Home /News /telangana /

MULUGU TRIBALS IN MULUGU ARE SLAUGHTER A PIG FOR GODDESS MYSAMMA AND CELEBRATE SEEDS FESTIVAL FULL DETAILS HERE MMV PRV BRV

Mulugu: అన్నం పెట్టే అన్నపూర్ణకు, భారం మోస్తున్న భూమాతకు మొదటి పూజ.. గిరిజనుల విత్తన పండుగ..

ములుగు

ములుగు జిల్లా ఇప్పలగడ్డలో విత్తన పండుగ చేసుకుంటున్న గిరిజనులు

ములుగు జిల్లా ఏటూరునాగారం పరిధిలోని ఇప్పలగడ్డ తండాలోని గిరిజనులు మాత్రం మొదటగా భూమాతకు పూజ చేసిన తర్వాతే పనులు ప్రారంభిస్తారు. ఈ పండుగను వీరు విత్తనం పండుగ అని పిలుస్తుంటారు. ఈ సాంప్రదాయం కేవలం గిరిజనులలో మాత్రమే మనకు కనిపిస్తుంది.

ఇంకా చదవండి ...
  (Venu Medipelly, News18, Mulugu)

  ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంది. మానవుడు చంద్రమండలం పైకి వెళ్తున్నాడు. ప్రపంచీకరణ పేరుతో పాశ్చాత్య దేశాల సంస్కృతిని సైతం మనం అవలంబించడం జరుగుతుంది. కానీ ఎక్కడో చోట ఆధునిక మనుషుల జీవన శైలికి సంబంధించిన కొన్ని ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. భూమి, ప్రకృతిని దైవ సమానంగా భావిస్తూ వేల సంవత్సరాల క్రితం నుంచి భారతీయులు వాటిని ప్రార్ధిస్తూ వస్తున్నారు. కానీ కాలక్రమేణా ఆ ఆచారాలు దాదాపుగా కనుమరుగయ్యాయి. కొన్ని మారుమూల గిరిజన ప్రాంతాల్లో (Tribal areas) మాత్రమే ప్రకృతిని కొలిచే ఆచారాలు కొనసాగుతున్నాయి.

  భూమాతకు మొదటి పూజతో వ్యవసాయం ప్రారంభం..

  వారికి బయటి ప్రపంచంలోని కొత్త పోకడలతో సంబంధం లేదు, కొత్త టెక్నాలజీతో వారికి పని లేదు, వారు నమ్ముకున్న బతుకు దెరువే వారికి దైవంతో సమానం. తమకు అన్నం పెడుతున్న భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అడవితల్లి ఆ గిరిజనులకు (Tribal) అమ్మలా కనిపిస్తుంది. చాలా మంది రైతులు తొలకరి చినుకులు కురవగానే ఎద్దులు, నాగలితో దుక్కిదున్ని వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. కానీ ములుగు (Mulugu) జిల్లా ఏటూరునాగారం (EturuNagaram) పరిధిలోని ఇప్పలగడ్డ తండాలోని (Eppalagadda Thanda) గిరిజనులు మాత్రం మొదటగా భూమాతకు పూజ చేసిన తర్వాతే పనులు ప్రారంభిస్తారు.

  ఈ పండుగను వీరు విత్తనం పండుగ అని పిలుస్తుంటారు. ఈ సాంప్రదాయం కేవలం గిరిజనులలో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఈ పండుగను జరుపుకోవడం వలన వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండుతాయని వీరి నమ్మకం. ఈ సంప్రదాయం తాతల ముత్తాతల నుండి పూర్వీకుల నుంచి కొనసాగుతుంది. గిరిజనులు ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. దానిలో భాగంగానే విత్తనం పండుగ  (Seed festival) అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు.

  పొలంలో మైసమ్మకు జంతు బలి ఆచారం..

  గిరిజనులకు వ్యవసాయమే (Agriculture) ప్రధాన బతుకుదెరువు. కాబట్టి మొదటి పూజ ఆ భూదేవికి సమర్పిస్తారు. దీన్నే విత్తనం పండుగగా (Seed festival) పిలుస్తుంటారు.  గ్రామ గిరిజన పెద్దలంతా కలిసి ప్రతి కుటుంబం నుంచి కొంత మొత్తంలో డబ్బులు పోగు చేసుకుంటారు. పోగుచేసిన డబ్బులతోనే విత్తనం పండుగను నిర్వహిస్తుంటారు. ప్రతి కుటుంబం నుంచి తెచ్చిన ధాన్యాలను కొన్ని భూదేవి వద్ద నాటుతారు. అనంతరం పొలం వద్దకు వెళ్లి మైసమ్మకు జంతు బలి సమర్పిస్తారు. పొలాల మధ్యలో ఉండే మైసమ్మ తల్లికి పందిని బలి ఇవ్వడం (slaughter a pig for goddess Mysamma )గిరిజనుల ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగకు పందిని బలిస్తే పైరుకు మేలు జరుగుతుందని వీరి నమ్మకం. పంటపొలాలను ఎక్కువశాతం పందులు పాడు చేస్తాయి. కాబట్టి పందిని బలిస్తే కరువుకాటకాలు రాకుండా పంటలు బాగా పండుతాయని వీరి విశ్వాసం.

  ఇప్ప పువ్వు సారా ఆరబోత: భూదేవికి పూజ (Worship), మైసమ్మకు జంతు బలి అనంతరం ఈ పండుగలో గ్రామ దేవతలకు ఇప్ప పువ్వులతో చేసిన సారాయిని నైవేద్యంగా ఆరబోస్తున్నారు గిరిజనులు. గ్రామంలో అందరు సమానమే అన్న భావన వచ్చేలా బలి ఇచ్చిన పంది మాంసంతో ఊరు పెద్దలందరూ సామూహిక విందు భోజనాలు చేస్తారు. ఈ భోజనాలతో గిరిజనుల విత్తన పండుగ  (Seed festival) ముగుస్తుంది. తరువాత వచ్చే వర్షాలకు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు గిరిజనులు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Agriculture, Festival, Local News, Mulugu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు