Venu, News18, Mulugu
భారతదేశం (India) లో ఆదివాసీల సాంప్రదాయాలు ఆచారపు అలవాట్లు చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి ముఖ్యంగా ములుగు జిల్లా (Mulugu) ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసీలు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ములుగు ప్రాంతంలోనే ఆసియా (Asia) లోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే మేడారం మహా జాతర (Medaram Jathara) ను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలోనే ములుగు చుట్టుపక్కల అనేక ప్రాంతాలలో చిన్న చిన్న జాతరలనుకూడా పూజారులు నిర్వహిస్తూ ఉంటారు. మహా జాతర సమయం వచ్చిందంటే గిరిజన సాంప్రదాయాలు అంగరంగ వైభవంగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గేట్వే ఆఫ్ ములుగుగా చెప్పుకునే ఘటన తల్లి వద్ద జాతర సమయంలో భక్తుల కులాహలం సందడిగా ఉంటుంది భక్తులు మొదటగా ఘట్టమతల్లిని దర్శించుకున్న తరువాతనే మేడారం వనదేవతలను దర్శించుకుంటారు...
మేడారం జాతరకు ఎంత ప్రత్యేకత ఉందో ములుగు ఘట్టమ తల్లి దేవాలయానికి అంతే ప్రత్యేకత ఉంది ఇక్కడ పూజారులుగా నాయక పొడ్ వంశస్థులు మాత్రమే పూజారులుగా వ్యవహరిస్తూ ఉంటారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ములుగు ఘట్టమతల్లికి ఆదివాసీ నాయక పోడు వంశస్థులు ఎదురు పిల్ల పండుగను నిర్వహిస్తారు... ఈ ఎదురు పిల్ల పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది.
ఆదివాసి నాయకపోడు ములుగు జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ న్యూస్ 18 తో ఈ ఎదురు పిల్ల పండుగ ప్రత్యేకతను వివరించారు. గిరిజనులకు మాఘ శుద్ధ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైన రోజుగా ఉంటుంది. ఎదురు పిల్ల పండుగలో భాగంగా ఘట్టమ దేవాలయ ప్రధాన పూజారులు ఆలయాన్ని శుద్ధిచేసి డబ్బు వాయిద్యాలతో మామిడాకుల తోరణాలు తో పాటు గుడిని అలంకరిస్తారు. గట్టమ్మ దేవాలయానికి వెనుక భాగంలో ఉండే అడవి ప్రాంతం నుంచి కంకణం తీసుకువచ్చి గట్టమ్మ గుడికి ఇరువైపులా ఉన్న సమ్మక్క సారలమ్మ వద్దపై కంకణాన్ని ప్రతిష్టిస్తారు.
దట్టమ్మ దేవాలయం ప్రధాన పూజారి కొత్త సదయ్య ఆధ్వర్యంలో ఈ పండుగను నిర్వహించడం జరుగుతుంది. ప్రధాన పూజారి వడ్లను రోకలితో దంచి బియ్యాన్ని వేరుచేసి కేవలం ఆ బియ్యంతో మాత్రమే భవనాన్ని ప్రత్యేకంగా వండటం జరుగుతుంది అనంతరం ఘట్టమ దేవతకు దీపాన్ని ఆరాధించి మౌనవతాన్ని పాటించడం జరుగుతుంది. ఈ మూడు వ్రతం ములుగు పట్టణం నుంచి మొదలుకొని ఎదురు పిల్ల పండగలో భాగంగా లక్ష్మీ దేవర డప్పు వైద్యాలతో దాదాపు నాయకత్వం కుల సంఘం మొత్తం 500 మంది జనాభాతో 100 బోనాలతో ములుగు ప్రాంతం నుంచి నడుచుకుంటూ గట్టమ్మ ఆలయం వద్దకు వచ్చి ఘట్టమ్మ దేవతకు భవనం సమర్పించిన తరువాత మౌనవ్రతాన్ని వేయడం జరుగుతుందని సురేందర్ చెప్తున్నాడు.
ముఖ్యంగా ములుగు గట్టెమ్మ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని ఇక్కడికి అనేకమంది భక్తులు వస్తూ ఉంటారని భక్తుల కోసం ఇక్కడ సౌకర్యాలను కూడా ప్రతి విధంగా ఏర్పాటు చేస్తున్నామని నాయకత్వం జిల్లా అధ్యక్షుడు సురేందర్ న్యూస్ 18 తో వివరించాడుముఖ్యంగా ములుగు గట్టెమ్మ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని ఇక్కడికి అనేకమంది భక్తులు వస్తూ ఉంటారని భక్తుల కోసం ఇక్కడ సౌకర్యాలను కూడా ప్రతి విధంగా ఏర్పాటు చేస్తున్నామని నాయకత్వం జిల్లా అధ్యక్షుడు సురేందర్ న్యూస్ 18 తో వివరించాడు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana