Home /News /telangana /

MULUGU THESE FLOWER IS IMPORTANT FOR TRIBAL EMPLOYMENT AND IS ALSO A REMEDY FOR JOINT AND BODY ACHES FULL DETAILS HERE MMV BRV PRV

Mulugu: ఆ పువ్వు ఓ కల్పవృక్షం.. కీళ్లు, ఒళ్లు నొప్పులకూ దివ్య ఔషధం.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

ఇప్ప

ఇప్ప పువ్వు

ఆ చెట్టు నుంచి వచ్చే పువ్వు గిరిజనులకు జీవనాధారం. ఈ పువ్వు నుంచి పలు రకాల ఉప ఉత్పత్తులు తయారు చేసి వంటలలోనూ, ఆయుర్వేదం వైద్యంలోనూ వినియోగిస్తారు. కీళ్లు, ఒళ్లు నొప్పులకూ దివ్వ ఔషధమంటారు. ఇంతకీ ఆ పువ్వు ఏమిటి? ఎక్కడ దొరుకుతుంది?

    (Venu Medipelly, News18, Mulugu)

    అనేక పెద్ద పెద్ద వృక్షాల సమూహాన్ని మనం అడవిగా చెప్పుకుంటాం. అడవిలో ఎన్నో రకాల చెట్లు ఉంటాయి. సామాన్యులకు కూడా చెట్ల సమూహంలానే కనిపిస్తుంది అడవి. కానీ కొందరికి మాత్రం అడవి ఒక అద్భుతంలా కనిపిస్తుంది. దివ్య ఔషధాలకు నిలవుగా కనిపిస్తుంది. అడవిలో దొరికే వృక్షాల వేర్లు, ఆకులు, పండ్లు ఇలా ఎన్నో వనరులతో వివిధ రకాల మందులు తయారు చేసుకోవచ్చు. అటువంటి ఔషధగుణాలున్న చెట్టు ఇప్ప చెట్టు (Mahuva Tree)!. ఇది సామాన్యులకు కేవలం ఒక చెట్టుగానే కనిపిస్తుంది. దీని గురించి తెలియని వారు దీని దగ్గరికి కూడా వెళ్లరు. కానీ గిరిజనులు మాత్రం వేసవికాలం వచ్చిందంటే చాలు పిల్ల, జెల్ల , ముసలి, ముతక ఇలా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆ చెట్టు కిందే ఉంటారు.

    గిరిజనుల పాలిట కల్పవృక్షం 'ఇప్పచెట్టు '..

    ముఖ్యంగా చెప్పుకోవాలంటే గిరిజనులకు (Tribes) అడవి ఒక దేవాలయంగా చెప్పుకోవచ్చు. అడవిలో దొరికే ఉత్పత్తులు అన్నీ కూడా వారి సొంతం వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా వారికే బాగా తెలుసు. అదే గిరిజనులకు అడవి ఒక వైద్యశాల.. అందులో ఉండే అనేక వృక్షాలు రోగాలను సైతం నయం చేసే శక్తి అడవి తల్లికి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. పూర్వకాలంలో వైద్యులు, ఆసుపత్రులు లేని సమయంలో అన్నిటికీ అడవిలో దొరికే ఆకు పసరే పెద్ద మందుగా ఉపయోగించే వారు. ముఖ్యంగా కొన్ని వృక్షాలు మాత్రం వీరికి జీవన ఉపాధిగా మారాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇప్ప చెట్టు గురించి. ఇప్ప చెట్టు నుంచి వచ్చే ఇప్పపువ్వు వారికి జీవన ఆధారంగా మారింది. ఈ ఇప్పపువ్వు నుంచి పలు రకాల ఉప ఉత్పత్తులు తయారు చేసి వంటలలోనూ, ఆయుర్వేదం వైద్యంలోనూ వినియోగిస్తారని గిరిజనులు అంటున్నారు.

    గిరిజనులకు ఆదాయం తెచ్చిపెడుతున్న ఇప్పపువ్వు..

    ఏటూరునాగారం (Eturunagaram) పరిధిలో ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మంది గిరిజన కుటుంబాలు ఇప్పపువ్వు ద్వారా ఆదాయం పొందుతున్నారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కేజీ ఇప్ప పువ్వుకు రూ. 35 ఇస్తున్నట్లు గిరిజనులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి రోజుకు దాదాపు మూడు బస్తాల ఇప్పపువ్వు (Mahuva flower) ఎరుతారు. వీటన్నిటినీ ఎండబెట్టి పొత్తు తీసి అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణాలకు చేరవేస్తారు. ఫార్మసీలలో తయారయ్యే పలు రకాల మందులలలోనూ ఇప్పపువ్వు ఉప ఉత్పత్తులను వినియోగిస్తారని స్థానిక గిరిజనుడు వివరించారు. గిరిజనులు కొందరు ఈ ఇప్పపువ్వుతో కుడుములు కూడా వండుకు తింటారు. ఈ కుడుములు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వారు అంటున్నారు. ఇప్పపువ్వు గింజలను సైతం ఎండబెట్టి మిల్లులలో నూనెను పట్టిస్తారు. ఈ ఇప్పనూనెను గిరిజనులు వంటలలో ఉపయోగిస్తారు. కీళ్ల నొప్పులకు ఒళ్లు నొప్పులకు ( joint and body aches), గాయాలకు కూడా ఇప్పనూనె రాసుకుంటారు.

    ఇప్పచెట్టు వద్ద మొత్తం పువ్వు కోసినా, కొన్ని రోజులకే ఇప్పచెట్టు మళ్లీ ఇప్పగింజలను ఇస్తుంది. మార్చి నుంచి మే వరకు ఇప్పపువ్వు లభిస్తుంది. మే - జూన్ కాలంలో ఇప్ప గింజలను గిరిజనులు సేకరిస్తారు. ఇప్పపువ్వు (Ippa)తో కుడుములు, పిండి వంటలు కూడా చేసుకుంటారు కొందరు గిరిజనులు. రానున్న కాలంలో ఇప్పపువ్వు సూపర్ మార్కెట్లలో లభించే అవకాశం ఉంటుంది కావచ్చు. ఇప్పపువ్వు ఉప ఉత్పత్తులను మాత్రమే ప్రభుత్వం, ట్రైబల్ వెల్ఫేర్ గుర్తించింది. పువ్వులను నేరుగా బహిరంగ మార్కెట్లో అమ్మకాలు జరపడానికి వీల్లేదు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Ayurvedic medicine, Forest, Local News, Mulugu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు