హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ఈ బాలికల పాఠశాల ఎంతో ప్రత్యేకం: ఇక్కడ చదివిన వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు

Mulugu: ఈ బాలికల పాఠశాల ఎంతో ప్రత్యేకం: ఇక్కడ చదివిన వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు

ములుగు

ములుగు ఉన్నత పాఠశాల

ములుగు (Mulugu) జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలో అనేక మంది విద్యార్థినిలు పదో తరగతి విద్య పూర్తి చేసుకుని నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu, News18, Mulugu)

  ఒకప్పుడు ఆ ప్రాంతం ఒక దట్టమైన అటవీ ప్రాంతం (Forest area). సరిగా రవాణా వ్యవస్థ కూడా లేని ఆ గ్రామానికి చేరుకోవాలంటే చీకటి పడిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాలి. ఒకవైపు మావోయిస్టుల (Maoist) భయం మరోవైపు క్రూరమృగాల భయం. అటువంటి ప్రాంతంలో దేశానికి స్వతంత్రం సిద్ధించిన తొలి రోజుల్లోనే ప్రభుత్వం అక్కడ ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలను (Tribal Ashram School) ప్రారంభించింది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడ పని చేయాలంటే ఉద్యోగులకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో నన్న భయం ఉండేది. కానీ ఆ పాఠశాల నేటికీ చెక్కుచెదరకుండా అనేక మంది బాలికలకు ఉన్నత విద్యను అందించడంలో కీలకపాత్రను పోషించింది.

  ములుగు (Mulugu) జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలో అనేక మంది విద్యార్థినిలు పదో తరగతి విద్య పూర్తి చేసుకుని నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఆ పాఠశాల లేకపోతే అక్కడ బాలికలకు (Girls) చదువనేదే ఉండకపోయేది. బాలికలకు విద్యతో పాటు ఉచిత వసతి (Free Accommodation) కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ రోజుల్లోనే వందల మంది విద్యార్థులు ఆ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకుని అనంతరం ఉన్నత స్థానాలకు చేరారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, మహిళా రాజకీయ నాయకురాళ్లు కూడా ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసించిన వారే.

  నేటికీ చెక్కుచెదరని పాఠశాల: మొదట్లో కొన్ని తరగతి గదులతో ప్రారంభమైన గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఇప్పుడు సకల సదుపాయాలతో విద్యార్థులకు వరంగా మారింది. వసతి గృహాలతో (Accommodations)  పాటు తరగతి గదులు ఎంతో విశాలవంతంగా ఉంటాయి. ప్రశాంత వాతావరణంలో చదువుకోవడంతో పాటు విద్యార్థినీల ఆటవిడుపుకోసం సువిశాలమైన మైదానం కూడా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 400 మందికి పైగా బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. 400 మంది విద్యార్థులకు కూడా వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. విద్యార్థినిల ఉన్నతి కోసం ఉపాధ్యాయులు నిరంతరం శ్రమిస్తున్నారు.

  గత ఎనిమిది సంవత్సరాల నుంచి పాఠశాల 100% ఉత్తీర్ణతతో ములుగు జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉందని ప్రిన్సిపల్ పద్మ న్యూస్ 18 ప్రతినిధికి తెలిపారు. ఇక్కడ చదివే బాలికలు చదువుతో పాటు ఇతర కార్యక్రమాలలో కూడా ప్రతిభను కనబరుస్తుంటారు. ముఖ్యంగా క్రీడల విషయంలో ఈ పాఠశాల నుంచి అనేకమంది బాలికలు జాతీయస్థాయిలో తమ ప్రతిభను కనబరుస్తున్నారు.

  Business Idea: ఈ మహిళల ఐడియా అదరహో: మిల్లెట్స్ బిస్కెట్స్ తయారీతో లక్షల సంపాదన

  ఆశ్రమ పాఠశాలలో మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. తాడ్వాయి చుట్టుప్రక్కల దాదాపు 40 గిరిజన గ్రామాల నుంచి బాలికలు ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తాడ్వాయి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మెరుగైన వసతులు ఉండటంతో గిరిజన పిల్లలు ఈ పాఠశాలలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

  ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ తమ పిల్లలూ ఇంగ్లీషులో మాట్లాడటం చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ములుగు జిల్లా వైస్ చైర్పర్సన్‌గా ఉన్న బడే నాగజ్యోతి ఈ పాఠశాలలోనే పదో తరగతి వరకు చదువుకున్నారు. అలాగే ఈ పాఠశాల వసతి గృహం వార్డెన్ కూడా ఈ పాఠశాలలోనే చదివి ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు. తన సొంత పాఠశాలగా భవిస్తూ పిల్లలకు సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని తన సంతోషాన్ని చెప్పుకుంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Mulugu, School, Thenth students

  ఉత్తమ కథలు