Home /News /telangana /

MUNUGODU BYPOLLS CM KCR MEETS KANCHARLA BHUPAL REDDY BROTHER KRISHNA REDDY TO DISCUSS ABOUT BY ELECTIONS SK

Munugodu Bypolls: మునుగోడు రాజకీయాల్లో ట్విస్ట్... టీఆర్ఎస్ అభ్యర్థి ఆయన కాదా? కేసీఆర్ వ్యూహం ఇదేనా

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

Munugodu Bypolls: మునుగోడులోని టీఆర్ఎస్‌ కింది స్థాయి నేతలు కూసుకుంట్ల ప్రభాకర్‌కి టికెట్ ఇవ్వకూడదని కోరుతున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని ఓడగొడతామని స్పష్టం చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మనుగోడు ఉపఎన్నికల (Munugodu Bypolls) నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రసవత్తరంగా మారాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  (KomatiReddy Rajagopal Reddy)ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మరుక్షణం నుంచే హీటెక్కాయి. ఉపఎన్నికల్లో బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనుండగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎవరి పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.  ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నేతలు ఆసక్తి చూపుతున్నారు.  ఐతే ఇటీవల కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ (CM KCR)తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ అంతలోనే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

    మునుగోడులోని టీఆర్ఎస్‌ కింది స్థాయి నేతలు కూసుకుంట్ల ప్రభాకర్‌కి టికెట్ ఇవ్వకూడదని కోరుతున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని ఓడగొడతామని స్పష్టం చేశారు. మునుగోడుకు చెందిన టీఆర్ఎస్ నేతలు చౌటుప్పల్లో రహస్యంగా సమావేశమయ్యారు.  దండు మల్కాపూర్లోని ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న ఫంక్షన్ హాల్‌లో జరిగిన సమావేశానికి మునుగోడులోని అన్ని మండలాలకు చెందిన 300 మంది నాయకులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దని వారంతా తీర్మానం చేశారు. ఆయనకు తప్ప టికెట్ ఎవరికైనా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమలోనే కంచర్ల సోదరులకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy), ఆయన సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి (Kancharla Krishna Reddy) శనివారం సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

    Munugodu Bypoll: మునుగోడులో అమిత్ షా సభ వాయిదా..? కారణం ఇదే..

    మనుగోడులో ఆగస్టు 20న జరగనున్న టీఆర్ఎస్ సభ బాధ్యతలను వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. సభ విజయవంతమయ్యేలా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు. పార్టీ అభ్యర్థి గురించి టెన్షన్ అవసరం లేదని.. మునుగోడు సభా వేదికగా టీఆర్ఎస్ అభ్యర్థిని తానే ప్రకటిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారట. ఐతే కంచర్ల సోదరులను సీఎం కేసీఆర్ స్వయంగా పిలిపించడంతో కంచర్ల కృష్ణారెడ్డికే టికెట్ కేటాయించవచ్చనే ప్రచారం జరుగుతోంది.



    కంచర్ల భూపాల్ రెడ్డికి గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రెండుసార్లు పోటీ చేసిన అనుభవం ఉంది. భూపాల్ రెడ్డి గతంలో టీడీపీలో పని చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ నల్గొండ టికెట్‌ను బీజేపీకి కేటాయించింది. టీడీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భూపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2017లో తన సోదరుడు కృష్ణారెడ్డితో కలిసి ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెక్ పెట్టే సత్తా కంచర్ల సోదరులకే ఉన్నట్లు సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. మరి కృష్ణారెడ్డికే టికెట్ ఇస్తారా? లేదంటే ఇంకెవరికైనా కేటాయిస్తారా? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Munugode Bypoll, Munugodu By Election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు