హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఆదిత్య 369 చూశారా? అచ్చం అలానే.. వికారాబాద్‌లో దిగిన వింత వస్తువు.. అసలేంటిది..?

Telangana: ఆదిత్య 369 చూశారా? అచ్చం అలానే.. వికారాబాద్‌లో దిగిన వింత వస్తువు.. అసలేంటిది..?

పంట పొలాల్లో దిగిన వింత వస్తువు

పంట పొలాల్లో దిగిన వింత వస్తువు

Vikarabad: పంట పొలాల్లో దిగిన ఆ వస్తువు స్పెయిన్ దేశానికి చెందినదిగా పలువురు సైంటిస్టులు తెలిపారు. స్పెయిన్ టూరిజంలో జనాలను ఆకాశంలో తరలించే పరికరమని వెల్లడించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన ఆదిత్య 369 (Adithya 369) మూవీని చూశారా? టైమ్ ట్రావెల్ (Trime Travel) కాన్సెప్ట్‌తో వచ్చిన ఆ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఐతే అలాంటి టైమ్ మెషీన్‌లానే కనిపించే ఓ వింత వస్తువు తెలంగాణ(Telangana)లో కనిపించింది. ఆకాశం నుంచి భూమి మీదకు దిగింది. వికారాబాద్ (Vikarabad) జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం మర్పల్లి మండల పరిసరాల్లో ఓ వింత వస్తువు ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. నింగిలో దానిని చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు. అదేంటో అర్ధం కాక గందరగోళానికి గురయ్యారు. గ్రహాంతరజీవులు (Aliens) ప్రయాణించే వాహననౌకగా ఉందని ప్రచారం జరగడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Telangana: పోలీస్ అభ్యర్థులకు అండగా ఐఏఎస్ అధికారి అంకిత్

కాసేపటి తర్వాత మొగిలిగుండ్లలోని పంట పొలాల్లో ఆ భారీ వస్తువు దిగింది. స్థానికులు భయంభయంగానే దగ్గరికి వెళ్లి చూశారు. అది అచ్చం ఆదిత్య 369 మూవీలోని టైమ్ మెషీన్‌లా ఉంది. కానీ అదేంటి? ఎక్కడి నుంచి వచ్చింది? అనే వివరాలు మాత్రం తెలియలేదు. దానిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సమాచారం అందుకున్న మండల తహశీల్దార్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ వింత వస్తువు గురించి ఉన్నతాధికారులకు వివరించారు.

ఐతే కొందరు అధికారులు దానిని హీలియం బెలూన్‌గా తేల్చారు. దాదాపు వెయ్యి కిలోల బరువు ఉన్నట్లు సమాచారం.  వాతావరణంలో మార్పుల అధ్యయనం కోసం శాస్త్రవేత్తుల పంపినట్లు అధికారులు తెలిపారు. బెలూన్ ఫెసిలిటీ ఆఫ్  టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో హీలియం బెలూన్‌ను పంపినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని వెల్లడించారు.

ఎమ్మెల్యేల బేరసారాల కేసు..జైలు నుండి సింహయాజి విడుదల..ఆ ఇద్దరు మాత్రం

మరికొందరు అధికారులు ఇంకోరకమైన విషయం చెప్పారు. పంట పొలాల్లో దిగిన ఆ వస్తువు స్పెయిన్ (Spain) దేశానికి చెందినదిగా పలువురు సైంటిస్టులు తెలిపారు. స్పెయిన్ టూరిజంలో జనాలను ఆకాశంలో తరలించే పరికరమని వెల్లడించారు. భారత ప్రభుత్వ సహకారంతో టాటా కంపెనీ వాళ్లు ఈ ప్రయోగం నిర్వహించినట్లు పేర్కొన్నారు. దీనికి కెమెరాలు ఉన్నాయని.. ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేసి.. జనాలు లేని ప్రాంతంలో దిగేలా చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇలాంటి వస్తువులు పర్యాటక రంగంలో కీలక భూమిక పోషిస్తాయని వెల్లడించారు.

వికారాబాద్‌లో దిగిన ఈ వింత వస్తువులపై అధికారుల్లోనే భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందువల్ల అసలు ఇదేంటన్న దానిపై ఇంకా కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అధికారులు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Telangana, Vikarabad

ఉత్తమ కథలు