హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: వైజాగ్ టూ ఢిల్లీ వయా వరంగల్ .. అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠాకు చెక్

Mulugu: వైజాగ్ టూ ఢిల్లీ వయా వరంగల్ .. అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠాకు చెక్

ganja gang arrest

ganja gang arrest

Mulugu: విశాఖలో 30 కిలోల ఎండు గంజాయి కొని దానిని 15 ప్యాకెట్లుగా తయారుచేసి ఢిల్లీలో అమ్మేయాలని వారి ప్రణాళిక. అనుకున్నట్లుగానే వైజాగ్ లో కొనుగోలు చేసిన 30 కిలోల ఎండు గంజాయిని తీసుకుని రైలులో బయలుదేరారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu Medipelly,News18,Mulugu)

  ఏపీలోని విశాఖ(Visakhapatnam) మన్యం నుంచి గంజాయి(Marijuana)కొనుగోలు చేసి వరంగల్(Warangal) మీదుగా ఢిల్లీ తరలిస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. సినిమా కథను తలపిస్తున్న ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిని పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో 30 కిలోల ఎండు గంజాయి కొని దానిని 15 ప్యాకెట్లుగా తయారుచేసి ఢిల్లీ(Delhi)లో అమ్మేయాలని వారి ప్రణాళిక. అనుకున్నట్లుగానే వైజాగ్ లో కొనుగోలు చేసిన 30 కిలోల ఎండు గంజాయిని తీసుకుని రైలులో బయలుదేరారు. రైల్వే పోలీసులు(Railway Police)తనిఖీ చేస్తుండడం గమనించి వెంటనే వచ్చిన స్టేషన్‌లో దిగి, తిరిగి వేరే రైలులో ఎక్కారు. అందులోనూ పోలీసులు ఉండడం గమనించి వరంగల్ స్టేషన్‌లో దిగి చివరికి పోలీసుల పట్టుబడ్డారు.

  Nagarkurnool: కలెక్టర్ ఆఫీసు ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న రైతు .. భూమి కాజేశారనే బాధతో..

  ఆంధ్రా నుంచి ఢిల్లీకి ...

  వరంగల్ శివానగర్ ప్రాంతంలో భారీ మొత్తంలో ఎండు గంజాయి ఉందనే విశ్వసనీయ సమాచారం మేరకు అడిషనల్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆదేశాల అనుసారం పోలీసులు శివానగర్ రోడ్డుపై నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ జావిద్, సందీప్, ఎండి దిల్లాధ్, షాహిద్ ఖాన్, నవీన్ కందేరను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్నారనే నేపథ్యంలో ఈ ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. వసీం అనే వ్యక్తి వైజాగ్ వెళ్లి అక్కడ ఓ వ్యక్తి నుంచి 30 కిలోల ఎండు గంజాయి కొనుగోలు చేశాడు. దానిని ఢిల్లీ చేరవేయాలని వీరి మధ్య ఒప్పందం. అనుకున్నది అనుకున్నట్లుగానే 30 కిలోల ఎండు గంజాయితో వైజాగ్ నుంచి ఢిల్లీకి ట్రైన్‌లో బయలుదేరారు.కానీ ఖమ్మం పరిధిలోకి రాగానే రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆ ఆరుగురు వ్యక్తులు గంజాయితో ఖమ్మంలోనే దిగిపోయారు. మళ్లీ వెంటనే ఖమ్మం నుంచి ఢిల్లీకి వెళ్లే రైలు ఎక్కారు.

  తెలంగాణ మీదుగా గంజాయి తరలింపు..

  అందులోనూ రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లు గుర్తించి వరంగల్ రాగానే వరంగల్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. రైల్వే పోలీసుల తనిఖీలు ఎక్కువగా జరుగుతున్నాయని గమనించి ఎండు గంజాయిని ఎవరికి అనుమానం రాకుండా వరంగల్ శివానగర్ ప్రాంతంలో ముళ్లపొదల్లో దాచిపెట్టారు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ తీసుకువెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రోజున దాచిపెట్టిన గంజాయి బ్యాగుల కోసం నలుగురు అక్కడికి వెళ్లగా, షేక్ జావిద్ ఢిల్లీకి వెళ్లేందుకు టికెట్ తీసుకోవడానికి రైల్వే స్టేషన్ వచ్చాడు. అనుమానాస్పదంగా గుర్తించి అతని బ్యాగులు పోలీసులు పరిశీలించగా అందులో కొంత గంజాయి ఉండడంతో అతని విచారించారు. అసలు విషయం బయటపడింది. ఈ ఆపరేషన్‌లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ఏసిపి డాక్టర్ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Telangana crime news, Warangal

  ఉత్తమ కథలు