Home /News /telangana /

MULUGU WARANGAL VIGILENCE OFFICIALS SIEZED 60 QUINTAL PDS RICE IN MULUGU DISTRICT BRV MMV PRV

Mulugu: రేషన్ బియ్యంను పక్కదారి పట్టిస్తున్న మాయగాళ్లు: ఒకే చోట 60 క్వింటాళ్ల బియ్యం

ములుగు క్రైం

ములుగు క్రైం

ములుగు మండలం మహమ్మద్‌గౌస్ పల్లి గ్రామంలో అక్రమంగా PDS బియ్యం నిల్వచేసి ఉంచారనే విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    (M. Venu, News 18, Mulugu)

    అక్రమంగా నిలువచేసిన 65 క్వింటల రేషన్ బియ్యంను (Ration rice) విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ములుగు (Mulugu) మండలం మహమ్మద్‌గౌస్ పల్లి గ్రామంలో అక్రమంగా పిడిఎస్ (PDS) బియ్యం నిల్వచేసి ఉంచారనే విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు (Warangal Vigilance Enforcement Officers) శుక్రవారం దాడులు నిర్వహించారు. రెండు వాహనాల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 60 క్వింటాలకు పైగా రేషన్ బియ్యంను అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా బియ్యం (Rice) రవాణా చేస్తున్న ముగ్గురిపై అధికారులు పోలీస్ కేసు నమోదు చేశారు. అబ్బాపురం గ్రామానికి చెందిన కట్టయ్య శ్రీధర్, నారాయణతో పాటు వాహనాల డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ సిఐ వివరించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ. 1.50 లక్షలు ఉంటుందని, ఈ బియ్యాన్ని సివిల్ సప్లై డిటికి అప్పజెప్పడం జరిగిందని విజిలెన్స్ అధికారులు చెప్పారు.

    ఇంట్లోనే మద్యం షాప్..

    హనుమకొండలో (Hanmakonda) ఓ బార్ యజమాని ఏకంగా ఇంట్లోనే మద్యం షాప్ ఓపెన్ చేశాడు. ఉదయం ఐదు గంటల నుంచే మద్యం అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. హనుమకొండ నగరంలోని వైస్రాయ్ బార్ ఓనర్ తన ఇంటి వద్ద బహిరంగంగా మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న వరంగల్ (Warangal) కమిషనరేట్ పోలీసులు వైస్రాయ్ బార్ ఓనర్ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇంట్లో బార్ షాప్ నిర్వహిస్తూ ప్రతిరోజు ఉదయం 5 గంటలకే మద్యం అమ్ముతున్నాడని, అక్రమంగా మద్యాన్ని ఇంట్లో నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. వైస్రాయ్ బార్ ఓనర్ యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, అక్కడ మద్యం సేవిస్తున్న వారిపైనా కేసులు నమోదు చేశారు.

    Poison cooking: పురుగుల మందుతో వంట చేసి కూతురు, భర్తకు తినిపించిన ఇల్లాలు.. ఆ తర్వాత ఏమైందంటే..?



    అధికారుల కళ్లుగప్పి నిషేధిత గుట్కాను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని వరంగల్ కమలాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంపల్లిలో అక్రమంగా నిషేదిత గుట్కాలను నిల్వఉంచారన్న సమాచారం మేరకు ఓ ఇంట్లో టాస్క్ ఫోర్స్​ (Task Force) పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా గుట్కా ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా నిల్వ ఉంచి, విక్రయిస్తున్న వేంపల్లికి చెందిన భూపతి హరికృష్ణను అదుపులోకి తీసుకున్నామని అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. గోదావరిఖనికి చెందిన సంతోష్ సహకారంతో హరికృష్ణ ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గుట్కా సుమారు రూ. లక్షకు పైగా విలువ ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Local News, Mulugu, Rice

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు