Home /News /telangana /

MUNICIPAL MINISTER KTR HAS ORDERED THE OFFICIALS TO REFUSE THE CONSTRUCTION OF HOUSES SUBMERGED IN FLOODS RECENTLY PRV

KTR | Real Estate: మంత్రి కేటీఆర్​ సంచలన నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతుల నిరాకరణ..

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ పోటో)

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ పోటో)

తెలంగాణలో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్​ తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ (Municipal Affairs minister KTR) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వరద (Floods) ముంపునకు గురైన వెంచర్లు, ఖాళీ స్థలాల్లో భవిష్యత్తులో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని మున్సిపల్‌ శాఖ (Municipal Department)ను ఆదేశించారు.  ఈ మేరకు ఉన్నతాధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు (Heavy rains) మేడ్చల్‌ మల్కాజిగిరి, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్‌,  రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీల శివార్లలోని అనేక నివాసాలు నీటమునిగాయి.  ఈ  నేపథ్యంలో హెచ్‌ఎండీఏ (HMDA), డీటీసీపీ లేఅవుట్లలోని నిర్మాణాలకు, ఎల్‌ఆర్‌ఎస్‌ (LRS) ద్వారా క్రమబద్ధీకరించుకున్న ప్లాట్లలో అనుమతుల విషయంలో ఎలాంటి నిబంధనలను అమలు చేయాలనే విషయమై పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది.  కొద్దిరోజుల కిందట భారీవర్షాల వల్ల తెలంగాణలోని పలు పట్టణాల్లో ని ఏయేప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయనే విషయమై పురపాలక శాఖ నివేదిక రూపొందించింది. అందుకు గల కారణాలను కూడా పేర్కొన్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ శివార్లలో మొన్నటివరకు గ్రామ పంచాయతీలుగా ఉన్న ప్రాంతాలన్నీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా మారాయి. చెరువులు, కుంటలుగా ఉన్న ప్రాంతాలు పూడుకుపోయిన చోట్ల, శిఖం భూములుగా ఉన్న ప్రాంతాల్లోనే పట్టణాలు విస్తరించినట్లు అధికారులు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. ఆయా ప్రాంతాలకు ఆనుకొని కొత్తగా ఏర్పాటైన వెంచర్లు కూడా ముంపు ప్రాంతాలుగా నే ఉన్నట్లు పురపాలక శాఖ నిర్ణయానికి వచ్చింది.

  రికార్డు స్థాయిలో వరదలు..

  వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా గోదావరి (Godavari) జూలై నెలలోనే ఉగ్రరూపం దాల్చింది. సాధారణంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో వచ్చే వరదలు ఈసారి జూలైలోనే (July) రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీఎత్తున వరదలు వచ్చాయి. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వందలాది ఇళ్లు మునిగిపోయాయి. దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో అప్పట్లో భద్రాచలంలో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR Bhadrachalam Tour).. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతామ‌ని హామీ ఇచ్చారు. గోదావరి ప్రవాహం (Godavari Floods) 90, 100 అడుగులుకు చేరినా.. ఇబ్బందలు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరద ముంపున‌కు గుర‌య్యే ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎత్తైన ప్ర‌దేశంలో రూ. 1000 కోట్ల‌తో కొత్త కాల‌నీ నిర్మిస్తామ‌ని చెప్పారు. ఆ కాలనీ భూమి పూజకు తానే స్వయంగా వస్తానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్ (CM KCR).
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Constructions, House, KTR, Real estate

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు