ములుగు జిల్లా పేరు చెప్పగానే వెంటనే ఏజెన్సీ అడవి ప్రాంతం గుర్తుకు వస్తుంది. దశాబ్దాల క్రితం వెనక్కి వెళ్తే సాయంత్రం 6:00 దాటిన తర్వాత ఏటూర్ నాగారం ప్రాంతం వైపు వెళ్లాలంటే ఒక తెలియని భయం మనుషులను వెంటాడేది... ఏజెన్సీ అటవీ ప్రాంతంలోని మృగాలతో ఒక భయం అయితే మరో భయం మావోయిస్టుల రూపంలో ఉండేది. ప్రభుత్వ వాహనాలు నడవాలన్నా ప్రజా రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన బస్సులు నడవాలన్న భయం గుప్పిట్లో ప్రయాణం చేయాల్సిందే. ఇది దశాబ్దాల క్రితం నాటి ములుగు ఏజెన్సీ అటవీ ప్రాంతం కథ....
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ఆధునికత పెరిగిపోయింది. చీమ చిటుకుమన్న వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయినప్పటికీ ఈ అటవీ ప్రాంతంలో ఇప్పటికీ మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడం కోసం తాపత్రయపడుతున్నారు..... అలాగే మావోయిస్టుల ప్రణాళికను నిర్వీర్యం చేయడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారు.
నూతనంగా ములుగు జిల్లా ఏర్పాటు జరిగిన అనంతరం ముగ్గురు యువ ఐపీఎస్ అధికారుల కను సన్నల్లో అటవీ ప్రాంతాన్ని ప్రత్యేక బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.... ప్రస్తుతం ములుగు జిల్లా ఎస్పీగా గాష్ ఆలం ఐపీఎస్ , ములుగు భూపాలపల్లి ఓ ఎస్ డి గా అశోక్ కుమార్ ఐపీఎస్ , ఏటూర్ నాగారం ఏ ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ విధులు నిర్వహిస్తున్నారు... అంతే కాకుండా ఏటూరు నాగారం పరిసర ప్రాంతాలలో ఉండే గుత్తి కోయ గుంపులకు పోలీసులు వెళ్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు..
ములుగు భూపాలపల్లి భద్రాది కొత్తగూడెం జిల్లాలకు సరిహద్దుగా ఉన్నటువంటి మహారాష్ట్ర చతిస్గడ్ రాష్ట్రాల నుంచి మావోయిస్టుల అగ్ర నేతలు తెలంగాణ అడవుల్లోకి ప్రవేశించారు అనే ప్రశ్న తలెత్తుతుంది.... గోదావరి నది పరివాహక ప్రాంతంలో వాజేడు వెంకటాపురం పోలీస్ అధికారులు డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల కదలికపై ప్రత్యేక దృష్టిని పెట్టారు.
మావోయిస్టు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం కరపత్రాలు విడుదల చేస్తూ రాజకీయ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అంతేకాకుండా మావోయిస్టులు పోలీసుల లక్ష్యంగా ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన బీర్ బాటిల్ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు అనంతరం ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులు ఏటూరు నాగారం ఏఎస్పీ ఎదుట లొంగిపోయారు.....
ఎండాకాలం కావడంతో అటవీ ప్రాంతం పూర్తిగా ఆకు రాల్చి మోడు బారిపోతుంది ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల కదలికపై పూర్తిగా పట్టు సాధించవచ్చునని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి అందుకే అటవీ ప్రాంతాన్ని ప్రత్యేక బలగాలతో తనిఖీలు నిర్వహిస్తూ డ్రోన్ల సహాయంతో నిఘా ఏర్పాటు చేశారు.ఎవరైనా మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana