Home /News /telangana /

MULUGU WHY PEOPLE NOT GO TO THE SURROUNDING PLACES OF THE AGENCY AREAS IN MULUGU DURING THE MONSOON SEASON MMV PRV BRV

Mulugu: వర్షాకాలం వచ్చిందంటే ఆ ఏరియాకు బయటి ప్రపంచంతో సంబంధాలు కట్​.. పక్క ఊరికీ వెళ్లలేరు.. ఎందుకిలా?

ఏజెన్సీ

ఏజెన్సీ ప్రాంతం

వరదల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డు రవాణా మార్గాలు కొట్టుకుపోయి తండా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లకేళ్లుగా సమస్యలు వేదిస్తున్నా..ఏజెన్సీ వాసుల బాధలు అధికారులకు పట్టవా? అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.

    (Venu Medipelly, News18, Mulugu)

    అసలే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాయి ఏజెన్సీ ప్రాంతాలు (Agency areas). ఆపై ఉన్న కొద్దిపాటి సౌకర్యాలు సైతం ప్రకృతి విపత్తుల కారణంగా నాశనం అయితే ఇక వాటిని పట్టించుకున్న నాధుడే లేడు. వరదల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డు రవాణా మార్గాలు (Road transport routes) కొట్టుకుపోయి తండా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లకేళ్లుగా సమస్యలు వేదిస్తున్నా..ఏజెన్సీ వాసుల బాధలు అధికారులకు పట్టవా? అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ములుగు (Mulugu) జిల్లా ఏటూరునాగారం పరిధిలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు మార్గాలపై NEWS 18 ప్రత్యేక కథనం..

    వర్షాల కాలంలో ధ్వంసం అవుతున్న తాత్కాలిక రోడ్లు..

    ఏటూరునాగారం (EturuNagaram) పరిధిలో అనేక ఏజెన్సీ ప్రాంతాలు (Agency Areas) ఉన్నాయి. నిత్యం తమ అవసరాల కోసం తండా వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లివస్తుంటారు. అప్పుడపుడు పర్యాటకులు సైతం ఇక్కడి ఏజెన్సీ గ్రామాలకు వస్తుంటారు. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు గిరిజన గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. ఏజెన్సీలో కురిసిసే వర్షాలకు (Rains) వాగులు వంకలు ఉదృతంగా ప్రవహిస్థాయి. దీంతో తాత్కాలికంగా వేసిన రోడ్లు వరదలకు కొట్టుకుపోయి గిరిజన వాసులు ఎన్నో తిప్పలు పడుతున్నారు.



    "దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు" అన్నట్టుగా తయారయింది ఏజెన్సీ గ్రామాల పరిస్థితి. కాగా, మారుమూల ఏజెన్సీ వాసుల రవాణా కష్టాలు (Transport problems) తీర్చడం కోసం రోడ్ల నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం టెండర్లు వేసింది. దీంతో కాంట్రాక్టర్లు కూడా ముందుకువచ్చి రోడ్ల నిర్మాణానికి (Roads Constructions) సిద్ధమయ్యారు. తమ గ్రామాలకు రోడ్ల నిర్మాణం జరుగుతుందని గిరిజన వాసులు ఎంతో సంతోషపడ్డారు. అయితే వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అటవీ ప్రాంతం గుండా రోడ్లు వేయడానికి అనుమతులు తీసుకోలేదంటూ అటవీశాఖ అధికారులు రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

    వాగు పొంగిందంటే.. రోడ్డు కనపడదు..

    ఏటూరునాగారం పరిధిలోని చిన్నబోయినపల్లి- షాపల్లి గ్రామాల మధ్య వట్టి వాగు ఉంటుంది. వర్షా కాలంలో ఈ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. దీంతో వర్షాకాలం సమయంలో ఈ గ్రామాలకు రవాణా మార్గం (Transportation) పూర్తిగా నిలిచిపోయినట్లే. కనీసం ఏటూరునాగారం వెళ్లాలన్నా వేరే మార్గం కూడా లేదని గ్రామస్థులు వాపోతున్నారు. వాగుపై వంతెన (Bridge) నిర్మాణ పనులు ప్రారంభించినా ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వంతున నిర్మాణ పనులు పూర్తయ్యే వరకైనా ప్రత్యామ్నాయంగా ఎలాంటి మార్గము లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే మా పరిస్థితి ఏంటంటూ గిరిజన గ్రామాల ప్రజలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. రూ. 2.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నా కనీసం అధికారుల పర్యవేక్షణ కొరవడింది.

    అలంకారప్రాయంగా ఉన్నా దొడ్ల వారధి..

    ఇదే ప్రాంతంలో ఉన్న మరో ఏజెన్సీ గ్రామం దొడ్ల పరిధిలోనూ రోడ్డు మార్గం అద్వానంగా తయారైంది. దొడ్ల వద్ద జంపన్నవాగుపై 2014లో రూ. ఐదు కోట్ల వ్యయంతో వంతెనను నిర్మించారు. ఆ వంతెన పట్టుమని పది సంవత్సరాలు కూడా నిలబడలేకపోయింది. గతంలో వరదలకు వంతెన పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో వంతెనపై నుంచి భారీ వాహనాల రవాణా నిలిపివేసిన అధికారులు. పిల్లర్ కింద ఆరు జాకీల సహాయంతో వంతెనను నామమాత్రంగా నిలబెట్టారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురిస్తే ఈ వంతెన కూలిపోయే అవకాశం ఉందంటూ స్థానిక ప్రజలు భయపడుతున్నారు.

    ఐలాపురం గోస: ఏటూరునాగారం పరిధిలో ఉన్న ఐలాపురంలోను రోడ్డు మార్గం సరిగా లేదు. ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించే మేడారం జాతరకు గోవిందరాజును ఈ రోడ్డు మార్గం ద్వారానే తీసుకురావడం జరుగుతుంది. జాతర విషయంలో అనేక కోట్లు ఖర్చుపెడుతున్న ప్రభుత్వం, శాశ్వత నిర్మాణాలు మాత్రం చేపట్టడం లేదు. ఊరట్టం నుంచి ఐలాపురం రోడ్డు మార్గానికి దాదాపు రూ. 15 కోట్లపైనే నిధులు మంజూరు అయ్యాయి.

    ఇక్కడ కూడా ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాలతో రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 13 కిలోమీటర్ల దారి పొడవు మొత్తం వాగులు వంకలు మధ్యలో నిలిచిపోయిన కల్వర్టు పనుల కారణంగా గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు, స్థానిక నేతలు స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా మార్గాలు మెరుగు పర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Local News, Mulugu, Road safety, Tribal huts

    తదుపరి వార్తలు