Home /News /telangana /

MUNUGODU BY ELECTIONS CM KCR MAY GO FOR EARLY POLLS BEFORE MUNUGODU BY ELECTION SAYS BJP LEADER INDRASENA REDDY SK

Munugodu: మునుగోడు ఉపఎన్నిక లేనట్లేనా? సీఎం కేసీఆర్ మాస్టర్ స్కెచ్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

Munugode Bypoll: మునుగోడుకు ఉపఎన్నిక రాకపోవచ్చని బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముందని ఆయన అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ (Telangana Politics)లో ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికల (Munugode Bypoll) గురించే అంతటా చర్చ జరుగుతోంది. మునుగోడు బైపోల్స్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల ఫలితం.. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులను తీసుకొస్తుందన్న అంచనాలున్నాయి. అందుకే మునుగోడు ఉప ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా  తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవకర్గ సభ్యుడు ఇంద్రసేనా రెడ్డి (BJP leader Indrasena Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎన్నికల కంటే ముందే.. సీఎం కేసీఆర్ (CM KCR) అసెంబ్లీని రద్దు చేయవచ్చని బాంబు పేల్చారు. ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.

    మంగళవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోస్ఠిగా మాట్లాడిన ఇంద్రసేనా రెడ్డి.. మునుగోడు ఉపఎన్నికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. దానిని ఆమోదింపజేసుకున్నప్పటికీ.. టీఆర్ఎస్‌లో కదలిక లేదని అన్నారు. ఆ పార్టీ తీరును చూస్తుంటే.. మునుగోడుకు ఉపఎన్నిక రాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముందని అన్నారు. ఒకవేళ ఉపఎన్నిక జరిగితే మాత్రం.. అక్కడ తప్పకుండా బీజేపీనే విజయం సాధిస్తుందని ఇంద్రసేనా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను లోక్‌సభకు పోటీ చేసినప్పుడు.. మునుగోడు సెగ్మెంట్‌లో 30వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. అంతేకాదు పదేళ్లుగా ఆ ప్రాంతంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గట్టి పట్టు ఉందని అన్నారు. 2018లో అంతటి కారు జోరులోనూ.. ఆయన ఈజీగా గెలిచారని.. అప్పుడు ఓడగొట్టని టీఆర్ఎస్.. ఇప్పుడెలా ఓడిస్తుందని అన్నారు. ఎవరు వచ్చినా? ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా.. గెలిచేది బీజేపీయేనని స్పష్టం చేశారు ఇంద్రసేనారెడ్డి.



    కాగా, ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అందువల్ల మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది.ఈ ఏడాది ఆఖరులో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటితో పాటు ఇక్కడ కూడా ఉపఎన్నిక నిర్వహించే అవకాశముంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 21న చౌటుప్పల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి.. కేంద్రహోమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆ సభ వేదికగా మరికొంత మంది నేతలు కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఆగస్టు 21న తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే రోజుగా నిలిచిపోతుందని.. బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ స్థాయిలో చేరికలు ఉంటాయంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Munugode Bypoll, Telangana Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు