హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: బస్ స్టాప్ ఉంది కానీ రోడ్డు.., 60 ఏళ్లుగా రోడ్డు లేక ఏజెన్సీ గ్రామస్థుల అవస్థలు

Mulugu: బస్ స్టాప్ ఉంది కానీ రోడ్డు.., 60 ఏళ్లుగా రోడ్డు లేక ఏజెన్సీ గ్రామస్థుల అవస్థలు

ములుగు

ములుగు జిల్లా గిరిజన గ్రామాలను వేధిస్తున్న రోడ్ల సమస్య

భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటికీ అంబులెన్స్ కూడా వెళ్లలేని గ్రామాలు ఉన్నాయంటే దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్ధం అవుతుంది. ములుగు జిల్లా (Mulugu District) పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  Venu, News18, Mulugu

  భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటికీ అంబులెన్స్ కూడా వెళ్లలేని గ్రామాలు ఉన్నాయంటే దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్ధం అవుతుంది. ములుగు జిల్లా (Mulugu District) పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో అనేక గ్రామాలు ఉంటాయి. ఇక్కడి ప్రజలు మాత్రం బయటి ప్రపంచాలకు దూరంగా కనీస రవాణా సౌకర్యం లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి ఒక గ్రామం లవ్వాల. దాదాపు 62 సంవత్సరాల క్రితమే గిరిజనులు లవ్వాల గ్రామంలో ఆవాసం ఏర్పరుచుకుని నివాసం ఉంటున్నారు. 90 ఇళ్లు ఉన్న గ్రామంలో ప్రజలకు ఓటర్ కార్డు, ఆధార్ కార్డులు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఆ గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. కనీస రోడ్డు మార్గం కూడా లేని లవ్వాల గ్రామానికి న్యూస్ 18 ప్రతినిధి వెళ్లి అక్కడ గిరిజనుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసింది.

  లవ్వాల గ్రామం నుంచి జాతీయ రహదారికి చేరుకోవాలంటే దట్టమైన అటవీ ప్రాంతం గుండా సుమారు 4 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఉందని, రవాణా సౌకర్యం లేక మా గ్రామం అభివృద్ధి చెందడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినా అత్యవసర సమయంలోనూ గ్రామానికి అంబులెన్స్ రావడానికి కూడా వీలు లేకుండా అద్వాన్న స్థితిలో రోడ్డు ఉందని గ్రామస్తులు చెప్తున్నారు.

  ఇది చదవండి: కరోనాతో తండ్రి, గుండె పోటుతో తల్లి మృతి.., అనాథలైన అక్కాతమ్ముడు, ఆపన్నహస్తం కోసం ఎదురు చూపు

  సాయంత్రం తర్వాత గ్రామంలోకి రావాలంటే దట్టమైన అటవీ ప్రాంతంలో అడవి జంతువుల భయం ఉంటుంది. అడవిదున్నలు, అడవి పందులు, ఇతర మృగాలు సంచరిస్తున్నాయని గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 60 సంవత్సరాలకు పైగా ఇక్కడ గ్రామం ఏర్పాటై నివాసం ఉంటున్న తమకు ప్రభుత్వం కనీసం సౌకర్యాలు కల్పించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: రైతులను నిలువునా ముంచుతున్న కాలువ గండ్లు.., ప్రభుత్వ వైఫల్యమా? అధికారుల తప్పిదమా?

  ఇది ఒక లవ్వాల గ్రామం పరిస్థితి. కానీ ఇలాంటి గ్రామాలు ములుగు జిల్లాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల కాలంలో 30 గ్రామాలకు పైగా రోడ్లను మంజూరు చేసింది. అయితే అటవీ శాఖ మాత్రం మోకాలు అడ్డుపెడుతుంది. రోడ్డు వేయడానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడం లేదు. "దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు" అనే విధంగా ఉంది ఏజెన్సీ గ్రామాలకు పరిస్థితి.

  జిల్లాలోని గుత్తికోయలు రోడ్డు పక్కనే నివాసం ఏర్పాటు చేసుకుని పోడు వ్యవసాయం చేస్తున్నా ఫారెస్ట్ అధికారులు వారిని వదిలేసి తమ గ్రామాలకు మాత్రం అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని సమీప గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాలపైన ఇప్పటికైనా అధికారులు దృష్టిపెట్టి రవాణా మార్గం కోసం అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Mulugu, Telangana

  ఉత్తమ కథలు