Home /News /telangana /

MUNUGODE BYPOLL AMIT SHAH WILL COME TO MUNUGODU ON 21ST AGUST BJP STATE LEADERS GETS CONFIRMATION FROM DELHI SK

Munugodu Bypoll: మునుగోడు సభపై క్లారిటీ.. అమిత్ షా వచ్చేది ఆ రోజే.. ఇంచార్జిల నియమించిన బీజేపీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Munugode Bypolls: బుధవారం జనగామలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షన ఈ భేటీ జరిగింది. అమిత్ షా సభకు భారీగా జన సమీకరణ చేయాలని నేతలకు ఆయన సూచించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. ఉపఎన్నికల్లో (Munugode Bypolls) గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహ రచనలో బిజీగా ఉన్నాయి. పోటా పోటీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ముందుగా అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఈ నెల 20న భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఆ సభ వేదికగా మునుగోడుపై సీఎం కేసీఆర్ (CM KCR) వరాలు జల్లు కురిపించే అవకాశముంది. అలాగే అభ్యర్థిపైనా ప్రకటన చేస్తారు. ఆ మరుసటి రోజే బీజేపీ సభ జరగనుంది. ఐతే ఆగస్టు 21న బీజేపీ సభ జరగకపోవచ్చని.. హోంమంత్రి అమిత్ షా (Amit Shah Munugode Meeting) కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ ఢిల్లీ నుంచి సమాచారం అందడంతో.. ఆగస్టు 21నే సభను నిర్వహించనున్నారు. ఆ సభా వేదికగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy RajagopalReddy) తో పాటు మరికొందరు నేతలు బీజేపీలో చేరనన్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లలో బీజేపీ నేతలు బిజీ అయ్యారు. మునుగోడు బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం బీజేపీ నాయకులు పరిశీలించారు. డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి సభా స్థలిని సందర్శించారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.

  BJP| Telangana: తెలంగాణ బీజేపీ నేతకు పెద్ద పదవి.. రాష్ట్రంపై మరింతగా ఫోకస్

  బుధవారం జనగామలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షన ఈ భేటీ జరిగింది. అమిత్ షా సభకు భారీగా జన సమీకరణ చేయాలని నేతలకు ఆయన సూచించారు. అంతేకాదు జన సమీకరణ, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఒక్కో మండలానికి ఇద్దరు సీనియర్ నేతల చొప్పున ఇంఛార్జీలుగా నియమించారు. కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలంతో సహా మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీల బాధ్యతను 18 మంది సీనియర్ నాయకులకు అప్పగించారు.

  చౌటుప్పల్ మండలానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు,ఏనుగు రవీందర్ రెడ్డి, మునుగోడుకి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సంస్థాన్ నారాయణపురం మండలానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, చండూరు మండలానికి మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, చండూరు మున్సిపాలిటీకి పార్టీ శాసనసభాపక్షనేత రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, గట్టుప్పల్ మండలానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, మర్రిగూడెం మండలానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి, నాంపల్లి మండలానికి మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావును ఇంచార్జిలుగా నియమించారు.  మునుగోడు ఉపఎన్నికల్లో ముగ్గురు బీజేపీ నేతలు కీలకంగా వ్యవహరించనున్నారు. అమిత్ షా సభ తర్వాత వీరు మునుగోడులోనే మకాం వేసేలా వ్యూహాన్ని రచిస్తున్నారు. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ రాజేందర్‌ అత్తగారి ఊరు మునుగోడు మండలం పలివెల. ఈ గ్రామ కేంద్రంగానే తన కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈటల రాజేందర్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతను మాజీ ఎంపీ వివేక్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణలో దిట్టగా పేరొందిన మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా త్వరలో మునుగోడులో మకాం వేయనున్నారు. ఈ ముగ్గురితోపాటు మరో ఇద్దరితో కీలక కమిటీని త్వరలో బీజేపీ ప్రకటించనున్నట్లు సమాచారం.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Amit Shah, Munugode Bypoll, Munugodu By Election, Telangana, Telangana Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు