హోమ్ /వార్తలు /తెలంగాణ /

సైకిల్ పై ప్రపంచాన్ని చుట్టేయాలంటున్న వరంగల్ యువకుడు.., తోడుగా కుక్క కూడా..

సైకిల్ పై ప్రపంచాన్ని చుట్టేయాలంటున్న వరంగల్ యువకుడు.., తోడుగా కుక్క కూడా..

సైకిల్‌పై

సైకిల్‌పై వరంగల్ యువకుడి వరల్డ్ టూర్

Warangal: మనసుంటే మార్గం ఉంటుందని ఈ యువకుడు నిరూపిస్తున్నాడు. ప్రపంచాన్ని చుట్టి రావాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే ఆ కలను సాకారం చేసుకుంటుంటారు. అటువంటి వారిలో రంజిత్ కుమార్ ఒకడుగా చెప్పుకోవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  Venu, News18, Mulugu

  మనసుంటే మార్గం ఉంటుందని ఈ యువకుడు నిరూపిస్తున్నాడు. ప్రపంచాన్ని చుట్టి రావాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే ఆ కలను సాకారం చేసుకుంటుంటారు. అటువంటి వారిలో రంజిత్ కుమార్ ఒకడుగా చెప్పుకోవచ్చు. రంజిత్ కుమార్ వరంగల్ (Warangal) నగరంలోని గిర్మాజిపేటకు చెందిన యువకుడు. మధ్యతరగతికి చెందిన ఈ యువకుడు ఆర్ధిక కష్టాల నడుమ తండ్రి ప్రోత్సాహంతో ఎం ఫార్మసీ పూర్తి చేశాడు. రంజిత్ తండ్రి రాములు న్యాయవాదిగా పనిచేసేవాడు. ప్రపంచ దేశాలు తిరిగి రావాలన్న తన చిరకాల కోరిక కోసం డబ్బులు దాచుకున్నాడు రాములు. కానీ ఏం చేస్తాడు కొడుకు చదువు ముందు తన ఆశయం చిన్నబోయింది. కొడుకును చదివించడంలోనే తను దేశాన్ని చుట్టేయాలన్న కోరిక ఆవిరైపోయింది.

  రంజిత్ జీవితం తలకిందులు

  2020లో అందరి జీవితాల్లో అంధకారం నింపిన కరోనా మహమ్మారి రంజిత్ తండ్రి రాములును కూడా బలితీసుకుంది. దీంతో ఒక్కసారిగా రంజిత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. అప్పుడే రంజిత్‌కి తన తండ్రి చిరకాల కోరిక గుర్తొచ్చింది. దేశం మొత్తం చుట్టి రావాలన్న తండ్రి రాములు ఆశయాన్ని నెరవేర్చేందుకు వెంటనే సైకిల్ పై భారత్ యాత్ర చేపట్టాడు. దాదాపు 8 వేల కిలో మీటర్లు ఈ యాత్రను కొనసాగించి తన తండ్రికి అంకితం ఇచ్చాడు రంజిత్. 2021లో రంజిత్ తన సైకిల్ యాత్రను ప్రారంభించిన యువకుడు వరంగల్ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర మొదలుపెట్టాడు.

  ఇది చదవండి: ఆ జిల్లాలో రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్న పామాయిల్: దేశానికే ఆదర్శంగా అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ

  రోజుకు 100 నుంచి 120 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాడు. ప్రయాణం ప్రారంభించిన కొన్ని రోజులకే మళ్లీ కరోనా విజృంభించడంతో రంజిత్ జీవనం రోడ్ల పక్కనే పెట్రోల్ బ్యాంకుల్లో, స్థానిక స్కూల్స్‌ లోనే సాగిపోయింది. అలా 15 రోజుల్లో 1500 కిలోమీటర్లు ప్రయాణించి కన్యాకుమారికి చేరుకున్నాడు. అక్కడి నుంచి అరేబియా సముద్రం పక్కనే దక్షిణ పశ్చిమ కోస్తా తీరం వెంబడి గోవాకు చేరుకున్నాడు. మరికొన్ని యూరప్ దేశాలలోనూ పర్యటించానని చెబుతున్న రంజిత్ రాబోయే రోజుల్లో భారత్ - ఇంగ్లాండ్ వరకు తన యాత్రను ప్రారంభించనున్నట్లు న్యూస్ 18తో చెప్పుకొచ్చాడు. దాదాపు ఇంగ్లాండ్ వరకు వెళ్లాలంటే 18 దేశాలను దాటాలని రంజిత్ చెప్తున్నాడు.

  ఇది చదవండి: తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ కళాశాల: ఎక్కడుందో తెలుసా?

  యూట్యూబ్ ఛానల్ చూడండి

  రంజిత్ తన యాత్ర గురించి ప్రపంచానికి తెలియజేయడం కోసం సొంతంగా రంజిత్ ఆన్ వీల్స్ (Ranjith on Wheels) అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు తన వీడియోలను అప్డేట్ చేస్తున్నాడు. లాక్‌డౌన్‌లో సోను సూద్ చేసిన దాతృత్వ పనులను మెచ్చి ఆయన్ను ఆదర్శంగా తీసుకున్న రంజిత్, ఆయన్ను కలిసేందుకు ముంబై వెళ్ళాడు. కానీ సోను అదే రోజు హైదరాబాద్‌లో ఉండగా, రంజిత్ తన కోసం వచ్చాడన్న విషయం తెలుసుకుని మరుసటి రోజే ముంబైకి వచ్చేసాడు సోను. రంజిత్ చేస్తున్న యాత్రను చూసి చాలా అభినందించాడు. ఈ యాత్రలో తనతో పాటు ఓ కుక్కను కూడా వెంటబెట్టుకెళ్తున్నాడు రంజిత్. మనుషులు ఎలా అయితే స్వేచ్ఛగా భూమి బతుకుతున్నామో మూగజీవాలు కూడా అలాగే స్వేచ్ఛగా జీవించాలంటున్నాడు రంజిత్.

  తెలంగాణ పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్న రంజిత్

  తన పర్యటనలో భాగంగా అనేక ఇతర రాష్ట్రల్లో పర్యటక ప్రాంతాలను చూసొచ్చాడు. ఆ రాష్ట్రాలకు అక్కడి పర్యాటక కేంద్రాల ద్వారా ఆదాయం వస్తుందని గమనించాడు. సొంత రాష్ట్రమైన తెలంగాణలో పర్యటక ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. దానిలో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలన్నీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలనుకున్నాడు. దానిలో భాగంగా వరంగల్ భద్రకాళి, వేయి స్తంభాల గుడి, రామప్ప, లక్నవరం లేక్, బోగత జలపాతం, ముత్యం దార, పాండవుల గుట్ట, తదితర పర్యటక ప్రాంతాలను చుట్టేస్తున్నాడు రంజిత్.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Telangana, Warangal

  ఉత్తమ కథలు