Home /News /telangana /

MURDER FOR TWO WHEELER ACCUSED ARREST IN ADILABAD VRY ADB

Adilabad : టూ వీలర్ కోసం హత్య .. మాయ మాటలు చెప్పి యువకుడిపై దారుణం..

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Adilabad : అవసరం కోసం తమ వద్దకు వచ్చిన ఓ యువకున్ని గొంతుకోసి దారుణంగా హతమార్చాడు.. టూ వీలర్ కుదువపెట్టి డబ్బులు ఇప్పిస్తానని చెప్పి మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్లి యువకున్ని హతమార్చి టూ వీలర్‌తో ఉడాయించాడు.

    డబ్బు అవసరమై తన ద్విచక్ర వాహానాన్ని తనఖా పెడతామనుకున్న యువకుడికి మాయమాటలు చెప్పి, అటు ఇటు తిప్పి చివరకు కొంత దూరం తీసుకుపోయి దారుణంగా హత్య చేసి ద్విచక్ర వాహనంతో ఉడాయీంచిన ఘటనలో పోలీసులు ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

    వివరాల్లోకి వెళితే.. ఈ నెల ఒకటవ తేదీన  జైనథ్ మండల తర్ణం గ్రామం మీదుగా వేళ్ళే భోరజ్, చంద్రపూర్ రహదారిలో ఓ యువకుడిని గొంతుకోసి హతమార్చి రోడ్డు పక్కన పడేశారు. శవం కనబడకుండా ముళ్లకంప అడ్డుగ పెట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జైనథ్ పోలీసులు ఈ నెల నాలుగవ తేదీన సంఘటనా స్థలాన్ని పరిశీలించి గుర్తు తెలియని మృత దేహం హత్య కేసు నమోదు చేసుకున్నారు.  ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసు శాఖ ఆదిలాబాద్ డిఎస్పి వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో జైనథ్ సి.ఐ కొంక మల్లేష్, సిసిఎస్ సి.ఐ. ఈ చంద్రమౌళి మూడు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

    Siddipet : శ్రీ మంతుడిగా మారిన రిటైర్డ్ ఫ్రొఫెసర్... వారసులను కాదని..

    రంగంలోకి దిగిన సిఐలు ముందుగా గుర్తు తెలియని మృతదేహం ఆదిలాబాద్ పట్టణంలోని పుత్లిబౌలికి చెందిన ఇందూరు గజానంద్ (36)దిగా గుర్తించారు. గత 15 రోజులుగా అన్ని కోణాల్లో సమాచారాన్ని సేకరించి దర్యాప్తుని వేగవంతం చేశారు. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానం, స్థానికంగా సేకరించిన సాక్ష్యాధారాలతో గుర్తించిన నిందితులు ఆదిలాబాద్ మండలం బంగారిగూడ కు చెందిన షేక్ అస్లాం (22) ఎటుకోక విజయ్ (20) లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

    హతుడు ఇందూరు గజానంద్ తన ద్విచక్ర వాహనాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నిందితులు గమనించి మాయమాటలతో తాకట్టు పెట్టి డబ్బులు ఇప్పిస్తానని నమ్మించి చీకటి పడే వరకు శాంతి నగర్, వినాయక చౌక్, గాంధీ చౌక్ అదే ద్విచక్రవాహనంపై తిప్పుతూ చివరికి  తర్ణం గ్రామం మీదుగా వెళ్లే భోరజ్ చంద్రపూర్ రహదారి వైపు తీసుకెళ్లి ద్విచక్ర వాహనం యజమానిని గొంతు కోసి హత్య చేసి రోడ్డు పక్కన పడేసి కనబడకుండా ముళ్ళకంప అడ్డుగా పెట్టి ద్విచక్ర వాహనంను దొంగలించి పారిపోయారు.

    Dalita Bandhu : దళిత బంధు స్పీడప్.. 118 నియోజవర్గాల్లో అమలుకు డెడ్‌లైన్

    పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యల్లో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న అదిలాబాద్ పట్టణంలో  ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పి తెలిపారు. నిందితులను విచారించగా గజానంద్ వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని దొంగలించాలనే ఉద్దేశంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. పటిష్టమైన సాక్ష్యాధారాలు, సాంకేతిక పరిజ్ఞానం జోడించి కేసు దర్యాప్తును పూర్తి చేసి న్యాయస్థానంలో ఇరువురు నిందితులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నిందితులకు కఠినంగా శిక్షపడే విధంగా న్యాయస్థానంలో తుది నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Crime, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు