• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • MUNUGODU CONGRESS MLA KOMATIREDDY RAJAGOPAL REDDY MAKES SENSATIONAL COMMENTS ABOUT CONTESTING IN NAGARJUNASAGAR ELECTIONS HSN

Komatireddy Raj Gopal Reddy: బీజేపీతో చర్చలు జరుగుతున్నాయ్.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో..

Komatireddy Raj Gopal Reddy: బీజేపీతో చర్చలు జరుగుతున్నాయ్.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ పొటో)

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అదే బాటలో మరికొంత మంది కీలక నేతలు పార్టీకి దూరం కాబోతున్నారా? నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని ఢీకొట్టేందుకు బీజేపీ పక్కా వ్యూహం రచిస్తోందా?

  • Share this:
    నాగార్జున సాగర్ లో జరగబోతున్న ఉప ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ లో మరింత కల్లోలాన్ని రేకెత్తించబోతోందా.? ఇప్పటికే సీనియర్ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అదే బాటలో మరికొంత మంది కీలక నేతలు పార్టీకి దూరం కాబోతున్నారా? నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని ఢీకొట్టేందుకు బీజేపీ పక్కా వ్యూహం రచిస్తోందా? టీఆర్ఎస్ కు గట్టిపోటీనిచ్చి నాగార్జున సాగర్ లో కమలం జెండా ఎగురవేసే నేతను వెతికి పట్టుకుంటోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

    ‘నాగార్జున సాగర్ లో పోటీ చేయమని బీజేపీ నేతలు కొందరు నన్ను సంప్రదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని అడుగుతున్నారు. కొద్ది రోజులుగా మా మధ్య ఈ వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించగల సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉంది. నాగార్జున సాగర్ లో బీజేపీ తరపున నేను కనుక రంగంలోకి దిగితే ఏడుసార్లు గెలిచిన సీనియర్ నేత అయిన జానారెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకోక తప్పదు.’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు.
    ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

    రాజగోపాల్ రెడ్డి ప్రకటనతో అటు కాంగ్రెస్ లోనూ, ఇటు టీఆర్ఎస్ లోనూ తీవ్ర చర్చనీయాంశమయింది. కొద్ది కాలంగా బీజేపీ పట్ల రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తే ఏ క్షణంలోనైనా ఆయన ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నాగార్జున సాగర్ లో కనుక ఆయన బరిలోకి దిగితే త్రిముఖ పోరు తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆయన చేసిన ప్రకటనను బీజేపీ అధికార ప్రతినిధి కె. కృష్ణ సాగర్ రావు ఖండించారు. బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయనీ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు ఏప్రిల్ 17వ తారీఖున పోలింగ్ జరగబోతోంది. మే 2వ తారీఖున కౌంటింగ్ జరగనుంది.
    ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు