హోమ్ /వార్తలు /తెలంగాణ /

Asaduddin Owaisi: కండోమ్ ఎక్కువగా వాడేది ముస్లింలే.. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

Asaduddin Owaisi: కండోమ్ ఎక్కువగా వాడేది ముస్లింలే.. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

అసదుద్దీన్ ఓవైసీ

అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వీధి కుక్కలకు లభించిన గౌరవం కూడా ముస్లింలకు దక్కడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జనాభా నియంత్రణ (Population Control)పై హైదరాబాద్ (Hyderabad) ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు.  మతం ఆధారంగా జనాభా అసమతుల్యత అనే అంశాన్ని విస్మరించరాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ముస్లిం జనాభా పెరగడం లేదని.. ఇంకా తగ్గుతోందని అన్నారు. ఈ దేశంలో కండోమ్‌లు  ఎక్కువగా వాడుతున్నది ముస్లింలేనని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటిపై మోహన్ భగవత్ మాట్లాడరని ఆయన విమర్శించారు .హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఓపెన్ జైల్లో ఉన్నట్లుగా భావన కలుగుతోందని పేర్కొన్నారు. వీధి కుక్కలకు లభించిన గౌరవం కూడా ముస్లింలకు దక్కడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దసరా సందర్భంగా నాగ్‌పూర్‌ (Nagpur)లో జరిగిన ఆర్ఎస్ఎస్ (RSS) కార్యక్రమంలో మోహన్ భగవత్ (Mohan Bhagwat) జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. మనదేశానికి సమగ్ర జనాభా విధానం అవసరమని స్పష్టం చేశారు. జనాభా అసమతుల్యత (Population Imbalance) కారణంగా భారతదేశం తీవ్ర పరిణామాలను చవిచూసిందని ఆయన అన్నారు. మతాల ప్రాతిపదికన జనాభాలో అసమతుల్యత 1947లో భారతదేశ విభజనకు కారణమైందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన ఏ మతం పేరు ప్రస్తావించనప్పటికీ.. ముస్లింలనే అన్నారని ఎంఐఎం మండిపడుతోంది. తమ జనాభా పెరగడం లేదని.. రోజురోజుకూ తగ్గుతోందని అసదుద్దీన్ ఓవైసీ ఎదురు దాడికి దిగారు.

First published:

Tags: AIMIM, Asaduddin Owaisi, Hyderabad

ఉత్తమ కథలు