హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Development: సీఎం కేసీఆర్​ ఆదేశాలతో ఆ ప్రాంతంలో ఊపందుకున్న అభివృద్ధి: హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

Telangana Development: సీఎం కేసీఆర్​ ఆదేశాలతో ఆ ప్రాంతంలో ఊపందుకున్న అభివృద్ధి: హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

X
ములుగు

ములుగు

జిల్లా ఏర్పాటుతో ములుగు ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లైంది. జిల్లా ఏర్పాటు చేసిన మూడేళ్ళలోనే ములుగును మునిసిపాలిటీగా ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

(Venu Medipelly, News18, mulugu)

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో (Telangana) ములుగు ప్రాంత అభివృద్ధికి రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (CM KCR) ములుగుప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ములుగు (Mulugu) ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటిస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన హామీ ప్రకారం 2019లో ములుగు ప్రాంతాన్ని 9 మండలాలతో జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పాటుతో ములుగు ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లైంది. జిల్లా ఏర్పాటు చేసిన మూడేళ్ళలోనే ములుగును మునిసిపాలిటీగా ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం  (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది.

ఒక ప్రాంతాన్ని మునిసిపాలిటీగా ఏర్పాటు చేయడానికి ప్రధానంగా జనాభా సమస్య అడ్డువచ్చేది. ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం ములుగు ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. ములుగు ప్రస్తుతం మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగుతుంది. ఇటీవల గోదావరి నది ముంపు ప్రాంతాల పరిశీలన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటూర్‌నాగారం ప్రాంతానికి వచ్చారు. ఈ సందర్భంలో సీఎం కేసీఆర్‌ను కలిసిన ములుగు నేతలు తమ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని కోరారు.

కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ములుగు, బండారుపల్లి, జీవంతరావ్ పల్లి మూడు గ్రామ పంచాయతీలను కలుపుకొని ములుగు జిల్లా కేంద్రాన్ని మునిసిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మూడు గ్రామపంచాయతీల జనాభా 16 వేల పైచిలుకు(2011 జనాభా లెక్కల ప్రకారం) ఉండగా, 12 వేలకు పైచిలుకు ఓటర్లు ఉన్నారు. 2022 జనాభా లెక్కలు పూర్తయితే మరో 25% పెరిగే అవకాశం ఉంది.

ములుగు గ్రామపంచాయతీలో 16 వార్డులు, బండారుపల్లి గ్రామపంచాయతీలో 12 వార్డులు, జీవంతరావు పల్లె పంచాయతీలో 8 వార్డులు ఉన్నాయి. 2024 నుంచి ములుగు ప్రాంతం మునిసిపాలిటీగా మారనున్నది. ములుగు ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంపై స్థానిక రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా అభివృద్ధిపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: CM KCR, Local News, Mulugu

ఉత్తమ కథలు