( Sayyad Rafi, News 8, Mahbubnagar)
సేంద్రియ ఎరువుల (Organic Fertilizers) తయారీకి పురపాలక సంఘాలు (Municipalities) వినూత్న రీతిలో ముందుకు వెళుతున్నాయి. ఎక్కడో మారుమూలలో ఉండే ప్రభుత్వ స్థలాల్లో ఎరువుల తయారీ విధానం ఇన్నాళ్లూ మనం చూశాం. కానీ ఇప్పుడు పట్టణాలలోని ఇళ్ల మధ్యలో ఉండే పార్కు స్థలంలోనే(In parks) ఎరువులు తయారు చేసి ఉపయోగించుకునే పద్ధతి కి ఈ పురపాలికలు శ్రీకారం చుడుతున్నాయి. పార్కింగ్ స్థలాలు సేంద్రియ ఎరువు తయారీ ఫిట్ గుంతలు ఏర్పాటు చేయాలనే ఎస్ఐయుఎం (SIUM) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (National Institute of Urban management) సూచనలను మహబూబ్నగర్ (Mahbubnagar) జిల్లా పురపాలిక పారిశుద్ధ్య విభాగం పట్టణంలోని మూడు చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది. ఫిట్స్ నిర్మాణానికి పురపాలిక సాధారణ నిధులు వినియోగిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి పురపాలికలో కనీసంగా మూడు నుంచి ఐదు చోట్ల పార్కు స్థలాల్లో (park places) ఈ ఫిట్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు డాక్టర్ ఎం సత్యనారాయణ (Satya narayana) ఇటీవల కమిషనర్లను ఆదేశించారు.
అనేక ప్రయోజనాలు..
పార్కు స్థలాల్లోనే సేంద్రియ ఎరువు తయారీ (organic fertilizer) ఫిట్ ను ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా ఇళ్ల యజమానులు వ్యాపార సముదాయాల వాళ్ళు రోజు తడి చెత్తను వీధుల్లోనూ లేదా మురుగు కాలువలోనే పడేస్తారు. ఇది పారిశుద్ధ్య సిబ్బందికి పెద్ద సమస్యగా మారింది. చెత్త కోసం ఇళ్ల ముందుకు వస్తున్న స్వచ్ఛ ఆటోలకు తడి పొడి వేరు చేసి అందించడం లేదు. స్వచ్ఛ ఆటో లో తీసుకున్న చెత్త నుంచి డంపింగ్ యార్డ్ వద్ద తడి పొడి పదార్థాలను వేరు చేయడానికి పారిశుద్ధ్య సిబ్బంది ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఎంఐయుఎం ఆలోచనలకు పదును పెట్టింది.
అదనపు ఆదాయం కూడా..
పురపాలికల్లో పార్కుల ఫిట్ లను ఏర్పాటు చేస్తే అక్కడే తడి చెత్త వేసే అవకాశం ఉంటుందని సూచించింది. ఇలా అలా తడి చెత్తను పోగుచేసి సేంద్రియ ఎరువు రూపొందిస్తే అక్కడే ముక్కలను పురపాలికలు నిర్వహిస్తున్న గార్డెన్ నర్సరీలో ఈ ఎరువు అందించవచ్చు. ఎక్కువగా ఉత్పత్తి అయితే అవసరమైన రైతులకు ఎరువు విక్రయించి అదనపు ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పురపాలికల సంఘాల్లో నెల రోజుల్లో సేంద్రియ ఎరువు తయారీ ఫిట్ ను ఏర్పాటు చేసి ఫోటోలను నిర్మాణ వ్యయ నివేదికను సీడీఎం ఏ వెబ్ సైడ్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని ఆదేశాలు వచ్చాయని పురపాలికలు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ పురపాలికల్లో సేంద్రియ ఎరువు (organic fertilizer)తయారీ ఫిట్ ఏర్పాటు పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇతర పురపాలికల్లో ఇంకా ఫిట్ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, Mahbubnagar, Organic Farming