హోమ్ /వార్తలు /తెలంగాణ /

Monsoon crops: కరుణించిన వరుణుడు: ఆ జిల్లా రైతుల కళ్ళల్లో వెల్లివిరిసిన ఆనందం

Monsoon crops: కరుణించిన వరుణుడు: ఆ జిల్లా రైతుల కళ్ళల్లో వెల్లివిరిసిన ఆనందం

రైతన్నలకు

రైతన్నలకు ఊపిరి పోసిన వర్షాలు

నీరు లేక పైరు దిగాలుగా ఆకాశం వైపు చూస్తున్న వేళ, వేసిన పంట దక్కుతుందా అని రైతు ఆందోళన చెందుతున్న సమయంలో.. వరుణ దేవుడు సరిగ్గా ఆ రైతుల గోడు విన్నాడు కావచ్చు. సరైన సమయంలో వర్షాలు కురిసి పంటలు పైరు తిప్పుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu Medipelly, News18, Mulugu)

  నీరు లేక పైరు దిగాలుగా ఆకాశం వైపు చూస్తున్న వేళ, వేసిన పంట దక్కుతుందా అని రైతు (Farmer) ఆందోళన చెందుతున్న సమయంలో.. వరుణ దేవుడు సరిగ్గా ఆ రైతుల గోడు విన్నాడు కావచ్చు. సరైన సమయంలో వర్షాలు (rains) కురిసి పంటలు పైరు తిప్పుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో సెప్టెంబర్ రెండో వారంలో కురిసిన వర్షాల పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిధిలోని వాగులు, వంకలు, పరవళ్లు తొక్కుతుంటే రైతులు ముఖాల్లో చిరునవ్వులు మురిశాయి.

  రెండు నెలల క్రితం వ్యవసాయ (Agriculture) పనులు ప్రారంభించిన ములుగు (Mulugu) జిల్లా రైతులు.. వరుసగా వచ్చిన రెండు వరదల కారణంగా భారీగా నష్టపోయారు. పొలం పనులు ప్రారంభించిన అనంతరం పంట  (Crop) ప్రాణం పోసుకునే సమయంలో వర్షాలు రైతులకు అపార నష్టాన్ని కలిగించాయి. వర్షాల నుంచి తేరుకున్న రైతులు మళ్లీ అప్పులు చేసి మరీ వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. పైరు ప్రాణం పోసుకుంది. అంతా సంతోషంగానే ఉందనుకున్న సమయంలో మళ్లీ వరుణుడు ముఖం చాటేసాడు. పైరుకు నీరు అందించాలంటే సరియైన సాగునీరు సదుపాయం లేకపోవడంతో కొందరు రైతులు మోట కొడుతూ పైరుకు సాగునీరు అందించారు. మొదటిసారి కురిసిన వర్షాలకు నిండిన చెరువులు (ponds), కుంటలు, వాగులోని నీరంతా వరినాట్లు వేసే వరకు ఖాళీ అయిపోయాయి. దీంతో రైతన్న మళ్ళీ దిగాలు పడాల్సి వచ్చింది.

  ఈ నేపథ్యంలోనే గత నాలుగు రోజుల క్రితం ములుగు (Mulugu) జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. దీంతో వ్యవసాయానికి సాగునీరు సమృద్ధిగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మంగపేట మండలాల రైతులకు గౌరారం వాగు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడి పొలాలకు సాగు నీరు అందించేలా గౌరారం వాగుపై దశాబ్దాల కాలం క్రితమే ప్రభుత్వం పంబపూర్ గ్రామం సమీపంలో ఒక ప్రాజెక్టు నిర్మించింది.

  మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు గౌరారం వాగు మత్తడిపారి పరవాళ్ళు తొక్కుతుంది. ఈ ప్రాజెక్టు దిగువున వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ఇక్కడ నిర్మించకపోతే కేవలం వర్షాల మీదే ఆధారపడి వ్యవసాయం చేయాల్సి ఉంటుందని, ప్రాజెక్టు నిర్మించడం తమకెంతో ఉపయోగంగా ఉందని స్థానిక రైతులు చెప్పుకొచ్చారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Farmers, Local News, Mulugu, Rains

  ఉత్తమ కథలు