హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: గిరిజన మహిళలకు బిజినెస్​ పాఠాలు: స్వయం ఉపాధిపై శిక్షణ తరగతులు.. పూర్తి వివరాలివే..

Mulugu: గిరిజన మహిళలకు బిజినెస్​ పాఠాలు: స్వయం ఉపాధిపై శిక్షణ తరగతులు.. పూర్తి వివరాలివే..

tribal

tribal women

సరైన ప్రోత్సాహం, తోడ్పాటు అందిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి పరిశ్రమలు స్థాపించి స్వయం ఉపాధి దిశగా మహిళలు రాణించగలరు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించింది..

  (Venu Medipelly, News18, mulugu)

  మహిళలు పారిశ్రామిక రంగాల్లో రాణిస్తున్నారు. కార్పొరేట్ వ్యవస్థల్లోనూ, వ్యాపారవేత్తలుగానూ తమదైన ముద్ర వేస్తున్నారు . పట్టణాలు, నగరాల్లో మాత్రమే మహిళలు (Women) వ్యాపార రంగంలో కనిపిస్తున్నారు. చిన్న పట్టణాలు, గ్రామ స్థాయిలో మహిళలు వెనుకబడ్డారని చెప్పవచ్చు. సరైన ప్రోత్సాహం, తోడ్పాటు అందిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి పరిశ్రమలు (Industries) స్థాపించి స్వయం ఉపాధి దిశగా మహిళలు రాణించగలరు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఆలోచించింది.. ఇటీవల ప్రారంభించిన ఒక విధానం 150 మంది గిరిజన మహిళల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వ నేతృత్వంలోని 'WE HUB' ఆధ్వర్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల మహిళలను పారిశ్రామిక, వ్యాపార స్థాపన దిశగా ప్రోత్సహిస్తూ మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

  వ్యాపారంపై శిక్షణ:

  ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి 150 మందికి పైగా గిరిజన మహిళలు యూత్ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ములుగు (Mulugu) జిల్లా ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్‌ (Youth training center)లో ఉచిత శిక్షణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. వ్యాపార రంగం (Business)లో తమదైన ముద్ర వేసుకోవాలనే ఒక ఆశయంతో అనేక మంది ఔత్సాహిక గిరిజన మహిళా (Tribal women) పారిశ్రామికవేత్తలు శిక్షణకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు (Business woman) ప్రోత్సాహం అందించేందుకు వీ హబ్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. 2018 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ (International Women day) సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR)  వీ హబ్ ప్రారంభించారు.

  వీ-హబ్ ముఖ్య ఉద్దేశం: స్వయంగా వ్యాపారం (Business), పరిశ్రమ ప్రారంబించాలనుకునే మహిళలకు (Women) ప్రోత్సాహకం అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. మహిళా వ్యాపారవేత్తలు స్థాపించే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా ఉన్న అడ్డంకులను తొలగించి వ్యాపార రంగంలో విజయం సాధించడంలో తోడ్పాటులో పాలుపంచుకోవడమే వీ హబ్ ప్రధాన లక్ష్యం.

  దేశంలోనే మొదటిసారిగా..

  వీ హబ్ (WE-HUB) ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు వ్యాపార రంగంలో మెలుకువలు నేర్పడం కోసం ఐటీడీఏ (ITDA) అధికారులు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే ఈ శిక్షణ తరగతులకు మొదట 50 నుంచి 60 మంది గిరిజన మహిళలు వస్తారని అధికారులు అంచనా వేయగా.. వారు ఊహించిన దాని కంటే ఎక్కువగా 150 మంది గిరిజన మహిళలు (Tribal women) శిక్షణ తరగతులకు వచ్చారు. వీ హబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ఒక శిక్షణ (Training) బృందం వైటిసి ఏటూరు నాగారం చేరుకున్నారు.

  శిక్షణ (Training)కు హాజరైన గిరిజన మహిళలకు వ్యాపారం (Business) ఎలా ప్రారంభించాలి ,? దానికి సంబంధించిన కార్యకలాపాలు ఎలా నిర్వహించాలి, వ్యాపారానికి సంబంధించి లోన్ కావాలంటే బ్యాంకు వారిని ఏ విధంగా సంప్రదించాలి ?వారికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏ విధంగా పూర్తి చేయాలి, లాభనష్టాలను ఏ విధంగా లెక్క కట్టాలి? జీఎస్టీ ఏ విధంగా చూసుకోవాలి? అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు.

  వివరాలు తెలియక ఆలోచనకు ఆదిలోనే అడ్డుకట్ట..

  శిక్షణకు హాజరైన మహిళలు న్యూస్ 18తో తమ అనుభవాన్ని పంచుకున్నారు. "మేము వ్యాపారంగంలో మెళుకువలు నేర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం.పేపర్ ప్లేట్స్ బిజినెస్ పెట్టాలని అనుకున్నాం. కానీ దానిని ఎలా ప్రారంభించాలి? ఎవరిని సంప్రదించాలి? అనే వివరాలు తెలియక మా ఆలోచనకు ఆదిలోనే అడ్డుకట్టపడింది. మాకు వ్యాపారం చేసే ఆలోచనలు ఉన్నప్పటికీ సహాయ సహకారాలు లేకపోవడంతో మా ఆశలన్నీ కలలుగానే ఆవిరైపోతున్నాయి. దేశంలోనే మొదటిసారిగా గిరిజన మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇలా ఉచిత ట్రైనింగ్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని" అక్కడకి వచ్చిన మహిళలు చెప్తున్నారు.

  ఐటీడీఏ ఏటూరు నాగారం పీవో పర్యవేక్షణ..

  మహిళలకు వ్యాపారంలో శిక్షణ కార్యక్రమం ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ ఆధ్వర్యంలో జరిగింది. ఎప్పటికప్పుడు శిక్షణను పర్యవేక్షిస్తూ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. శిక్షణకు వచ్చిన మహిళలకు ఉచిత భోజన సదుపాయంతో పాటు వసతి కూడా కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విహబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణకు 150 గిరిజన మహిళలు హాజరయ్యారని, వీరికి రెండు రోజుల పాటు వ్యాపార రంగంలో ముళుకువలు నేర్పించినట్లు ఐటీడీఏ అధికారులు పేర్కొన్నారు. శిక్షణ పర్యవేక్షణలో భాగంగా ఐటీడీఏ పీవో అంకిత్ వైటీసీ ఏటూరునాగారం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు తమ ఇబ్బందులను పీఓ దృష్టికి తీసుకువచ్చారు. శిక్షణ పొందిన మహిళలకు ఐటీడీఏ ఆర్థిక సహాయాన్ని కూడా అందించే విధంగా చూడాలని, సబ్సిడీ లోన్స్ అందిస్తే వ్యాపార రంగంలో రాణించగలమని మహిళలు ధీమా వ్యక్తం చేశారు.

  కొండలరావు  (జేడీఎం యూత్ ట్రైనింగ్ సెంటర్)

  Mob: 8330954571

  ఏటూరు నాగారం

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Business Ideas, Business woman, Classes, Local News, Mulugu, Small business, Tips For Women, Women

  ఉత్తమ కథలు