Home /News /telangana /

MULUGU VILLAGERS STRUGGLING DUE TO LACK OF BUS STANDS IN MULUGU DISTRICT DEMAND FOR NEW BUS STAND MMV BRV ABH

Mulugu: ఆ ఊరులో బస్సు నడపాలంటే ఆర్టీసీ డ్రైవర్లకు ఎక్కడలేని కోపం: ఎందుకో తెలుసా?

అధికారుల

అధికారుల వాగ్ధానాలకే పరిమితమైన బస్సు స్టాండ్ నిర్మాణం

ఉమ్మడి వరంగల్ బస్ డిపో పరిధిలో అనేక గ్రామాలకు బస్టాండ్ నిర్మించాలంటే సొంత స్థలాలు లేకపోవడంతో బస్టాండు నిర్మించలేక అక్కడ ప్రజలు రోడ్లపైనే బస్సులు ఆపుకొని ఎక్కుతున్నారు. కానీ చల్వాయి గ్రామం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    M.Venu, News 18, Mulugu

    Mulugu; స్వతంత్ర భారతదేశానికి ఎంత ఘనమైన చరిత్ర ఉందో ములుగు(mulugu) జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి అంతే చరిత్ర ఉంది. ఇదే విషయాన్నీ ఆ గ్రామస్తులు సైతం పలు సందర్భాల్లో ప్రస్తావించారు. స్వాతంత్రం సిద్ధించిన రోజుల్లో చల్వాయి గ్రామానికి అనేక సదుపాయాలు ప్రభుత్వం కల్పించింది. దానిలో భాగంగానే ఏ గ్రామంలో లేనటువంటి విధంగా 1952 సంవత్సరంలోనే రవాణా శాఖ చల్వాయి గ్రామంలో నూతన బస్టాండ్ నిర్మించింది. ఆ రోజుల్లోనే ఇక్కడి బస్టాండ్లో నైట్ హల్ట్ బస్సులు ఉండేవి. కాలక్రమేణ చరిత్రతో పాటు చల్వాయి బస్టాండ్ కూడా కాలగర్భంలో కలిసిపోయింది.

    సొంత స్థలం ఉన్నా బస్ స్టాండ్ నిర్మాణంపై నిర్లక్ష్యం:
    ఉమ్మడి వరంగల్(warangal) బస్ డిపో పరిధిలో అనేక గ్రామాలకు బస్టాండ్ నిర్మించాలంటే సొంత స్థలాలు లేకపోవడంతో బస్టాండు నిర్మించలేక అక్కడ ప్రజలు రోడ్లపైనే బస్సులు ఆపుకొని ఎక్కుతున్నారు. కానీ చల్వాయి గ్రామం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ములుగు జిల్లా పరిధిలోనే సొంత బస్టాండ్ స్థలం ఉన్న గ్రామం చల్వాయి. జాతీయ రహదారి పక్కనే సువిశాలమైన బస్టాండ్ నిర్మించే సొంత ఆర్టీసీ స్థలం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం బస్టాండ్ నిర్మించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

    ములుగు జిల్లా కలెక్టర్ శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలను తొలగించాలని గతంలో ఆదేశించారు. దానిలో భాగంగా 1952లో నిర్మించిన బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో బస్టాండ్‌ను కూల్చి వేశారు చల్వాయి గ్రామపంచాయతీ సిబ్బంది. అయితే ఆ కూల్చివేతకు సంబందించిన బిల్లు ఇప్పటివరకు ఇవ్వలేదని, పంచాయితీ పరిధిలో ఉన్న ఈ స్థలానికి ఎలాంటి పన్నులు కూడా కట్టలేదని గ్రామపంచాయతీ సిబ్బంది చెప్తున్నారు.

    అధికారుల తీరుతో విసుగెత్తిన గ్రామ ప్రజలు:
    కొన్ని నెలల కిందట ఖాళీ ఉన్న స్థలాన్ని ఆర్టీసీ యాజమాన్యం పెట్రోల్ పంపు లీజుకు ఇస్తున్నారనే వార్త చెక్కర్లు కొట్టింది. దీంతో గ్రామస్తులందరూ ఆర్టీసీ బస్టాండ్ ప్రదేశంలో కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మించాలి ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. దీంతో ఆర్టీసీ అధికారులు బస్టాండ్ ప్రదేశాన్ని సందర్శించి త్వరలోనే నూతన బస్టాండ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మేజర్ గ్రామపంచాయతీ రెవెన్యూ గ్రామపంచాయతీ కావడంతో చల్వాయి గ్రామం వైశాల్య పరంగా పొడవులో జాతీయ రహదారి వెంట 1.5 కిమీ పైనే పొడవు ఉంటుంది.

    Read this also; Mulugu: కటాక్షపూర్ చెరువు కష్టాలు…ఇప్పటికైనా కటాక్షపురం చెరువుకు కటాక్షం దొరికేనా

    గ్రామపంచాయతీలో బస్టాండ్ లేకపోవడంతో ఇక్కడి గ్రామస్తులు ఎవరి ఇంటి ఎదుట వారే ఆర్టీసీ బస్సులను ఆపి ఎక్కుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చల్వాయి గ్రామం పేరు చెప్పగానే ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు తెలియని కోపం వస్తుంది. ఆ గ్రామం వచ్చిందంటే చాలు ప్రతి ఇంటికి బస్సు ఆపాల్సిందేనని డ్రైవర్లు సైతం విసుక్కుంటారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ అధికారులు స్పందించి సొంత స్థలం ఉన్న చల్వాయి గ్రామ పరిధిలో నూతన బస్టాండ్ ఏర్పాటు చేయవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Mulugu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు