Home /News /telangana /

MUNUGODU BYPOLLS 2022 TPCC CHIEF REVANTH REDDY WILL NOT PARTICIPATE IN AZADI KA AMRIT GAURAV PADAYATRA SK

Munugodu Bypoll: మునుగోడులో పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరం.. కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Munugodu Bypolls: . ఇవాళ మునుగోడులో కాంగ్రెస్ తలపెట్టిన పాదయాత్రకు హాజరుకావడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆఖరిని నిమిషలో ఈ నిర్ణయం తీసుకోవడం...  తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మునుగోడు ఉపఎన్నిక (Munugodu Bypolls) కాంగ్రెస్ పార్టీ (Telangana Congress)లో మళ్లీ చిచ్చుపెట్టింది. నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి.  ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మునుగోడులో కాంగ్రెస్ తలపెట్టిన పాదయాత్రకు హాజరుకావడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆఖరిని నిమిషలో ఈ నిర్ణయం తీసుకోవడం...  తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే పాదయాత్రకు దూరం కావడంతో.. కాంగ్రెస్ రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కాయి.

    భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆజాదీ గౌరవ్ యాత్ర (Azadi Gaurav Yatra)ను చేపట్టింది. మునుగోడులో ఉపఎన్నికలు ఉండడంతో ఆ నియోజకవర్గంలోనే యాత్రను తలపెట్టారు. నారాయణ్‌పూర్ నుంచి చౌటుప్పల్ వరకు 15 కి.మీ. మేర జరగాల్సిన పాదయాత్రలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. కానీ ఆఖరి నిమిషంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య సమస్యలతో పాదయాత్రకు హాజరుకావడం లేదని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నందున క్వారంటైన్‌లో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఐతే నిజంగానే అనారోగ్య సమస్యలున్నాయా? లేదంటే ఇంకేదైనా కారణమా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి రాకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి నేతృత్వంలో పాదయాత్ర జరుగుతోంది. ఈ కార్యక్రమంలో యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి, మునుగోడు స్థానిక నేతలు పాల్గొన్నారు.



    ఈ నిర్ణయానికి ముందు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పారు. చండూరు సభలో ఆయనపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలకు గాను..తాను క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఐతే రేవంత్ రెడ్డి క్షమాపణలకు వెంకటరెడ్డి కరగలేదు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్‌ (Addanki dayakar Comments)ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే.. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. అప్పటి వరకు మునుగోడు ఉపఎన్నికల (Munugodu By Elections)  జోలికి వెళ్లబోనని స్పష్టం చేశారు. ఆయన ఈ కామెంట్స్ చేసిన కాసేపటికే.. పాదయాత్రలో పాల్గొనడం లేదని రేవంత్ రెడ్డి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Komatireddy venkat reddy, Munugode Bypoll, Munugodu By Election, Revanth Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు