హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఒడిత సాయంతో రాయి పెట్టి కొడితే కోతులు పరార్.. అసలు ఒడిత అంటే తెలుసా..?

ఒడిత సాయంతో రాయి పెట్టి కొడితే కోతులు పరార్.. అసలు ఒడిత అంటే తెలుసా..?

X
ములుగు

ములుగు రైతులకు కోతుల బెడద

Mulugu: కోతుల బెడద నిత్యంగిరిజన రైతులను వేధిస్తోంది. దీంతో రైతన్నలకు దిక్కుతోచని పరిస్థితి. ఏమి చేస్తే ఈ సమస్యను తీరుతుందోనని నిత్యం పలు రకాల ప్రయోగాలు చేస్తున్న జవాబు దొరకటం లేదు. రకరకాల మారు వేషాలు వేసుకున్న ప్రయోజనం మాత్రం కనిపించటమే లేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Venu, News18, Mulugu

కోతుల బెడద నిత్యంగిరిజన రైతులను వేధిస్తోంది. దీంతో రైతన్నలకు దిక్కుతోచని పరిస్థితి. ఏమి చేస్తే ఈ సమస్యను తీరుతుందోనని నిత్యం పలు రకాల ప్రయోగాలు చేస్తున్న జవాబు దొరకటం లేదు. రకరకాల మారు వేషాలు వేసుకున్న ప్రయోజనం మాత్రం కనిపించటమే లేదు. దీంతో కొండపర్తిలో ఓ రైతు పూర్వకాలపు పద్దతులను అనుసరిస్తూ ఈ కోతుల నుంచి పంటలను కాపాడుకుంటున్నాడంటా... అసలు ఏంటో పద్దతి అని ఆలోచిస్తున్నారా? కోతులను బెదిరించేందుకు ఏకైక సాధనం ఒడిత.. దీనిలో రాయి ఉంచి.. గురిపెట్టి కోతుల గుంపుపై విసిరితే పరార్ అవ్వాల్సిందేనట.. రైతులను కోతుల బెడద తీవ్రంగా కలవరపెడుతుంది. ములుగు జిల్లా (Mulugu District) వ్యాప్తంగా గిరిజన రైతులు ఎక్కువగా పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు.

వీరు అటవీ ప్రాంతంలోనే పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు కాబట్టి వీరి పంటలపై కోతుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పంట ఏదైనా కానీ కోతుల బెడద మాత్రం తప్పేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఇక్కడి ఆదివాసీలు మొక్కజొన్న,పత్తి, వరి,పెసర, బొబ్బెర ఇలాంటి పంటలు వేస్తూ ఉంటారు. వ్యవసాయ భూమిని పంటకు అనుకూలంగా చేయడం కోసం అనేక వ్యయ ప్రయాసలకు కూడుకొని అన్ని సిద్ధం చేసుకుంటాడు. గింజలు పెట్టినప్పటి నుంచి మళ్లీ పంట చేతికి వచ్చేవరకు రైతుకు కంటిమీద కునుకు ఉండదు. నిరంతరం వ్యవసాయ భూమిలో కష్టపడితే కానీ ఆశించినంత దిగుబడి రావడం లేదు. ఇలాంటి తరుణంలోనే రైతులు పండించిన పంటలపై కోతులు దాడి చేస్తున్నాయి.

ఇది చదవండి: ఏజెన్సీలో లంపిస్కిన్ వ్యాధి కలవరం.. పశువైద్యుల సూచనలు ఇవే..!

చేతికిచ్చే పంటను సర్వనాశనం చేస్తున్నాయి. చేతికొచ్చిన వరి చేనును కోతుల గుంపు ఆగం ఆగం చేస్తున్నాయి.పత్తి చేనులో పత్తి కాయలు మెండుగా ఉన్నాయి. ఈసారి ఆశించినంత లాభాలు వస్తాయని రైతన్న సంతోషపడే లోపే కోతుల గుంపు ఆ కాయలను కొరికి వేస్తున్నాయి. ఇలా కోతుల బెడద నుంచి ఎలా తప్పించుకోవాలో రైతులకు మాత్రం అర్థం కావడం లేదు.

ఇది చదవండి: బాడీబిల్డింగ్ లో దూసుకుపోతున్న సింగరేణి యువకుడు

కానీ ఏవో కొత్త కొత్త ప్రయత్నాల ద్వారా కొందరు రైతులు వినూత్న పద్ధతుల ద్వారా కోతులను బెదిరిస్తున్నారు. ఒక ప్రాంతానికి చెందిన రైతు కోతులతో విసిగిపోయి తానే స్వయంగా కొండెంగ వేషం వేసుకొని చేను చుట్టూ చెక్కర్లు కొడుతున్నాడు. మరో ప్రాంతంలో మరొక రైతు తానే దిష్టిబొమ్మ అవతారమెత్తి చేన్లో నిల్చున్నాడు. కానీ పూర్వపు కాలంలో ఇలాంటివేవీ లేవు. వారికి తెలిసిందల్లా ఒకటే కోతులను బలంగా బెదిరించేందుకు ఆయుధంగాఒడిత ఉండేది.

ఇది చదవండి: నల్లమలలో గుప్త నిధుల తవ్వకాలు.., నిధి దొరికిందా..? పురాతన ఆలయాల వద్ద ఏం జరుగుతుంది..?

దీనిలో రాయి పెట్టి కొడితే ఎంతటి కోతుల గుంపు అయినపరార్ కావాల్సిందే. ఈ ఒడిత ద్వారా కొండపర్తిలో80 సంవత్సరాలు ఉన్న తాతకోతులను బెదిరిస్తూ ఉండటం న్యూస్ 18 ప్రతినిధి గమనించాడు. వెంటనే అతని వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అతని పేరు సమ్మయ్య దాదాపు 80 సంవత్సరాలు.కష్టపడి పండించిన పంట కోతులు నాశనం చేస్తుంటే చూస్తూ కూర్చోలేక బోడితే ద్వారా రాళ్లను పెట్టి కోతులను బెదిరిస్తున్నాడు. అయితే ఈ కొడితే ఆయుధాన్ని ఈ కాలంలో అందరూ మర్చిపోయారు. కానీ పూర్వపు కాలంలో గిరిజనులు మాత్రం వేటాడటానికి కూడా ఈ పరికరాన్ని ఉపయోగించేవారు.

ఈ తాత ఒడితే ద్వారా రాళ్ళను పెట్టి కోతులను బెదిరిస్తుంటే రాళ్లు బుల్లెట్ వేగంతో దూసుకు వెళ్తున్నాయి. ఈ ఆయుధాన్ని సరిగా ఉపయోగించక రాకపోతే ఆ రాయి మళ్లీ మనకే తాకే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మాత్రం ఇలాంటి పరికరాలు ఎవరు వాడటం లేదని మా లాంటి ప్రత్యేకంగా తెలిసిన వారే ఉపయోగిస్తున్నారని ఆ తాత చెప్పాడు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు