హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: 1984లోనే 400 పక్కా గృహాలను నిర్మించిన వీరపనేని విగ్రహావిష్కరణ

Mulugu: 1984లోనే 400 పక్కా గృహాలను నిర్మించిన వీరపనేని విగ్రహావిష్కరణ

X
వీరపనేని

వీరపనేని విగ్రహావిష్కరణ

Mulugu: రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిగా 1984లో పేదలకు పక్కా గృహాలు గోవిందరావుపేటలో పేద ప్రజల కోసం 400 గృహాలను నిర్మించిన నాయకుడు వీరపనేని శివాజీ.ములుగు లాంటి మారుమూల ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపకులు దిగవంగత నేత ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితుడు వీరపనేని.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, mulugu

రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిగా 1984లో పేదలకు పక్కా గృహాలు

గోవిందరావుపేటలో పేద ప్రజల కోసం 400 గృహాలను నిర్మించిన నాయకుడు వీరపనేని శివాజీ.ములుగు లాంటి మారుమూల ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపకులు దిగవంగత నేత ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితుడు వీరపనేని. మానవసేవే మాధవ సేవగా చివరి శ్వాస వరకు జీవించిన ఆ వ్యక్తి వీరపనేని. గోవిందరావుపేట లాంటి గ్రామంలో ప్రత్యేకంగా అతని విగ్రహాన్ని ఆవిష్కరించారు. పేదల కోసం పనిచేసిన నిస్వార్ధ నాయకుడు వీరపనేని శివాజీ. కరోనా మహమ్మారికిఆ మహోన్నత నేతను పొట్టన పెట్టుకుంది.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో కొత్తగా మండలాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ ములుగు జిల్లా లాంటి మారుమూల ప్రాంతాలలో మండలాల ఏర్పాటు చాలా కష్టంగా మారింది. ఎందుకంటే పూర్తిగా వెనుకబడిన ప్రాంతం, మౌలిక సదుపాయాలు లభించని ప్రాంతం, ముఖ్యంగా మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం... ఇలాంటి మారుమూల ప్రాంతాన్ని మండలంగా ఏర్పాటు చేయడం కోసం వీరపనేని శివాజీ అనే వ్యక్తి నడుం బిగించాడు.

అనుకున్నదే తడవుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఈ విషయంపై చర్చించి మండలాన్ని సాధించేవరకు అలుపెరుగని దీక్షకు పూనుకున్నాడు వీరపనేని శివాజీ. అంతేకాకుండా గోవిందరావుపేట గ్రామంలో బలహీన వర్గాలకు చెందిన ప్రజల కోసం నాలుగు వందల గృహాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఆ కాలనీకి NTR కాలనీగా నామకరణం కూడా చేశాడు.

తెలుగుదేశం పార్టీలో శివాజీ

1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని దిగవంగత నేత నందమూరి తారక రామారావు స్థాపించారు. ఈ పార్టీ స్థాపన దేశ రాజకీయాలలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది... పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రాంతీయ పార్టీ ప్రజలను ఆదరణ లభిస్తుందా అనే భయం అందరిలో ఉంది. అప్పటికే వరంగల్ జిల్లా వ్యాప్తంగా వీరపనేని శివాజీ ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ నందమూరి తారక రామారావు దృష్టిలో ఉన్నాడు. వెంటనే వీరపనేని శివాజీనీ వరంగల్ జిల్లా కన్వీనర్ గా నందమూరి తారక రామారావు నియమించాడు. అప్పటినుంచి వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడడం కోసం వీరపనేని శివాజీ ఎంతగానో కృషి చేశాడు... ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీకి వరంగల్ జిల్లా కంచు కోటల ఉండేది.

విగ్రహ ఆవిష్కరణ....

మారుమూల ప్రాంతానికి ఎన్నో విశిష్ట సేవలు అందించినందుకు గాను వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆ గ్రామంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. వీరపనేని శివాజీకి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు వీరపనేని రామకృష్ణ ఇటీవల కాలంలో ప్రముఖ సిని గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీతను వివాహం చేసుకున్నాడు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సునీత కూడా ఏజెన్సీ ప్రాంతానికి విచ్చేసింది. ఒక మాటలో చెప్పాలంటే సునీత మొట్టమొదటిసారిగా మెట్టినిల్లు ప్రాంతానికి వచ్చింది అని చెప్పుకోవాలి.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు