేగం, గగన్ అగర్వాల్ (పెళ్లి నాటి ఫొటో)

హైదరాబాద్ లో భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన రెండో భార్య కేసులో మాత్రం అంతులేని ట్విస్టులు ఎన్నో బయటపడుతున్నాయి. పోలీసులు ఈ కేసును విచారించే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

 • Share this:
  క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో అయినా ట్విస్టులకు అంతూ పొంతూ ఉంటుంది. కానీ హైదరాబాద్ లో భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన రెండో భార్య కేసులో మాత్రం అంతులేని ట్విస్టులు ఎన్నో బయటపడుతున్నాయి. పోలీసులు ఈ కేసును విచారించే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటి భర్త ద్వారా కలిగిన కూతుళ్లను వేధిస్తున్నందునే భర్తను చంపేశాననీ, అతడిని నా చేతులతో చంపి మంచి పనే చేశానని ఆ భార్య చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూతురి ప్రియుడి సాయంతో ఖతార్ దేశానికి వెల్లేందుకు కూడా ఆమె ప్లాన్ చేసింది. అయితే భర్తను చంపేందుకు అసలు కారణాలు వేరే ఉన్నాయని విచారణలో బయటపడుతున్న అంశాలను పరిశీలిస్తే తెలుస్తోంది. ఇంతకీ అసలు సంగతేంటంటే..

  హైదరాబాద్ లోని పాతబస్తీ యాకత్ పురాకు చెందిన నౌసిన్ బేగం అనే 32 ఏళ్ల మహిళకు కొన్నాళ్ల క్రితమే పెళ్లయింది. నలుగురు కూతుళ్లు, ఓ కొడుకు కూడా ఉన్నారు. అయితే తరచూ భర్తతో గొడవలు అవుతుండటంతో అతడికి విడాకులు ఇచ్చింది. అయిదుగురు పిల్లలతో కలిసి వేరుగా ఉండటం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే గగన్ అగర్వాల్ అనే 38 ఏళ్ల వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు అతడు కూడా భార్యకు విడాకులు ఇచ్చి వేరుగా ఉంటున్నాడు. వీళ్లిద్దరూ గతేడాది జూన్ నెలలో ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నారు. అయిదుగురు పిల్లలతో సహా ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి వివేకానందనగర్ కాలనీలో కాపురం పెట్టారు. కొద్ది నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఫిబ్రవరి 8వ తారీఖు రాత్రి గగన్, సునీల్ అనే వ్యక్తితో కలిసి ఇంట్లోనే మద్యం తాగారు. మద్యం మత్తులో గగన్, తన భార్య నౌషీమ్ తో గొడవపడ్డాడు. ఇంట్లో ఉన్న కత్తిని అతడి గొంతులో దించింది. అక్కడికక్కడే పడిపోయిన అతడిపై పలుమార్లు దాడి చేసి చంపేసింది. అక్కడే ఉన్న సునీల్ ఈ దారుణాన్ని చూసి కంగుతిన్నాడు. ఆ తర్వాత గగన్ శవాన్ని మాయం చేసేందుకు నౌషీమ్ కు సహకరించాడు. ఇంట్లోనే సెప్టిక్ ట్యాంక్ గుంతలో శవాన్ని పూడ్చిపెట్టారు.
  ఇది కూడా చదవండి: నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి.. ఇంట్లోనే భర్తను పూడ్చిపెట్టిన చోట రోజూ నీళ్లు చల్లిన భార్య.. చంపి మంచి పనే చేశానంటూ కామెంట్స్

  ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు నౌషీమ్ ఫిర్యాదు చేసింది. తన కూతుళ్లు, కొడుకుతో సహా దగ్గరలోనే ఉన్న పుట్టింట్లోనే ఉంటోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేసి మొత్తానికి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ గుంతలో పూడ్చిపెట్టిన గగన్ మృతదేహాన్ని బయటకు తీశారు. విచారణలో ఆమె గంటగంటకూ కొత్త కథను అల్లుతుండటంతో అసలు నిజం ఏంటన్నది తెలియడానికి కష్టంగా మారుతోంది. ‘మొదటి భర్త వల్ల కలిగిన కూతుళ్లను లైంగికంగా వేధిస్తున్నాడు. అందుకే నా భర్తను నేను చంపా. మంచి పనే చేశా‘ అంటూ మొదట పోలీసులకు నౌషీమ్ చెప్పింది. అయితే ఈ వ్యవహారంలో సునీల్ అనే వ్యక్తి పాత్ర ఏంటన్నదానిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ‘నా భర్తను నేనే చంపా. కేవలం శవాన్ని పూడ్చిపెట్టడానికి మాత్రమే సునీల్ సాయపడ్డాడు. ఆయనకు దీంట్లో ఏం సంబంధం లేదు‘ అని ఆమె చెప్పింది. దీనిపై పోలీసులకు అనుమానం కలిగింది. ఆరా తీస్తే మరో షాకింగ్ నిజం బయటపడింది. సునీల్ కు, నౌషీమ్ కు వివాహేతర సంబంధం ఉందనీ, అతడిపై అనుమానం రాకుండా ఉండేందుకు భయ్యా అంటూ పోలీసుల ముందు, అందరి ముందూ పిలిచేదని తేలింది.
  ఇది కూడా చదవండి: ఇంట్లో నా భర్త నిద్రపోతున్నాడని చెప్పినా బలవంతం చేయడంతో.. ప్రియుడిని లోపలికి రానిచ్చిన భార్య.. ఆ తర్వాత..

  అదే కాకుండా భర్తను చంపేందుకు అసలు కారణమేంటో కూడా వెలుగులోకి వచ్చింది. పెళ్లికి ముందే ఆమెకు నలుగురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారన్న సంగతి గగన్ కు తెలుసు. అయినప్పటికీ ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. అదే సమయంలో ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేస్తానని ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. అయితే కూతుళ్ల పెళ్లిళ్ల విషయంలో అతడు మాట మార్చాడు. ’నువ్వు సునీల్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నావు. అది నాకు తెలుసు. నన్ను మోసం చేశావు. అందుకే నీ కూతుళ్ల పెళ్లికి డబ్బులివ్వను. ఆస్తిలో వాటా కూడా ఇవ్వను‘ అంటూ గగన్ తేల్చిచెప్పాడు. దీంతో తనకు ఆస్తిలో వాటా ఇవ్వడనీ, సునీల్ తో తన వివాహేతర సంబంధం బయటపడుతుందన్న భయంతోనే ఆమె ఈ నేరానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. ఆమెపై సానుభూతి రావడానికి కూతుళ్లను గగన్ వేధిస్తున్నట్టు కట్టుకథలు అల్లినట్టు వెల్లడించారు.
  ఇది కూడా చదవండి: నాకు పిల్లను వెతికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో.. అంటూ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన 26 ఏళ్ల కుర్రాడు
  Published by:Hasaan Kandula
  First published: