హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ప్రభుత్వ కాలేజీలో చదివితే ర్యాంకులు రావన్నది ఎవరు..? వీళ్లను చూస్తే శభాష్ అంటారు..!

Mulugu: ప్రభుత్వ కాలేజీలో చదివితే ర్యాంకులు రావన్నది ఎవరు..? వీళ్లను చూస్తే శభాష్ అంటారు..!

ఐఐటీ-జేఈఈ, నీట్‌లో గిరిజన విద్యార్థుల సత్తా..

ఐఐటీ-జేఈఈ, నీట్‌లో గిరిజన విద్యార్థుల సత్తా..

IIT-JEE, NEET: ఫలితాలు ఏవైనా ర్యాంకులు కార్పొరేట్ కాలేజీల (Corporate Colleges) సొంతమన్నట్టు తాటికాయంత అక్షరాలతో ప్రచారం చేసుకుంటాయి కార్పొరేట్ విద్యాసంస్థలు. మా విద్యాలయాలలో చదివితేనే మీ పిల్లలకు మంచి మార్కులతో పాటు స్టేట్ ర్యాంక్, ఆలిండియా ర్యాంక్, బంగారు భవిష్యత్తు ఉంటుందంటూ కోతలు కోస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  Venu, News18, Mulugu

  ఫలితాలు ఏవైనా ర్యాంకులు కార్పొరేట్ కాలేజీల (Corporate Colleges) సొంతమన్నట్టు తాటికాయంత అక్షరాలతో ప్రచారం చేసుకుంటాయి కార్పొరేట్ విద్యాసంస్థలు. మా విద్యాలయాలలో చదివితేనే మీ పిల్లలకు మంచి మార్కులతో పాటు స్టేట్ ర్యాంక్, ఆలిండియా ర్యాంక్, బంగారు భవిష్యత్తు ఉంటుందంటూ కోతలు కోస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు అయ్యో నిజంగానే మా పిల్లలకు వేరే కళాశాలలో చదివిస్తే ర్యాంకులు రావేమో అన్న అపోహలకు వెళ్లిపోయి, అప్పులు చేసి పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేస్తున్నారు. కానీ ఈ గురుకుల కళాశాల విద్యార్థులు సాధించిన ర్యాంకులను చూస్తే ఇకపై తల్లిదండ్రులు తమ నిర్ణయాలు మార్చుకుంటారు. కార్పొరేట్ కాలేజీ వద్దు ప్రభుత్వ కాలేజీ ముద్దు అనే విధంగా గిరిజన విద్యార్థులు తమ సత్తా చాటారు.

  ఇటీవల కాలంలో ఐఐటి - జేఈఈ అడ్వాన్స్డ్(JEE Advanced), నీట్ పరీక్షల్లో (NEET Exam) ఉత్తమ ర్యాంకులు సాధించి గిరిజన విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ప్రతిభకు పేదరికం అడ్డం కాదని, చదవడానికి కార్పొరేట్ కాలేజీలే అవసరం లేదని అందరికీ అర్థమయ్యేలా వీరి ఫలితాలు జవాబు ఇస్తున్నాయి. వరంగల్ జిల్లా (Warangala District) కేంద్రంలో తెలంగాణ (Telangana) గిరిజన గురుకుల కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. పది మంది విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించి గిరిజన కళాశాల సత్తా ఏంటో చూపించారు.

  ఇది చదవండి: గిరిజనులకు జీవనాధారమే కాదు.. ఆకలి తీరుస్తున్న వెదురు బొంగు.. ఎలాగో తెలుసా..?

  ర్యాంకులు సాధించిన విద్యార్థులు: ఐశ్వర్య (452), అనుష (783), సింధు (1003), నందిని (1248), శిరీష (1363), సోనీ (1381) వీరితో పాటు ప్రిపరేటరీ ర్యాంకులలో గీత (194), శ్రీనిత్య (256), భాగ్యలక్ష్మి (352), సింధు (507), కళ్యాణి (645), మౌనిక (657), స్రవంతి (659), శ్రావణి (678), లహరి (985), రోజా బాయి (1205), సమీరా (1309) ర్యాంకులు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు. ప్రభుత్వ గురుకులాలు కూడా కార్పొరేట్ కాలేజీలు సాధించలేని ర్యాంకులు సాధిస్తుండడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

  ఇది చదవండి: సాక్షాత్తు రామలక్ష్మణులే స్వయంగా వండి పెట్టిన అంబా సత్రం.., ఎక్కడుంది?

  విద్యార్థులను సన్మానించిన ప్రాజెక్ట్ ఆఫీసర్: ఐఐటి - జేఈఈలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఐటిడిఏ ఏటూర్ నాగారం ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ సన్మానించారు. చదువుకోవడానికి శ్రద్ధ, లక్ష్యం, జీవిత ఆశయం ఉన్న ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉంటాడని పిఓ అంకిత్ అన్నారు. విద్యార్థి లక్ష్యం ఎప్పుడైతే గొప్పగా నిర్ణయించుకుంటాడో సమాజంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటాడని.. ప్రతిభ ఉన్న విద్యార్థులను ఐటిడిఏ ఎప్పుడు ప్రోత్సహిస్తుందని అంకిత్ తెలిపారు. ర్యాంకులు సాధించడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు, గ్రామస్తులు, కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: IIT, Local News, Telangana, Warangal

  ఉత్తమ కథలు