హోమ్ /వార్తలు /తెలంగాణ /

శభాష్.. తండ్రి ఆశయం కోసం పీహెచ్‌డీ పట్టా సాధించిన గిరిజన యువకుడు!

శభాష్.. తండ్రి ఆశయం కోసం పీహెచ్‌డీ పట్టా సాధించిన గిరిజన యువకుడు!

X
భూక్య

భూక్య అమర్‌సింగ్

ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి పర్యవేక్షణలో భూక్య అమర్ సింగ్ 'ట్రైబల్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ - ఏ కంపారిటివ్ స్టడీ ఆన్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్' అనే గిరిజన అంశాన్ని ఎంచుకొని పీహెచ్‌డీ పూర్తి చేశాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రిపోర్టర్ : వేణు మేడిపెళ్లి

లొకేషన్ : రామయ్యపల్లి, ములుగు

ములుగు ప్రాంతంలోని అనేకమంది యువకులు ఉన్నత ఆశయాలను సాధించాలని కలలు కంటూ ఉంటారు. అయితే, వారి కలలను సహకారం చేసుకోవాలంటే వెనకబడిన ములుగు లాంటి జిల్లాలో సరియైన సదుపాయాలు లేవని చెప్పుకోవాలి. ములుగు జిల్లాకు చెందిన యువకులు ఉన్నత విద్యను అభ్యసించాలనే కలను సాకారం చేసుకొనేందుకు ములుగు ప్రాంతానికి దూరంగా ఉన్న వరంగల్ , హైదరాబాద్ , కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ములుగు జిల్లాలో ఇప్పటివరకు ఉన్నత విద్య విషయంలో ఒక్క విద్యాలయం లేదు అంటే మీరు నమ్ముతారా?అయినప్పటికీ కొందరు యువకులు మాత్రం వారి కన్న కలలు సహకారం చేసుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే ములుగు ప్రాంతం రామయ్య పల్లి అనే మారుమూల గ్రామానికి చెందిన గిరిజన యువకుడు భూక్య అమర్ సింగ్.

భూక్య అమర్ సింగ్ తన తండ్రి ఆశయం నెరవేర్చడం కోసంపిహెచ్డి పట్టా సాధించి ఎందరో గిరిజన యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అమర్ సింగ్ తల్లిదండ్రులు భూక్య లక్ష్మణ్ నాయక్, రక్లీ దంపతులకు ఐదవ సంతానం. మారుమూల ప్రాంతంలో నివాస ఉంటున్న భూక్య లక్ష్మణ్ నాయక్ తన చిన్న కుమారుడు అయిన అమర్ సింగ్ ఉన్నత విద్యలో రాణించాలని, డాక్టరేట్ సాధించి అరుదైన గౌరవం పొందాలని కలలు కనే వారు. ఈ విషయం తన చిన్న కుమారుడైన అమర్ సింగ్ తో నిరంతరం ప్రస్తావిస్తూ.. అతనిని ఉన్నత లక్ష్యం వైపు తీసుకు వెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. తండ్రి ఆశయం మేరకు అమర్ సింగ్ కూడా ఎలాగైనా డాక్టరేట్ సాధించాలని తపనపడ్డాడు.

ఎన్నో అవరోధాలు.. అన్నిటినీ అధిగమించి..

ఆశయం సంకల్పించుకున్నప్పటికీ అమర్ సింగ్ కు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. ఉన్నత విద్య విషయంలో ములుగు జిల్లాలో ఒక్క విశ్వవిద్యాలయానికి సంబంధించిన కళాశాల లేకపోవడంతో.. ఉన్నత విద్యను అభ్యసించాలంటే వరంగల్ లేదా కరీంనగర్ హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలోనే అర్థశాస్త్రం విభాగంలో కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు.

తల్లి చనిపోయి పాలు లేక పసికందు అవస్థలు..ఒక్క సాయంతో పరిష్కారం చూపిన ఆ మంత్రి

తండ్రి ఆశయం..

ఉన్నత విద్యను పూర్తిచేసిన అమర్ సింగ్ లక్ష్యం .. తన తండ్రి ఆశయమైన డాక్టరేట్ సాధించడం. ఇందుకోసం  కాకతీయ యూనివర్సిటీ పిహెచ్డి ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణత సాధించి పిహెచ్డి పరిశోధనకు అమర్ సింగ్ అర్హత సాధించాడు. ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి పర్యవేక్షణలో భూక్య అమర్ సింగ్ 'ట్రైబల్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ - ఏ కంపారిటివ్ స్టడీ ఆన్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్' అనే గిరిజన అంశాన్ని ఎంచుకొని పీహెచ్‌డీ పూర్తి చేశాడు. పిహెచ్డి పట్టా సాధించిన ఆనందాన్ని అమర్ సింగ్ తన నాన్నతో పంచుకోవాలని అనుకున్నాడు.. కానీ దురదృష్టకరం ఏమిటంటే కొన్ని నెలల క్రితం అమర్ సింగ్ తండ్రి లక్ష్మణ్ నాయక్ అనారోగ్య సమస్యలతో మరణించారు.

పీహెచ్డీ పట్టా సాధించిన డాక్టర్ భూక్య అమర్ సింగ్ తో మాటల్లోనే..

మాది మధ్యతరగతి కుటుంబం, మా కుటుంబంలో నేనే చిన్నవాడిని, మారుమూల ప్రాంతానికి చెందిన మేము సమాజంలో గౌరవంగా జీవించాలని మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే నేను పీహెచ్డీ పట్టా సాధించాలన్నది మా నాన్నగారి ఆశయం. ఈ మేరకు పిహెచ్డి పట్టా సాధించి ఆయనకు అంకితమిచ్చానని చెప్పారు. ములుగు జిల్లా వెనుకబడ్డ ప్రాంతంగా కాగా ఇప్పుడే అభివృద్ధి వైపు పయనిస్తుంది. సదుపాయాలు లేవని ఇక్కడ యువత నిరాశ చెందకుండా ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలని ములుగు జిల్లా యువతకు డాక్టర్ భూక్య అమర్ సింగ్ సూచించారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana News

ఉత్తమ కథలు