Home /News /telangana /

MUNUGODE BYPOLL KOMATIREDDY RAJAGOPAL REDDY BJP AMIT SHAH MEETING LIKELY TO POSTPONE DUE TO THIS REASON SK

Munugodu Bypoll: మునుగోడులో అమిత్ షా సభ వాయిదా..? కారణం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Munugodu Bypolls: మునుగోడు ఉపఎన్నికల్లో ముగ్గురు బీజేపీ నేతలు కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ ముగ్గురితోపాటు మరో ఇద్దరితో కీలక కమిటీని త్వరలో బీజేపీ ప్రకటించనున్నట్లు సమాచారం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ (Telangana)లో ఇప్పుడు మనుగోడు ఉప ఎన్నిక  (Munugidu Bypoll) గురించే హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  (Komatireddy RajagopalReddy) రాజీనామా చేసిన మరుక్షణం నుంచే రాజకీయాలు వేడెక్కాయి. మునుగోడు ఉపఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్.. మూడు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలని బీజేపీ భావిస్తోంది. మనుగోడులో మళ్లీ గెలిచి పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మునుగోడు విజయంతో.. తెలంగాణలో కారు జోరుకు ఎదురు లేదని నిరూపించాలని.. గులాబీ వర్గం ఉవ్విళ్లూరుతోంది. ఈ మూడు పార్టీల టఫ్ ఫైట్‌తో...మునుగోడు హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది.

    ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా బీజేపీలో చేరలేదు. మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెట్టి..ఆ సభా వేదికగా ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆగస్టు 21న బహిరంగ సభ జరుగుతుందని.. ఆ సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా వస్తారని... ఆయన సమక్షంలో తాను బీజేపీలో చేరతానని ఇది వరకే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఐతే ఆ రోజు సభ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. మనుగోడులో అమిత్ షా సభ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 21న మునుగోడులో బీజేపీ తలపెట్టిన అమిత్ షా సభపై కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. ఇదే విషయాన్ని రాష్ట్ర నేతలకు పార్టీ పెద్దలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 21న ఒకవేళ సభ జరగకుంటే.. ఈ నెల 29న అమిత్ షా సభ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.



    మరోవైపు మునుగోడు ఉపఎన్నికల్లో ముగ్గురు బీజేపీ నేతలు కీలకంగా వ్యవహరించనున్నారు. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఈటల రాజేందర్.. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ రాజేందర్‌ అత్తగారి ఊరు మునుగోడు మండలం పలివెల. ఈ గ్రామ కేంద్రంగానే తన కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈటల రాజేందర్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతను మాజీ ఎంపీ వివేక్‌కు అప్పగించాల్సిందిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర నేతలను కోరారు. ఇక ఎన్నికల నిర్వహణలో దిట్టగా పేరొందిన మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా త్వరలో మునుగోడులో మకాం వేయనున్నారు. ఈ ముగ్గురితోపాటు మరో ఇద్దరితో కీలక కమిటీని త్వరలో బీజేపీ ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపాలన్న లక్ష్యంతో బీజేపీ క్షేత్ర స్థాయిలో తీవ్రంగా శ్రమిస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Komatireddy rajagopal reddy, Munugodu By Election, Telangana, Telangana Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు