Medak : కుక్కలను చంపించినందుకు కమిషనర్‌పై వేటు.. పోలీసు కేసు నమోదు..

ప్రతీకాత్మక చిత్రం

Medak : వీధి కుక్కలను చంపి పాతిపెట్టించినందుకు మున్సిపల్ కమిషనర్‌పై వేటు పడింది. అంతే కాదు ఆయనపై పోలీసు కేసు నమోదు అయింది. మరోవైపు జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

  • Share this:
    మెదక్​ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్‌పై ( Municipal commissioner )సస్పెన్షన్ వేటు పడింది. వీధికుక్కలను సామూహికంగా చంపినందుకు ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ అశ్రిత్‌ను పురపాలకశాఖ డైరెక్టర్‌ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా మెదక్ జిల్లా స్థానికసంస్థల అదనపు కలెక్టర్​ను నియమించారు. నివేదికను 15 రోజుల్లోగా ఇవ్వాలని సీడీఎంఏ సత్యనారాయణ ఆదేశించారు.

    పిచ్చికుక్క కరడవడంతో..

    మెదక్ జిల్లా నర్సాపూర్‌లో దసరా నాడు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కొందరిని పిచ్చికుక్క ( Dog bite ) కరిచింది. దీంతో వీది కుక్కల స్థైర్యవిహారంపై ఆగ్రహించిన స్థానికులు పిచ్చికుక్కతో పాటు దాని బారినపడ్డ వాటిని చంపేయడంతోపాటు,స్థానిక పురపాలక శాఖ కమిషనర్‌కు సమాచారం అందించారు. దీంతో కమిషనర్ ఆశ్రీత్ ‌ను కుక్కలను చంపాలని ( Dogs Killing ) ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మున్సిపల్ సిబ్బంది కుక్కలకు విషమిచ్చి చంపి వాటిని పాతిపెట్టారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు సుమారు రెండు వందల కుక్కలను చంపి పాతిపెట్టినట్టు తెలుస్తోంది.

     ఇది చదవండి : తనకు తెలియకుండ చేసిన పనికి కోపంతో ఊగిపోయిన మహిళ.. చుక్కలు చూపించింది..!


    పీపుల్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ ఫిర్యాదు

    కాగా ఈ విషయం తాజాగా వాటిలో 200లకు పైగా కుక్కలకు విషమిచ్చి చంపారని (Street Dogs were Killed), పురపాలక సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీపుల్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ సహాయ మేనేజర్లు గౌతమ్, శివనారాయణ, జంతు ప్రేమికుడు పృథ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వెంటనే కుక్కలను చంపిన ప్రదేశంలో జేసీబితో తవ్వించారు. కొన్ని కళేబరాలు బయటపడగా వాటికి పశుసంవర్ధకశాఖ ఏడీ డాక్టర్ జనార్దన్ రావు పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో కుక్కలను చంపినట్టు నిర్ధారించుకున్న తర్వాత కమీషనర్‌పై చర్యలకు ఉపక్రమించారు. జంతు చట్టాల ప్రకారం కుక్కలను చంపడం నేరంగా పరిగణించి ఆయన కేసు నమోదు చేశారు.

    ఇది చదవండి : బుటకపు ఎన్నికలు రద్దు చేయండి.. ఎన్నికల కమిషన్‌కు కాంగ్రేస్ ఫిర్యాదు..

    Published by:yveerash yveerash
    First published: