హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: చలికి వణుకుతున్న ఏజెన్సీ..దుప్పట్ల పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే

Mulugu: చలికి వణుకుతున్న ఏజెన్సీ..దుప్పట్ల పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే

MLA Seethakka

MLA Seethakka

దేశంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి. కనిష్ట స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు చలిని విపరీతంగా పెంచేస్తున్నాయి. పల్లె ప్రాంతాలుచలికి వలికి పోతున్నాయి. ఇక ఏజెన్సీ గ్రామాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చుట్టూ దట్టమైన అటవీ పెద్ద పెద్ద చెట్లు వాగులు వంకలు గిరిజన ఆవాసల చుట్టూ ఉంటాయి. ఇలాంటి ప్రాంతాలలో చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గిరిజనులు చలికి వణుకుతూ అల్లాడిపోతుంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(Venu Medipelly, News18, mulugu)

దేశంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి. కనిష్ట స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు చలిని విపరీతంగా పెంచేస్తున్నాయి. పల్లె ప్రాంతాలు చలికి వలికి పోతున్నాయి. ఇక ఏజెన్సీ గ్రామాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చుట్టూ దట్టమైన అటవీ పెద్ద పెద్ద చెట్లు వాగులు వంకలు గిరిజన ఆవాసల చుట్టూ ఉంటాయి. ఇలాంటి ప్రాంతాలలో చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గిరిజనులు చలికి వణుకుతూ అల్లాడిపోతుంటారు. ఇక ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏజెన్సీలో రోజురోజుకీ చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది.

ముఖ్యంగా చిన్నపిల్లలు వయోవృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క ఉదార హృదయంతో పెద్ద మనసు చేసుకొని గిరిజన కుటుంబాలకు 200 పైగా కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. నిరంతరం ప్రజల క్షేమం కోసం ఆలోచించే సీతక్క తీవ్రచలితో ఆదివాసి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించింది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క దుప్పట్లు పంపిణీ చేశారు. ఈరోజు తాడ్వాయి మండలంలోని లింగాల, బోటి లింగాల గ్రామంలో 210 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మంగపేట మండలం సంఘంపల్లి గ్రామంలో మరో 20 కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రజలకు మరింత సేవ చేస్తానని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సీతక్కఅన్నారు. దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉందని చిన్నపిల్లలు వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీతక్క సూచించారు.

నన్ను ఆదరించిన ప్రజలకు నేనెప్పుడూ అండగా ఉంటానని.. వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తానని.. నిరంతరం ప్రజల సమస్యల కోసం పోరాడుతానని చెప్తున్నారు. ములుగు జిల్లాలో ప్రధానంగా పోడు భూముల సమస్య ఉందని, ప్రభుత్వం చేపట్టిన పోడు భూముల సర్వే గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని, అర్హులైన అందరికీ హక్కు పత్రాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు వృద్దులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీతక్క చెబుతున్నారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు