Home /News /telangana /

MULUGU THREE WOMEN ARE MAKING PASTRIES AND SETTING AN EXAMPLE FOR ANOTHER WOMAN ABH BRV MMV

Mulugu: ఆ ముగ్గురు మహిళల పిండి వంటలు అమెరికా వరకు ఫేమస్

లడ్డులు

లడ్డులు తయారు చేస్తున్న మహిళలు

ములుగు జిల్లాలో శుభకార్యం ఏదైనా పిండి వంటలు ఎక్కువగా అక్కడి నుంచే వస్తుంటాయి. ఒక్కసారి ఆ రుచికి అలవాటు పడ్డారంటే మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్తారు. నాణ్యత, శుభ్రత పాటిస్తూ ముగ్గురు మహిళలు రుచికరమైన పిండి వంటలతో చక్కని స్వయం ఉపాధి పొందుతున్నారు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    M.Venu, News 18, Mulugu

    Mulugu: ములుగు జిల్లాలో శుభకార్యం ఏదైనా పిండి వంటలు ఎక్కువగా అక్కడి నుంచే వస్తుంటాయి. ఒక్కసారి ఆ రుచికి అలవాటు పడ్డారంటే మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్తారు. నాణ్యత(Quality), శుభ్రత(Clean) పాటిస్తూ ముగ్గురు మహిళలు(Three wonen) రుచికరమైన పిండి వంటలతో చక్కని స్వయం ఉపాధి పొందుతున్నారు. ములుగు చల్వాయి గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు ఆర్డర్ పై పిండి వంటలు తయారు చేస్తూ స్వయం ఉపాధి ద్వారా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

    చిన్నపాటి ఆర్డర్లతో మొదలు:
    జయ, అనిత, కళ్యాణిలు గృహిణీలుగా సాధారణ జీవితం గడిపేవారు. ములుగు వంటి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా ఉపాధి లేకపోగా, వ్యవసాయ పనులు చేతకాక ఇంటి వద్దే ఉంటూ ఆదాయ మార్గం కోసం ఆలోచించారు. పిండివంటలు, మిఠాయిలు తయారీపై వారికీ కొంచెం పట్టు ఉండడంతో ఆదిశగా చిరు వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు. స్థానికంగా జరిగే శుభకార్యాలకు ఆర్డర్ పై పిండి వంటలు తయారుచేస్తే పెద్దగా నష్టం ఉండకపోవచ్చని భావించిన మహిళలు ఆదిశగా అడుగులు వేశారు. అలా చిన్న ఆర్డర్లను అందుకుంటూ మొదలుపెట్టిన ఈ వ్యాపారం రానురాను ఆర్డర్లు పెరిగి అమెరికా(America) దేశం సైతం వెళ్ళాయి. పిండి వంటలు చేసే విషయంలో క్వాలిటీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఒక్కసారి మా పిండి వంటలు రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ ఆర్డర్లు ఇస్తున్నారని ముగ్గురు మహిళలు చెప్పుకొచ్చారు. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో ఖచ్చితంగా ఉంటూ నాణ్యమైన ముడి సరుకులు ఉపయోగిస్తూ రుచికరమైన పిండివంటలు తయారు చేస్తున్నట్లు ముగ్గురు మహిళలు న్యూస్ 18తో చెప్పారు.

    ఇతర దేశాలకు పార్సెల్ ఆర్డర్లు:
    ములుగు జిల్లాకు చెందిన అనేక మంది ఇతర దేశాలలో స్థిరపడ్డ వారు ఉన్నారు. ఈ పిండి వంటల గురించి తెలుసుకున్న వారు సొంత గ్రామాలకు వచ్చినప్పుడు ఆర్డర్లు ఇచ్చి పిండి వంటలు ప్యాక్ చేసుకొని అమెరికా(America) వంటి దేశాలకు తీసుకెళ్తున్నట్లు మహిళలు తెలిపారు. ములుగు జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సైతం తమ వద్ద ఆర్డర్ పై పిండి వంటలు చేయించుకుంటారని మహిళలు అంటున్నారు. వీటికోసం ప్రత్యేకంగా ఒక షాప్ ఏర్పాటు చేసుకోవాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కాబట్టి...ఇంటి వద్ద ఉంటూ ఆర్డర్ వచ్చినప్పుడు పిండి వంటలు చేస్తున్నారు. "తమకు ఎటువంటి ఆఫీసు గాని, షాప్ గాని లేదని, కేవలం ఇంటి వద్ద ఉంటూ ఫోన్ల ద్వారా వచ్చిన ఆర్డర్లపై తాయారు చేసి పంపుతున్నట్లు" మహిళలు అంటున్నారు. గ్యారప్పాలు, మడుగులు, కారప్పూస, బూంది లడ్డు, రవ్వ లడ్డు, సున్నుండ, మొగలిరేకులు, గరిజలు, గవ్వలుతో పాటు ఇతర పిండి వంటలు ఆర్డర్ పై తయారు చేస్తారు. ఐటెంను బట్టి ధర ఉంటుందని వారు చెప్తున్నారు.

    Read this also; Rajanna Sircilla: ఇల్లంతా దోచేసిన దొంగలు.. కానీ వాటిని మాత్రం టచ్ చేయలేదు.. ఆ మాత్రం భయం ఉండాల్సిందే..!

    పిండి వంటల తయారీలో కేవలం కట్టెల పొయ్యి వినియోగిస్తున్నారు. దీంతో పిండి వంటల రుచి బాగుంటుందని నిర్వాహకురాలు జయ అంటున్నారు. దాదాపు మూడు సంవత్సరాల నుంచి తాము ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ పిండి వంటల విషయంలో ఇప్పటివరకు ఎవరూ బాగోలేదన్న మాట రాలేదని అంటున్నారు. పిండి వంటలు కోసం ఆర్డర్ ఇవ్వాలంటే రెండు రోజుల ముందు సంప్రదించాలని నిర్వాహకులు చెప్తున్నారు. పిండి వంటలు వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్ 9441795284.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Food, Local News, Mulugu, Telangana

    తదుపరి వార్తలు