Home /News /telangana /

MUNUGIDE BYPOLL CHOUTUPPAL MPP TADURI VENKAT REDDY JOINS BJP IN PRESENCE OF EATALA RAJENDER SK

Munugode ByPoll: మునుగోడులో బీజేపీ దూకుడు... టీఆర్ఎస్‌కు మరో కీలక నేత గుడ్‌బై

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Munugode By polls: ఇటీవల టీఆర్ఎస్ అసమ్మతి నేతలంతా మంత్రి జగదీశ్వర్ రెడ్డితో సమావేశమయ్యారు. పార్టీ చెప్పినట్లే నడుచుకుంటామని చెప్పారు. ఐతే ఆ మరుసటి రోజే వారిలో కొందరు నేతలు చౌటుప్పల్ ఎంపీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని తీర్మానించారు

ఇంకా చదవండి ...
  తెలంగాణలో మునుగోడు (Munugodu Politics) రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మనుగోడు (Munugode Bypoll)లో ఎలాగైనా గెలిచి.. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. తమ ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్.. అధికార పార్టీ సత్తా చూపించాలని టీఆర్ఎస్.. ఇలా ఎవరికి వారు వ్యూహాలకు పదునుపెడుతున్నారు.  ఐతే ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంటున్న బీజేపీ.. మునుగోడు ఎన్నికల వేళ దూకుడు మరింత పెంచింది.  ఆగస్టు 21న అమిత్ షా సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీలో చేరనుండగా.. అంతకంటే ముందే ఆపరేషన్ ఆకర్ష్‌ మొదలుపెట్టింది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. తన పనిని తాను సైలెంట్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు.

  తాజాగా మునుగోడుకు చెందిన కొందరు టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మాజీ జెడ్పీటీసీ, మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కంది లక్ష్మారెడ్డిలు.. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.  ఇటీవల టీఆర్ఎస్ అసమ్మతి నేతలంతా మంత్రి జగదీశ్వర్ రెడ్డితో సమావేశమయ్యారు. పార్టీ చెప్పినట్లే నడుచుకుంటామని చెప్పారు. ఐతే ఆ మరుసటి రోజే వారిలో కొందరు నేతలు చౌటుప్పల్ ఎంపీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని తీర్మానించారు. అంతలోనే వారంతా బీజేపీ గూటికి చేరారు.

  Revanth Reddy: రేవంత్ రెడ్డి నిజంగానే మారిపోయారా ?.. లేక ప్లాన్ మార్చారా ?

  కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మండిపడ్డారు. హుజూరాబాద్ ప్రజలు చెంప చెళ్లుమనిపించినా సీఎం కేసీఆర్‌కు ఇంకా బుద్ధి రాలేదని.. ఆయన తీరుతో టీఆర్ఎస్ నేతలకు వెగటు పుట్టిందని అన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. పార్టీకి రాజీనామా చేస్తున్న వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని విమర్శించారు ఈటల రాజేందర్. తాను బీజేపీలోకి చేరుతున్నందునే టీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారని వెంకటరెడ్డి అన్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవద్దని చెప్పినందుకే తనను దూరం పెట్టారని ఆరోపించారు. బీజేపీలో చేరేందుకు మరికొందరు టీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.  కాగా, సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ మన్సూరాబాద్‌లోని తాడూరి వెంకటరెడ్డి నివాసం వద్ద హైడ్రామా జరిగిన విషయం తెలిసిందే. చౌటప్పల్ నమోదైన ఓ కేసు గురించి మాట్లాడాలని వెంకటరెడ్డి ఇంటికి మఫ్టీలో ఉన్న పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లో లేరని.. అర్ధరాత్రి ఇంటికి రావడమేంటని కుటుంబ సభ్యులు పశ్నించారు. సమాచారం అందడంతో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి అక్కడికి వెళ్లి.. పోలీసులను నిలదీశారు. అనంతరం సరైన సమాధానం ఇవ్వకుండానే రెండు వాహనాల్లో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామాల అనంతరం మంగళవారం ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు తాడూరి వెంకటరెడ్డి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Munugode Bypoll, Munugodu By Election, Telangana

  తదుపరి వార్తలు