హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ఆ జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుందా?.., కొత్త రైల్వే లైన్ పనులతో జిల్లా వాసుల హర్షం

Mulugu: ఆ జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుందా?.., కొత్త రైల్వే లైన్ పనులతో జిల్లా వాసుల హర్షం

X
ములుగు

ములుగు కొత్త రైల్వే లైన్ పనుల్లో ముందడుగు

రైల్వే మార్గం (Railway Line) తో సుదూర ప్రాంతాలతో కనెక్టివిటీ పెరగడమే కాకుండా.. స్థానికంగానూ అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఇప్పుడు తెలంగాణ (Telangana) లోని ములుగు జిల్లాలో ఇదే జరుగుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

Venu, News18, Mulugu

ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదటగా అక్కడ రవాణా సౌకర్యాలుండాలి. రోడ్డు, రైల్వే మార్గాలుంటే ఆ ప్రాంతానికి తిరుగుండదు. ముఖ్యంగా రైల్వే మార్గం (Railway Line) తో సుదూర ప్రాంతాలతో కనెక్టివిటీ పెరగడమే కాకుండా.. స్థానికంగానూ అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఇప్పుడు తెలంగాణ (Telangana) లోని ములుగు జిల్లాలో ఇదే జరుగుతోంది. ములుగు జిల్లా (Mulugu District) ప్రజల దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు సాకారం కానుంది. జిల్లా గుండా రైల్వే లైన్ నిర్మాణం కోసం ముందస్తు పనులు ప్రారంభం అయ్యాయి. కొన్నేళ్ల క్రితమే ములుగు పరిసర ప్రాంతాల్లో రైల్వే లైన్ నిర్మాణం కోసం సర్వేలు నిర్వహించారు. కానీ ఆ సర్వేలు తెల్ల కాగితాలకే పరిమితం అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ములుగు జిల్లా వాసుల చిరకాల కల రైల్వే లైన్ అలాగే ఉండిపోయింది. ఈనేపధ్యంలో ఇటీవలే ములుగు జిల్లాలో రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి సర్వేలు, భూ పరీక్షలు నిర్వహిస్తుండడంతో గిరిజన వాసుల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది.

బొగ్గు సరఫరా కోసం: ప్రస్తుతం జరుగుతున్న సర్వేలు మాత్రం ఉమ్మడి భూపాలపల్లి రామగుండంలో ఉన్న బొగ్గు తరలించడం కోసమే అని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఏర్పాటు చేసే రైల్వే లైన్ రామగుండం నుంచి మణుగూరు వరకు ఏర్పాటు చేయనున్నారు. పెద్దపల్లి , భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెం జిల్లాలను ఈ రైల్వే లైన్ కలుపుతుంది. ఈ ప్రాంతంలో సింగరేణి ద్వారా ఉత్పత్తి అయ్యే బొగ్గును మణుగూరుకు చేరవేసేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పటికే రైల్వే లైన్ నిర్మాణం నిమిత్తం సర్వేలు పూర్తయినట్లుగా, అధికారులు తమ నివేదికను కేంద్రానికి సమర్పించినట్లుగా కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే రైల్వే బడ్జెట్లో ఈ రైల్వే లైన్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించనున్నట్లు తెలుస్తుంది.

ఇది చదవండి: విద్యార్థి భవితకు బంగారు బాట వేసే 'తొలిమెట్టు'.., ప్రాథమిక విద్య నుంచే గుణాత్మక మార్పు

గతంలో జరిగిన సర్వేలు: భూపాలపల్లి ప్రాంతంలో 1980వ దశంలో బొగ్గు గనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి బొగ్గును రవాణా చేయడం కోసం రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఆలోచన మొదలైంది. దానిలో భాగంగానే మొట్టమొదటిసారిగా 1990వ దశకంలో రైల్వే సర్వేను చేపట్టారు. అనంతరం 2008, 2018 లోనూ సర్వేలు నిర్వహించి రైల్వే శాఖకు సమర్పించారు. భూపాల్ పల్లి నుంచి బొగ్గు రైల్వే లైన్ ద్వారా మణుగూరుకు తరలించాలని ప్రతిపాదన.

ఇది చదవండి: నాలుగు ప్రత్యేక అవార్డులు అందుకున్న ఏజెన్సీ ఏరియా ఆసుపత్రి.., కార్పొరేట్ మించి వైద్య సేవలు ఉన్నాయి మరి

పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి: ఉమ్మడి భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రైల్వే లైన్ నిర్మాణం కోసం సర్వేలు, భూమి పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ రైల్వే లైన్ ప్రతిపాదనలు పట్టాలెక్కితే ఉమ్మడి భూపాలపల్లి జిల్లా పర్యాటకంగానూ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాలేశ్వరం, కోట గుళ్ళు, పాండవుల గుట్ట, యునేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, ఆసియాలోనే అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం, ఆదిమానవులు ఆనవాళ్లు ఉన్న రాక్షస గుహలు దామెర వాయి, ఈ పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాల కలుపుకొని ఈ రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. ఇదే కనుక జరిగితే రానున్న రెండేళ్లలోనే మేడారంకు వచ్చే భక్తులు రైలు మార్గం ద్వారా జాతరకు వచ్చే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ రైల్వే లైన్ ద్వారా ప్రయోజనాలు: ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే రామగుండం, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం , భూపాలపల్లి, మంచిర్యాల , ఆసిఫాబాద్ జిల్లాలలో ఉత్పత్తి అయ్యే బొగ్గును సులభతరంగా మణుగూరుకు తరలించవచ్చు. భూపాలపల్లి ములుగు జిల్లాలలో లారీల రద్దీని తగ్గించవచ్చు. ఈ రెండు జిల్లాలో పండించిన పంటల ఉత్పత్తులను కూడా ఇతర ప్రాంతాలకు రైలు ద్వారా తక్కువ ధరకు రవాణా చేయవచ్చు. మొత్తానికి రైల్వే లైన్ నిర్మాణం పట్టాలెక్కడంపై ఉమ్మడి భూపాలపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: India Railways, Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు