హోమ్ /వార్తలు /తెలంగాణ /

విధి నిర్వహణ కోసం రోజూ 8 కి.మీ కాలినడకన.., అంగన్వాడీ టీచర్ ను మెచ్చుకోవాల్సిందే..!

విధి నిర్వహణ కోసం రోజూ 8 కి.మీ కాలినడకన.., అంగన్వాడీ టీచర్ ను మెచ్చుకోవాల్సిందే..!

ములుగు

ములుగు ఏజెన్సీలో శభాష్ అనిపిస్తున్న అంగన్వాడీ టీచర్

ఒకరోజు మంజుల తన విధుల్లో భాగంగా గ్రామానికి వస్తుండగా అడవి దున్నపోతుల గుంపు ఎదురుగా వచ్చింది. దీంతో మంజుల వెంటనే ఒక చెట్టు చాటుకు వెళ్లి ప్రాణాలను దక్కించుకుంది. ఎవరికైనా ఫోన్ చేయాలన్నా ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉండవు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  Venu, News18, Mulugu,

  ములుగు జిల్లా (Mulugu District) తాడ్వాయి మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంలో అనేక చిన్న గ్రామాలలో గిరిజన ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. గ్రామాలలో ఉండే చిన్న పిల్లల కోసం, గర్భిణీ స్త్రీల కోసం, బాలింతల కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంది. ఈ సేవలు నిమిత్తం ప్రభుత్వం అంగన్వాడి టీచర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ అంగన్వాడీ టీచర్లు ఆయా ప్రాంతాలకు వెళ్లి సేవలు అందించాల్సి ఉంటుంది. దీంతో వ్యక్తిగతంగా, వృత్తి పరంగా ఎన్ని సాధకబాధకాలు ఉన్నా తమ విధులను నిర్లక్ష్యం చేయడం లేదు ఆ అంగన్వాడీలు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని లవ్వాల అనే చిన్న గ్రామం ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన గుట్టల మధ్యన ఉన్న ఈ గ్రామంలో 1960 కంటే ముందే ప్రజలు నివాసాలను ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు.

  ఇక్కడ గ్రామంలో ఓటర్ల సంఖ్య కేవలం 90 మంది మాత్రమే. ఈ గ్రామంలో మహిళాశిశు సంరక్షణ నిమిత్తం ఒక అంగన్వాడి కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంజుల అనే అంగన్వాడీ టీచర్ దాదాపు 19 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలోని అంగన్వాడీ టీచర్ ‌గా విధులు నిర్వహిస్తోంది. కనీసం రోడ్డు రవాణా మార్గం కూడా సరిగాలేని ఈ గ్రామానికి జాతీయ రహదారి నుంచి నాలుగు కిలోమీటర్ల మేర కాలినడకనే చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో అంగన్వాడీ మంజుల గత 19 ఏళ్లుగా నిత్యం దట్టమైన అటవీ ప్రాంతం గుండా కాలినడకనే గ్రామానికి చేరుకొని అక్కడి పిల్లలకు పౌష్టిక ఆహారం, గర్భిణీ స్త్రీలకు పచ్చి బాలింతలకు సేవలు చేస్తోంది.

  ఇది చదవండి: సీజన్ ‌తో సంబంధం లేకుండా పూల సాగు చేస్తున్న రైతులు.. లాభాలు ఎలా ఉన్నాయంటే.?

  19 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్న మంజుల ప్రతి రోజూ లవ్వాలా గ్రామానికి వచ్చి విధులు నిర్వహిస్తుంది. ఉదయం 4 కిలో మీటర్లు, సాయంత్రం 4 కిలోమీటర్లు కాలినడకన దట్టమైన అడవి గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈక్రమంలో అడవిలో వన్య మృగాలు రోడ్డుపైకి వస్తుంటాయి. ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒకరోజు విధుల్లో భాగంగా గ్రామానికి వస్తుండగా అడవి దున్నపోతుల గుంపు ఎదురుగా వచ్చింది. దీంతో మంజుల వెంటనే ఒక చెట్టు చాటుకు వెళ్లి ప్రాణాలను దక్కించుకుంది. ఎవరికైనా ఫోన్ చేయాలన్నా ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉండవు. దీంతో ఈ టీచర్ రోజు సాహస యాత్ర చేస్తుందనే చెప్పుకోవచ్చు.

  ఇది చదవండి: ఈ ఆవుపాలు తాగితే మోకాళ్ల నొప్పులు మటుమాయం.. ఎక్కడ దొరుకుతాయో తెలుసా..?

  లవ్వాలా గ్రామంలో ఆరుగురు చిన్న పిల్లలు, ఆరుగురు గర్భిణీ స్త్రీలు, ఇద్దరూ బాలింతలు ఉంటారు. వీరికోసం ప్రభుత్వం అందించే పౌష్టికాహారం, పాలు, గుడ్లు, బాలామృతం వంటివి తానే స్వయంగా నాలుగు కిలోమీటర్లు కాలినడకన మోసుకొస్తున్నారు మంజుల. తమ కోసం ఇంత చేస్తున్న అంగన్వాడీ టీచర్ మంజుల అంటే తమకు అమ్మతో సమానమని అక్కడి గ్రామస్థులు చెప్తున్నారు. ఇంత కష్టపడినా, పేద ప్రజల కోసం సేవ చేస్తున్నాననే ఒక భావన, తాను అందించే ఆహార పడరాధ్లు తిని ఆ చిన్నారుల్లో చిరునవ్వు చూసి తాను పడే కష్టాన్ని మర్చిపోతానని అంగన్వాడీ టీచర్ మంజుల న్యూస్ 18 ప్రతినిధితో అన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Anganwadi, Local News, Mulugu, Telangana

  ఉత్తమ కథలు