Home /News /telangana /

MY VEMULAWADA CHARITABLE TRUST HELPING POOR PEOPLE IN VEMULAWADA TOWN HERE THE FULL STORY ABOUT THEM RKH BRV PRV

Serving Poor people: వాట్సాప్​ గ్రూప్​గా ప్రారంభమై చివరికి వాళ్లు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు.. ఏంటి వీళ్ల స్టోరి?

మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

'మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్' సభ్యులు

ఓ చిన్న సమూహంగా ప్రారంభమైంది ఈ "మై వేములవాడ వాట్సాప్ గ్రూప్" . ఆ తర్వాత వారికి వచ్చిన ఆలోచన వారిని వ్యక్తిత్వంలో ఉన్నత శిఖరాలకు చేర్చింది.

    (K. Haribabu, News18, Rajanna siricilla) 

    తోటి వారికి సహాయం (Helping) చేయాలనే సంకల్పం ఉంటే చాలు.. మనకు తోడుగా నిలిచేవారెందరో. సంకల్ప బలంతో ఒక్క అడుగు మనం ముందుకు వేస్తే..మరో పది మంది మనతో కలిసి వస్తారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ పట్టణంలోని నిరుపేదలకు, అభాగ్యులకు ఆహారం అందించాలని సంకల్పించిన కొందరు వ్యక్తులు.. వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ.. ఎక్కడ ఆకలి అంటే అక్కడికి వెళ్లి ఆహారం సరఫరా చేశారు. అలా ఓ చిన్న వాట్సాప్ గ్రూప్‌ (WhatsApp group)గా ప్రారంభమైన "మై వేములవాడ వాట్సాప్ గ్రూప్" కాస్త "మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ (My Vemula Wada charitable Trust)"గా మారి క్రమం తప్పకుండా తమ సేవలను (Serving) కొనసాగిస్తుంది.

    వాట్సాప్ గ్రూప్ నుంచి ట్రస్ట్ ఏర్పాటు వరకు..

    కరోనాకు ముందు వేములవాడ (Vemula Wada) శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం వద్ద కొందరు యాచకులు, నిరుపేదలు ఉండేవారు. ఒక్కసారిగా వచ్చిన కరోనా విపత్తు కారణంగా వారి బ్రతుకు ఛిద్రం అయింది. ఇది గ్రహించిన స్థానికులు కొందరు..ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు, నిరుపేదలకు, ఉచితంగా ఆహారం అందించి అండగా నిలిచారు. ఆసమయంలో పట్టణంలోని మరికొందరు దాతలు కూడా సహకరించడంతో వారంతా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని రోజు వారిగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక కరోనా అనంతరం కూడా తమ సహాయసహకారాలు కొనసాగిస్తున్నారు. అయితే మొదట్లో కేవలం వాట్సాప్ గ్రూప్‌గా మాత్రమే ఉన్న ఈ బృందంలోని (Group) సభ్యులు అనంతరం మరింత మందికి సహాయం చేయదలచి ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేశారు.



    "మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ (My Vemula Wada charitable Trust)" ఏర్పాటు చేసి విపత్తు సమయంలో మహమ్మారి బారిన పడి నిరుపేద కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయిన తరుణంలో వారికి ఆర్థిక సహాయం అందజేశారు. రోడ్డు ప్రమాదాల్లో తమ వారిని కోల్పయిన బాధితులకు, గాయాలపాలైన వ్యక్తుల కుటుంబాలకు మేమున్నామంటూ పెద్ద మనసుతో అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టింది మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్. "ఇప్పటి వరకు ట్రస్ట్ సభ్యుల సంఖ్య 2,063కు చేరిందని, ట్రస్ట్ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను చూసి ప్రజలు, దాతలు స్వచ్ఛందంగా పాలుపంచుకుంటున్నారని" ట్రస్ట్ సభ్యుడు మధు మహేష్ వివరించారు.

    కరోనా సమయంలో అండగా నిలిచిన ట్రస్ట్..

    కరోనా విపత్తు సమయంలో స్థానికంగా ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. ప్రజలకు ఎన్95 మాస్కులు, 100 మంది వృద్దులకు ఉపకరణాలు, నిరుపేద మహిళలకు చీరలు, బట్టలు పంపిణీ చేశారు. హోమ్ గార్డులకు డ్రస్సులు, శానిటైజర్లు, ఎనర్జీ డ్రింక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్, చిన్నారులకు దుస్తులు పంపిణీ చేసి స్ఫూర్తిగా నిలిచారు. తల్లిదండ్రులను కోల్పయి అనాథలుగా మారిన చిన్నారులకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేసినట్లు సభ్యులు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్న మానవత్వంతో స్పందించి అండగా నిలుస్తున్నారు. మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ (My Vemula Wada charitable Trust) చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు.

    పండుగల సమయంలోనూ మరింత మందికి సేవలు..

    మహా శివరాత్రి జాతర పర్వదినాన వేములవాడ రాజరాజేశ్వర స్వామి (Vemulawada Rajarajeswara Swamy) వారి ఆలయానికి వచ్చే భక్తుల సహాయార్థం ఉచిత వాటర్ బాటిల్స్, అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. మహా శివరాత్రి రోజున 1878 కిలోల అరటిపండ్లు, 10 వేల వాటర్ బాటిల్స్, శ్రీరామ నవమి రోజున 10 వేల వాటర్ బాటిల్స్,10 వేల బట్టర్ మిల్క్ పాకెట్స్, హనుమాన్ జయంతి రోజున అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయంలో 10 వేల వాటర్ బాటిల్స్, 220కిలోల అరటిపండ్లు, 5 వేల బట్టర్ మిల్క్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పట్టణంలో 5 వేల జూట్ బ్యాగ్స్ పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అని నిరూపించారు. ఇప్పటి వరకు 12,500 మందికి పైగా అన్నదానం చేసినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ట్రస్ట్  (My Vemula Wada charitable Trust) ఆధ్వర్యంలో చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

    త్వరలో ట్రస్ట్ కార్యాలయం ఏర్పాటు:

    మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ (My Vemula Wada charitable Trust) ఏర్పాటు చేసి జూన్ 9 నాటికి ఏడాది పూర్తి చేసుకుందని ట్రస్టు సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ట్రస్ట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ట్రస్ట్ సభ్యులను పట్టణ వాసులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సైతం అభినందిస్తున్నారు. నిరుపేదల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ఆహారం అందించేందుకు ట్రస్ట్ ఉపయోగపడడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని గ్రూప్ అడ్మిన్, గ్రూప్ సభ్యులు తెలిపారు. ట్రస్ట్ వివరాలు తెలుసుకుని తమకు తోచిన సహాయం చేసే దాతలు ముందుకు రావాలని సభ్యులు కోరుతున్నారు.

    మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్టును సంప్రదించవలసిన

    ఫోన్ నంబర్లు +91 93933 44405, +91 92469 39388.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona helping, Help for poor, Local News, Siricilla, Vemulawada, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు