హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugode Bypoll: కూసుకుంట్లే మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి.. సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన

Munugode Bypoll: కూసుకుంట్లే మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి.. సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన

సీఎం కేసీఆర్‌తో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

సీఎం కేసీఆర్‌తో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Munugode Bypoll: మునుగోడు ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం చండూరులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చండూరులోని తహశీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉపఎన్నికల్లో (Munugode Bypoll) టీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ వీడింది. గులాబీ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) పోటీచేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల పేరును సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) ప్రకటించారు. టీఆర్ఎస్‌లో బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ కూడా టికెట్ ఆశించారు.కానీ ముందు నుంచీ ప్రచారం జరుగుతున్నట్లుగానే.. కూసుకుంట్ల ప్రభాకర్‌కే టికెట్ దక్కింది. పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా.. నేతలెవరూ అసంతృప్తికి గురికావద్దని.. ఆశావాహులకు సీఎం కేసీఆర్ (CM KCR) ఇదివరకే చెప్పారు. అలాంటి నేతలను బుజ్జగించిన తర్వాతే.. కూసుకుంట్ల పేరును ప్రకటించినట్లు తెలుస్తోంది.

  టీఆర్ఎస్ అభ్యర్థిపై క్లారిటీ అయితే వచ్చింది కానీ..ఆయన ఎప్పుడు నామినేషన్ వేస్తారన్న వివరాలు తెలియాల్సి ఉంది. టీఆర్ఎస్‌ (TRS) పేరుతోనే బరిలోకి దిగుతారా? లేదంటే కొత్తగా ప్రకటించిన బీఆర్ఎస్ (BRS) పేరుతో ఎన్నికలకు వెళ్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్ఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం లైన్ క్లియర్ చేస్తే.. ఆ పేరుతోనే ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అప్పటి వరకు వేచిచూద్దామని.. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకే నామినేషన్ దాఖలు చేయవచ్చని సమాచారం. ఒకవేళ ఎన్నికల సంఘ నుంచి క్లియరెన్స్ రాకుంటే.. నామినేషన్స్ చివరి రోజున.. టీఆర్ఎస్ పేరుపైనే కూసుకుంట్ల నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది.

  Munugodu : ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రజాగాయకుడు .. ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా గద్దర్ ప్రచారం షురూ

  మునుగోడు ఉపఎన్నికల్లో  పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి  బరిలో ఉన్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఈ మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతోంది. ఈ  ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మూడు పార్టీలూ పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే అన్ని గ్రామాల్లో తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

  మరోవైపు మునుగోడు ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం చండూరులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చండూరులోని తహశీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు.  ఈ నెల 14 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. రెండో శనివారం, ఆదివారం రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నవంబరు 6న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్‌ పూర్తయ్యాక విజేతను ప్రకటిస్తారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Munugode Bypoll, Munugodu, Munugodu By Election, Telangana, Trs

  ఉత్తమ కథలు