హోమ్ /వార్తలు /తెలంగాణ /

రాష్ట్రంలో తొలి దివ్యాంగుల సంక్షేమ భవన్.. ఎక్కడంటే?..

రాష్ట్రంలో తొలి దివ్యాంగుల సంక్షేమ భవన్.. ఎక్కడంటే?..

దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Telangana: భూపాలపల్లి జిల్లా అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని జిల్లా యంత్రాంగం అర్హులందరికీ సంక్షేమం అందిస్తూ ముందుకు వెళుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

భూపాలపల్లి జిల్లా అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని జిల్లా యంత్రాంగం అర్హులందరికీ సంక్షేమం అందిస్తూ ముందుకు వెళుతుంది. భూపాలపల్లి జిల్లాలో ప్రతినెలా 7500 మందికి ప్రభుత్వం అందించే పెన్షన్ వస్తుంది. దీంతోపాటు దివ్యాంగులకు సహాయ పరికరాలు, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహాయంతో జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను భూపాలపల్లి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్అందించారు. రూ.33 లక్షలతో వీల్ చైర్స్, ట్రై సైకిల్, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, 14 డెలివరీ బెడ్స్ అర్హులకు అందించారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు రూ.3016 ప్రతినెల పెన్షన్ అందిస్తున్నామని మన జిల్లాలో దాదాపు 7500 మంది దివ్యాంగ లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ అందుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. దివ్యాంగులకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రతి సంక్షేమ పథకాల్లో ప్రత్యేక కోట దివ్యాంగులకు కేటాయిస్తున్నామని, మన భూపాల్ పల్లి జిల్లాలో రాష్ట్రంలోనే తొలిసారిగా దివ్యాంగులకు సంక్షేమ భవనం నిర్మించుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

భూపాలపల్లి పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో దివ్యాంగులకు ప్రత్యేక హోదా ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెప్తున్నారు. జిల్లాలోని దివ్యాంగులు డిగ్రీ చదువుకునే వారికి త్వరలోనే వాహనాలు కూడా అందిస్తామని చెప్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత దళిత బంధు కార్యక్రమం అమలుకు చర్యలు తీసుకుంటుందని, దళిత వర్గాల్లోని దివ్యాంగులకు దళిత బంధు అమలులో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్తున్నారు.సి.ఎస్.ఆర్ నిధులతో దివ్యాంగులకు సహాయ పరికరాలు పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అని, గత ఆగస్టు మాసంలోప్రత్యేక సమావేశం నిర్వహించి తరువాత చిట్యాల, భూపాలపల్లి, కాటారంమండలాల్లో దివ్యాంగుల స్క్రీనింగ్ చేపట్టే లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇప్పుడు పరికరాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

దివ్యాంగులకు జిల్లాలో ఆసరా పెన్షన్ ల కోసం సదెరం సర్టిఫికెట్ ఇబ్బంది ఎదురైన సందర్భంలో ప్రత్యేక చర్యలు తీసుకుని పరిష్కరించామని, గత సంవత్సరం 1500 నూతన సర్టిఫికెట్లు పంపిణీ చేసి ఆసరా పెన్షన్ మంజూరు చేసామని కలెక్టర్ తెలిపారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్ట మొదటగా దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నామని, అందులో అవసరమైన వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు