టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. నేటి 5G రోజుల్లో మూఢనమ్మకాలు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదు. వీరి మూఢనమ్మకాలకు నిండు ప్రాణాలు బలవుతున్నాయి. ఇక ఇటీవల కేరళలో నరబలి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ మూఢనమ్మకాలు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. అవగాహన లేమితో గుడ్డిగా మూఢనమ్మకాలను అనుకరిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు.
ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి కలకలం రేగింది. KPHB హైదరగూడ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని చంపి అక్కడే తగలబెట్టారు. రేపు అమావాస్యతో పాటు సూర్యగ్రహణం ఉండడంతో బలి ఇచ్చి ఈ దారుణానికి పాల్పడినట్టు మొదటగా పోలీసులు అనుమానించారు. కానీ యువకుని హత్య క్షుద్రపూజల్లో భాగంగా జరగలేదని పోలీసులు తేల్చారు. అక్కడ క్షుద్రపూజలకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ హత్యకు దానికి సంబంధం లేదని తెలిపారు. అక్కడి పరిసరాలలో మిస్సింగ్ కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆ యువకుడి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలంలో క్లూస్ టీంతో ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.