కనీస మానవత్వం, పరిస్థితుల పట్ల అవగాహాన, సమాజం పట్ల సోయి లేకుండా కొంతమంది వ్యవహరిస్తుంటారు. తమకు జరిగింది పెద్ద అన్యాయంగా భావించి ఎదుటివారికి తమకు ఇష్టంవచ్చిన రీతిలో ట్రీట్ చేస్తారు. ఆ సమయంలో విచక్షణ కొల్పోయి..తామేమి చేస్తున్నామో తెలియకుండా వ్యవహరిస్తారు. కనీసం చట్టాలు , పోలీసులు అనే భావన లేకుండా వ్యవహరించి చివరికి కటకటాలపాలు అవుతారు.
తాజాగా ఇలాంటీ వ్యవహర శైలి ఆరుగురి యువకులను కటకటాలపాలు చేసింది. చిన్న దాని కోసం తమ జీవితాలను ఫణంగా పెట్టిన సంఘటన నిజామాబాద్ జిల్లా చోటు చేసుకుంది. జిల్లా పట్టణ కేంద్రలోని
రైల్వేస్టేషన్ ముందు ఉన్న హోటల్ వద్ద స్విఫ్ట్కారు పార్క్చేసి టీ తాగుతుండగా కారులో ఉన్న సెల్ఫోన్ పోయింది.. దీంతో అక్కడే ఉన్న సంజయ్ అనే వ్య క్తిపై అనుమానం వచ్చింది..దీంతో రెచ్చిపోయిన నిందితులు బలవంతంగా ఆ వ్యక్తిని నిర్మానుష్య ప్రదేశమైన ఫ్రూట్ మార్కెట్ వెనుక రైల్వేట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం కర్రలతో చితకబాదారు. దీంతో తీవ్ర రక్త స్రవం కావడంతో సంజయ్ అక్కడికి అక్కడే మృతిచెందాడు.
దీంతో బయపడి పోయిన నిందితులు అక్కడ నుండి తప్పించుకుని వెళ్లిపోయారు..అయితే మృత దేహాన్ని చూసిన స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు.. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని మార్చురికి తరలించారు. హత్యకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయిన పోలీసులు.. సీసీ పూటేజ్ ఆధారంగా ఏపీ 25 ఏఎఫ్ 2367 కారును స్వాధీనం చేసుకుని విచారించారు.
దీంతో జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురు షేక్ అర్బాజ్, సయ్యద్ఫైజాన్, షేక్ జాహెరుద్దీన్, షేక్ కరీం, అబ్దుల్ ఇబ్రహీం, అబ్దుల్ హజీం సిద్దికిలలు నిందితులుగా గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించినట్టు ఏసీపి తెలిపారు.
కేవలం ఒక సెల్ఫోన్ కోసమే ఆరుగురు కలిసి ఒక వ్యక్తి ప్రాణాలు తీసారని ఏసీపీ తెలిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి స్విఫ్ట్డిజైర్ కారు, సుజుకి ద్విచక్రవాహనం, ఆటో, మూడు సెల్ఫోన్లు, హత్యచేసిన కర్రలను స్వాధీనం చేసుకున్నామని విరించారు.. మృతుడు మహారాష్ట్ర హద్గావ్ గ్రామానికి చెందినవాడుగా గుర్తించామని పోలీసులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Murder, Nizamabad police