హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugode By-poll: మునుగోడు పోరుకు నేటి నుంచే నామినేషన్లు.. కేటీఆర్, హరీష్ రావుకు కీలక బాధ్యతలు

Munugode By-poll: మునుగోడు పోరుకు నేటి నుంచే నామినేషన్లు.. కేటీఆర్, హరీష్ రావుకు కీలక బాధ్యతలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Munugode By-poll: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్ఎస్ టికెట్ ఖాయమైందని తెలుస్తోంది. నేడు ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముంది. నామినేషన్లకు ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే ఆయనకు టీఆర్ఎస్ కార్యాలయం నుంచి సమాచారం వెళ్లిందట.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణలో రాజకీయాల్లో (Telangana Politics) సెగలు రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక (Munugode By-poll) ప్రక్రియ ఇవాళ్టి నుంచి మొదలుకానుంది. నేటి నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. ఇందుకోసం చండూరులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చండూరులోని తహశీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు.  ఈ నెల 14 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. రెండో శనివారం, ఆదివారం రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నవంబరు 6న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్‌ పూర్తయ్యాక విజేతను ప్రకటిస్తారు.

  KCR: మునుగోడు అభ్యర్థిపై ఇంకా తేల్చని కేసీఆర్ .. అసలు వ్యూహం ఇదేనా

  నేటి నుంచే నామినేషన్‌లు మొదలుకానుండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని వేగవంతం చేశారు. అన్ని ప్రధాన పార్టీల నేతలంతా మునుగోడుకు వెళ్తున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఈ ఉపఎన్నికను ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలనంతా మునుగోడులో దింపి.. ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. 2,500 ఓటర్లకు ఒక ఎమ్మెల్యే చొప్పున.. 86 మంది ఎమ్మెల్యేలు మునుగోడులోనే ఉండాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఉపఎన్నికల బాధ్యతను మంత్రివర్గం మొత్తానికి అప్పగించింది. మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) మానిటరింగ్ బాధ్యతలను అప్పగించారు. శుక్రవారం సాయంత్రానికల్లా నేతలంతా మునుగోడుకు చేరుకోవాలని టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. పోలింగ్‌కు మూడు రోజుల వరకు అక్కడే ఉండాలని.. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని స్పష్టం చేసింది.

  మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న దానిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఖాయమైందని తెలుస్తోంది. నేడు ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముంది. నామినేషన్లకు ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే ఆయనకు టీఆర్ఎస్ కార్యాలయం నుంచి సమాచారం వెళ్లిందట. అక్టోబరు 12-14 మధ్య ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశముందని సమాచారం. ఇక కాంగ్రెస్ , బీజేపీ నుంచి ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పాల్వాయి స్రవంతి పోటీచేస్తున్నారు.

  అటు బీజేపీ కూడా తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. మునుగోడు ఉపఎన్నికలపై గురువారం ఆర్ఎస్ఎస్ ప్రతనిధులతో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. మునుగోడులో బీజేపీ నిర్వహించిన సర్వేపై ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చర్చలు జరిపారు. గెలుపు కోసం ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సమాలోచనలు చేశారు. కాంగ్రెస్ కూడా నేటి నుంచి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనుంది. నేటి నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గమంతా పర్యటించనున్నారు. ఈ నెల 14న పాల్వాయి స్రవంతి నామినేషన్ వేయనున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Munugode Bypoll, Munugodu, Munugodu By Election

  ఉత్తమ కథలు