హోమ్ /వార్తలు /తెలంగాణ /

విద్యార్థులను క్రీడలకు దగ్గర చేసేందుకు ఈ స్కూల్ లో ఏం చేశారంటే?

విద్యార్థులను క్రీడలకు దగ్గర చేసేందుకు ఈ స్కూల్ లో ఏం చేశారంటే?

X
ప్రత్యేకంగా

ప్రత్యేకంగా స్పోర్ట్స్ రూమ్..

Telangana: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది.. ఈ మహమ్మారి ప్రభావం వల్ల అనేకమంది తమ జీవితాలను కోల్పోయారు. ముఖ్యంగా విద్యార్థులు, వారి విద్యపై ఎక్కువ ప్రభావాన్ని చూపించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది.. ఈ మహమ్మారి ప్రభావం వల్ల అనేకమంది తమ జీవితాలను కోల్పోయారు. ముఖ్యంగా విద్యార్థులు, వారి విద్యపై ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. కరోనా మహమ్మారి తెచ్చిన ఆన్ లైన్ క్లాసులతో చిన్న పిల్లలకు సైతం స్మార్ట్ ఫోన్లు తల్లిదండ్రులు చేతిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పాఠశాలలకు దూరంగా స్మార్ట్ ఫోన్లకు దగ్గరగా ఆన్లైన్ విద్య కొనసాగింది. కాగా, ప్రతి విద్యార్థికి చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరం. విద్యార్థికి క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

కానీ ఈ మాయదారి కరోనా వల్ల పాఠశాల విద్యార్థులు పూర్తిగా రెండు సంవత్సరాలు క్రీడలకు దూరమయ్యారు. చదువులు మాత్రం ఆన్లైన్లో అడపాదడపా కొనసాగినప్పటికీ మైదానంలో జరగాల్సిన క్రీడలు మాత్రం అటకెక్కాయి. కరోనా భయంతో క్రీడలు నిర్వహించాలంటే అధికారులు, తల్లిదండ్రులు సైతం భయానికి గురయ్యారు. ఇప్పుడు అన్ని భయాలు తొలగడంతో మళ్ళీ విద్యార్థులను ఆటలవైపు ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే మోడల్ స్కూల్ లో ప్రత్యేకంగా స్పోర్ట్స్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మోడల్ స్కూల్ విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ రికార్డులను సృష్టిస్తుంది. ఇక్కడ విద్యార్థులు ఎక్కువగా చుట్టుపక్కల మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన వారే ఉంటారు. గిరిజన ప్రాంతాలతో పాటు గిరిజనేతర ప్రాంతాలలోని విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే విద్యార్థులు కాబట్టి క్రీడలలో ఎంతో ప్రతిభ కనబరుస్తూ ఉంటారు.

కానీ కరోనా మహమ్మారి రావడంతో విద్యార్థులు పూర్తిగా క్రీడలకు దూరం అయ్యారు. అందుకే ఇప్పుడు స్కూల్ చైర్మన్ రేండ్ల సంతోష్, కళాశాల ప్రిన్సిపల్ నిజాముద్దీన్ ప్రతిభ ఉన్న క్రీడాకారుల కోసం మళ్ళీ తమవంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఏకంగా పాఠశాలలో ఒక ప్రత్యేక స్పోర్ట్స్ రూమ్ ఏర్పాటు చేశారు.

ఈ స్పోర్ట్స్ రూంలో విద్యార్థులకు సంబంధించిన ఆట వస్తువులు, క్రీడా సామాగ్రిని అందుబాటులో ఉంచారు. స్కూల్ లో స్పోర్ట్స్ రూమ్ ఏర్పాటు చేయగానే పాఠశాల విద్యార్థులలో సైతం ఎక్కడలేని సంతోషం కనిపిస్తుంది. ఇప్పటికే పాఠశాల విద్యార్థులకు స్కూల్ చైర్మన్, కళాశాల సిబ్బంది క్రీడలను మొదలు పెట్టగా.. స్కూల్ చైర్మన్ రేండ్ల సంతోష్ వాలిబాల్, కబడ్డీ, ఖో ఖో క్రీడా పోటీలలో సైతం పాల్గొన్నారు. విద్యార్థుల కోసం వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం కోసం క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని.. అందుకే వారికి ప్రత్యేకంగా స్పోర్ట్స్ రూమ్ ఏర్పాటు చేశామని స్కూల్ చైర్మన్ చెప్పారు.

First published:

Tags: Local News, Mulugu, Sports, Telangana

ఉత్తమ కథలు