Home /News /telangana /

MULUGU THE VILLAGERS GAVE THE RETIRED SOLDIER AN UNEXPECTED WARM WELCOME IN MULUGU DISTRICT MMV ABH BRV

Mulugu: 20 ఏళ్ల పాటు సరిహద్దు వద్ద కాపలా కాసిన సైనికుడు: ఊరుఊరంతా వచ్చి ఘన స్వాగతం

వయస్సు

వయస్సు 31..రాసిన పుస్తకాలు 147..! సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనర్‌గా, రచయితగా దూసుకెళ్తున్న యువకుడు..!

రాయిని గూడెం...ములుగు జిల్లాలోని ఒక మారుమూల చిన్న గ్రామం. బయటి ప్రపంచం పెద్దగా తెలియదు ఆ గ్రామ ప్రజలకు. అటువంటి మారుమూల గ్రామం నుంచి ఈసం స్వామి అనే వ్యక్తి దేశ సేవ కోసం సొంత గ్రామానికి, అయినవారికి దూరంగా వెళ్లారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    (M.Venu, News 18, Mulugu)

    రాయిని గూడెం... ములుగు జిల్లాలోని ఒక మారుమూల చిన్న గ్రామం. అడపాదడపా జిల్లా కేంద్రానికి వెళ్లి రావడం తప్ప, బయటి ప్రపంచం పెద్దగా తెలియదు ఆ గ్రామ ప్రజలకు. అటువంటి మారుమూల గ్రామం నుంచి ఈసం స్వామి అనే వ్యక్తి దేశ సేవ కోసం సొంత గ్రామానికి, అయినవారికి దూరంగా వెళ్లారు. భారత సరిహద్దు దళంలో 20 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ అనంతరం తన సొంత గ్రామానికి వచ్చాడు. దేశ సేవకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టిన ఈసం స్వామిని ఆ గ్రామ ప్రజలు మర్చిపోలేదు. పదవీ విరమణ చేసి స్వగ్రామానికి చేరుకున్న అతనికి ఊహించని రీతిలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. చిన్నాపెద్దా, ముసలి ముతక.. వయసుతో సంబంధం లేకుండా ఈసం స్వామికి ఘన స్వాగతం పలికారు. గిరిజన గ్రామంలో ఒక్కసారిగా దేశభక్తి ఛాయలు ఆకాశాన్ని తాకాయి. గ్రామస్థుల ఆదరాభిమానాలు చూసిన ఆ సైనికుడి కళ్ళల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి.

    "దేశం కోసం 20 సంవత్సరాలు సేవలు అందించిన నాకు నా సొంత ఊరు ప్రజలు ఘన స్వాగతం పలుకుతుంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను" అంటూ భావోద్వేగానికి గురయ్యాడు ఈసం స్వామి. "ఆజాది కా అమృత్ మహోత్సవ్" 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే ఊరి ప్రజలంతా కలిసి సైనికుడిగా పదవి విరమణ చేసిన ఈసం స్వామిని ఘనంగా సత్కరించారు. వజ్జ రాజు అనే యువకుడు ఈకార్యక్రమాన్ని ముందుండి నడిపించాడు.

    ఈసం స్వామి ఉద్యోగ నేపథ్యం: ములుగు జిల్లా రాయిని గూడెం గ్రామానికి చెందిన ఈసం స్వామి 2000వ సంవత్సరంలో భారత సరిహద్దు దళంలో చేరాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు 22 సంవత్సరాలు సుదీర్ఘంగా దేశానికి సేవలు అందించాడు. దాదాపు 8 సంవత్సరాల పాటు జమ్మూ కాశ్మీర్లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు. దీంతోపాటు త్రిపుర, పంజాబ్, కేరళ వంటి ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు. పదవీ విరమణ సమయంలో చివరిసారిగా కేరళలో హెడ్ కానిస్టేబుల్ (జమిందార్) స్థాయిలో పదవి విరమణ పొందాడు.

    పదవీ విరమణ చేసి సొంత గ్రామానికి వచ్చిన ఈసం స్వామిని న్యూస్ 18 ప్రతినిధి పలకరించాడు. తన మాటల్లో చెప్పలేనంత ఆనందం దేశ సేవతోపాటు గ్రామంలోని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవడమే తన జీవిత ఆశయంగా పేర్కొన్నాడు. పుట్టిన దేశం కోసం, సొంత గ్రామం కోసం ఇప్పటికీ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ఈసం స్వామి చెప్తున్నాడు. మా గ్రామం నుంచి దేశ సేవలో 22 సంవత్సరాలు సుదీర్ఘంగా విధులు నిర్వహించిన ఈసం స్వామిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని గ్రామ ప్రజలు చెప్తున్నారు. గ్రామంలోని యువత దేశసేవలో పాల్గొనడానికి స్వామి స్ఫూర్తిదాయకంగా నిలిచారని గ్రామస్థులు అంటున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Mulugu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు