Home /News /telangana /

MUNUGODE BY POLLS CONGRESS LEADERS AND CADRE HAVE CONFUSION ON KOMATIREDDY VENKAT REDDY SK

Komatireddy Venkata reddy: తమ్ముడి బాటలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారా?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి

Munugode Bypoll: బీజేపీలోకి వెళ్తారని జరుగుతున్న ప్రచారంపై ఇటీవల కొందరు కౌన్సిలర్లు ఆరాతీశారట. ఐతే అదేమీ లేదని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పారట. 20 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా తనకు ఉందని.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం అవుతానని స్పష్టం చేశారట.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) రాజీనామా తర్వాత కాంగ్రెస్‌లో రచ్చ జరుగుతోంది. ఆయన ఈ నెల 21న బీజేపీలో చేరుతున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy) సోదరుడు పరిస్థితేంటి? ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? లేదంటే తమ్ముడి బాటలోనే బీజేపీలోకి వెళ్తారా? ఇప్పుడు దీని గురించే హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ఓ వైపు మునుగోడు ఉప ఎన్నికలు దొగ్గరకొస్తున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటి నుంచే ప్రచారంలోకి దిగుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా మునుగోడు (Munugode Bypoll)లోనే మకాం వేసి వ్యూహాలకు పదును పెడుతున్నారు. కానీ తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఇంత జరుగుతున్నా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం..సైలెంట్‌గా ఉన్నారు. ఆయన తీరు ఇటు కాంగ్రెస్ నేతలు.. అటు కేడర్‌ను కూడా అయోమయానికి గురి చేస్తోంది.

    Telangana: తెలంగాణలో భారీగా పెరగనున్న కరెంట్ చార్జీలు..? మరో షాక్ తప్పదా?

    మునుగోడులో కాంగ్రెస్ నిర్వహించిన సభలో అద్దంకి దయాకర్.. వెంకటరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనిపై పీసీసీ పెద్దలు క్షమాపణలు చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అద్దంకి దయాకర్‌తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా ఒక మెట్టు దిగి... క్షమాపణలు చెప్పారు. ఐతే సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడే బహిరంగ క్షమాపణలు చెప్పినా.. వెంకటరెడ్డి ఒప్పుకోవడం లేదు. రోజుకో కొత్త మెలిక పెడుతూ వస్తున్నారు. మొదట క్షమాపణలు చెప్పాలన ఆయన.. ఆ తర్వాత అద్దంకిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడేమో స్టార్ క్యాంపెయినర్‌గా నియమిస్తేనే.. మునుగోడు ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేస్తున్నారు.

    మరోవైపు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచే.. మునుగోడులో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ సీరియస్‌గా దృష్టిసారించింది. అనేక కార్యక్రమాలను చేపడుతోంది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా... పట్టించుకోవడం లేదు. అంతా పార్టీ పెద్దలే చూసుకుంటారని.. దాట వేస్తూ వస్తున్నారు. తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం చేసే పరిస్థితి లేదని అక్కడి ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ్ముడిలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.



    ఇటీవల నల్గొండకు వచ్చిన వెంకటరెడ్డిని కొంత మంది కౌన్సిలర్లు... వెంకట్‌రెడ్డిని కలిశారట. బీజేపీలోకి వెళ్తారని జరుగుతున్న ప్రచారంపై ఆరాతీశారట. ఐతే అదేమీ లేదని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పారట. 20 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా తనకు ఉందని.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం అవుతానని స్పష్టం చేశారట. తాను పార్టీని వీడేది లేదని.. అవసరమైతే రేవంత్‌రెడ్డే కాంగ్రెస్‌ నుంచి బయటకు పోతారని వ్యాఖ్యానించారట. తాను పార్టీ మారేది లేదని వెంకటరెడ్డి స్పష్టం చేసినప్పటికీ.. ఆయన మాటల్లో ఏదో తేడా ఉందని.. కార్యకర్తలు చర్చించుకుంటున్నారట.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Komatireddy rajagopal reddy, Komatireddy venkat reddy, Munugode Bypoll, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు