హోమ్ /వార్తలు /తెలంగాణ /

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిరసన జ్వాలలు.. కలెక్టరేట్ ముట్టడించిన విద్యార్థులు!

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిరసన జ్వాలలు.. కలెక్టరేట్ ముట్టడించిన విద్యార్థులు!

X
పేపర్

పేపర్ లీక్ పై నిరసన

Telangana: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు దేశంలో అత్యున్నత పరీక్షలుగా పరిగణిస్తారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు దేశంలో అత్యున్నత పరీక్షలుగా పరిగణిస్తారు. మళ్లీ అంతటి స్థాయి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే గ్రూప్ వన్ పరీక్షకి దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగినప్పటినుంచి తెలంగాణ నిరుద్యోగులు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు సాధించడం కోసం అహర్నిశలు తాపత్రయపడుతున్నారు.

దాదాపు 13 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అనేకమంది నిరుద్యోగులు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు సాధించాలనే పట్టుదలతోసాధన చేస్తున్నారు. ములుగు జిల్లా లాంటి వెనకబడిన ప్రాంతంలోని నిరుద్యోగులు కూడా గ్రూప్ వన్ ఉద్యోగాలు సాధించాలనే పట్టుదలతో ముల్లె ముఠా సదురుకొని పట్టణాల వైపు పరుగులు పెట్టారు.

పేదరికం వెక్కిరించినా.. ఆర్థిక స్తోమత వెనక్కి లాగినా ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో అనేకమంది నిరుద్యోగులు ములుగు ప్రాంతం నుంచి పట్టణాల వైపు పరుగులు తీశారు. కొందరు సొంతంగా ప్రిపరేషన్ మొదలుపెట్టారు. మరికొందరు గిరిజన యువతి యువకులకు గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తీసుకున్నారు.

కానీ వారికి ఏం తెలుసు పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని. టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్షల విషయంలో పేపర్ లీకేజ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. పేపర్ లీక్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఐదు పరీక్షలను రద్దు చేసింది. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లాలోని యువకులు సైతం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రూప్ వన్ పరీక్షలు ములుగు జిల్లా కేంద్రంగా కూడా అధికారులు నిర్వహించారు. పూర్తిగా గిరిజన జిల్లా అయినప్పటికీ అనేకమంది ఈ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమించారు. కానీ పేపర్ లీక్ కావడంతో వారు పడ్డ శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఎందరో నిరుద్యోగులు ఆత్మబలి దానాలు చేసుకొని స్వరాష్ట్ర సాధించుకున్న తర్వాత కనీసం ఉద్యోగ పరీక్షల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం చాలా బాధాకరమని ములుగు జిల్లా నిరుద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో సొంత ఇంటికి దూరంగా, ఉద్యోగం సాధించాలనే తపనతో సంవత్సరాల తరబడి పట్టణాలలో కష్టపడుతుంటే ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ములుగు జిల్లా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

First published:

Tags: Local News, Mulugu, Telangana, TSPSC

ఉత్తమ కథలు