Home /News /telangana /

MUNUGODU MLA KOMATIREDDY RAJAGOPAL REDDY WILL JOIN BJP ON 21ST AGUST IN PRESENCE OF AMIT SHAH SK

Komatireddy Rajagopal Reddy: తెలంగాణకు అమిత్ షా.. ఆ రోజే బీజేపీలో భారీగా చేరికలు

మీడియాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మీడియాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాజగోపాల్ రెడ్డి. ఒక చిల్లర దొంగ పార్టీకి అధ్యక్షుడయ్యాడని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పాత కాంగ్రెస్ నేతలెవరూ ఆయన నాయకత్వంలో సంతృప్తిగా లేరని మండిపడ్డారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    బీజేపీ(BJP)లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah) సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఆగస్టు 21న అమిత్ షా తెలంగాణ (Telangana)కు వస్తారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బహిరంగ సభను ఏర్పాటు చేసి.. ఆయన సమక్షంలో బీజేపీలో చేరతానని చెప్పారు. తనతో పాటు మరికొందరు ముఖ్య నేతలు కూడా కాషాయ పార్టీలోకి వస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం  ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీలో తన చేరే తేదీని ప్రకటించారు.

    Revanth Reddy: మునుగోడులో రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం.. వర్కవుట్ అవుతుందా

    ''మునుగోడుకు సీఎం కేసీఆర్  (CM KCR) నిధులు ఇవ్వడం లేదు. అభివృద్ధిని సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కే పరిమితం చేశారు. ఎన్నికలు వస్తేనే ఆయన నిధులు ఇస్తున్నారు. అందుకోసమే రాజీనామా చేశాను. అభివృద్ధిలో వెనకపడిపోయిన మనుగోడు కోసమే రాజీనామా చేశా. ఈ ఉపఎన్నిక తెలంగాణలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుంది. ఆగస్టు 21న అమిత్ షా తెలంగాణకు వస్తారు. ఆ రోజు నాతో పాటు మరికొందరు బీజేపీలో చేరుతారు. స్పీకర్‌ ఫార్మట్‌లో రాజీనామా లేఖను సిద్ధంగా పెట్టుకున్నా. కానీ ఆగస్టు 8 వరకు స్పీకర్ అందుబాటులో లేరు. ఆగస్టు 8న అందుబాటులో ఉంటారని తెలిసింది. అపాయింట్‌మెంట్ ఇస్తే ఆ రోజు స్పీకర్‌ని రాజీనామాను సమర్పిస్తా. లేదంటే అసెంబ్లీ కార్యదర్శికైనా అందజేస్తా. '' అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

    పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు.. బరాబర్ బరాబర్ చెప్పి పోతా

    పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాజగోపాల్ రెడ్డి. ఒక చిల్లర దొంగ పార్టీకి అధ్యక్షుడయ్యాడని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పాత కాంగ్రెస్ నేతలెవరూ ఆయన నాయకత్వంలో సంతృప్తిగా లేరని మండిపడ్డారు. మాపై ఆయన వాడరాని భాష వాడి తప్పు చేశారని.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతలెవరూ ఆ పార్టీలో ఉండరని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరికొంత మంది నేతలు కాంగ్రెస్ నుంచి బయటకు వస్తారని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.



    అమిత్ షాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయిన కాసేపటికే.. ఆయన సోదరుడు వెంటరెడ్డి కూడా హోంమంత్రితో సమావేశమయ్యారు. . ఐతే అమిత్ షాతో భేటీ వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కేవలం ప్రజల సమస్యలపైనే చర్చించామని అన్నారు. వరదల వల్ల తెలంగాణ ఎంతో నష్టపోయిందని.. రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేయాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు. ఒకవేళ పార్టీ మారితే.. బరాబర్ అందరికీ చెప్పే.. మారుతానని స్పష్టం చేశారు వెంకటరెడ్డి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Komatireddy rajagopal reddy, Telangana

    తదుపరి వార్తలు