హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోని పాకాల కొత్తగూడా రహదారి

Mulugu: దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోని పాకాల కొత్తగూడా రహదారి

X
దుస్థితిలో

దుస్థితిలో రోడ్లు

Telangana: ప్రయాణించాలంటేనే భయపడుతున్న గిరిజనులు.. దశాబ్దాల కాలం నుంచి అభివృద్ధికి నోచుకోని రహదారి.. గిరిజనుల రవాణా కష్టాలు తీరేది ఎప్పుడు? ఆదివాసీల కష్టాలు రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులకు పట్టవా? ఈ ప్రశ్నలు నర్సంపేట పాకాల కొత్తగూడా రహదారిని చూస్తే ఉత్పన్నమవుతాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : వేణు

లొకేషన్ : ములుగు

ప్రయాణించాలంటేనే భయపడుతున్న గిరిజనులు.. దశాబ్దాల కాలం నుంచి అభివృద్ధికి నోచుకోని రహదారి.. గిరిజనుల రవాణా కష్టాలు తీరేది ఎప్పుడు? ఆదివాసీల కష్టాలు రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులకు పట్టవా? ఈ ప్రశ్నలు నర్సంపేట పాకాల కొత్తగూడా రహదారిని చూస్తే ఉత్పన్నమవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతం దట్టమైన అటవీతో నిండి ఉంటుంది.

ముఖ్యంగా ఏటూరు నాగారం అభయారణ్యంతో పాటు పాకాల అభయారణ్యం చెప్పుకోదగినవి. నర్సంపేట ప్రాంతంలోని పాకాల అభయ అరణ్యం గుండా గిరిజనులు ప్రయాణించాలంటే భయపడుతున్నారు ఎందుకో తెలుసా?అటవీ ప్రాంతం కదా క్రూర మృగాలు ఉంటాయని మీరు అనుకుంటే పొరపడినట్లే.

అక్కడ క్రూరం మృగాలేవి లేవు ఆ రహదారి గుండా ప్రయాణించాలంటే గిరిజనులు నరకప్రాయం అనుభవించాల్సిందే. దశాబ్దాల కాలం నుంచి పాకాల కొత్తగూడ రహదారి అధ్వానంగా తయారయింది. గిరిజన కష్టాలు రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులకు పట్టవు కావచ్చు.

కొన్ని సంవత్సరాల నుంచి ఆ రహదారి అలాగే ఉండిపోతుంది. కాకతీయులు నిర్మించిన అద్భుత సరస్సు పాకాల సరస్సు.. ఒకవైపు సరస్సు మరొకవైపు దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో చిన్న సింగిల్ రోడ్డు. ఈ రోడ్డు గుండానే పాకాల కొత్తగూడా చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ రహదారి కీలక పాత్ర పోషిస్తుంది. రహదారి గుండా ప్రయాణించాలంటే మాత్రం గిరిజనులు భయపడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా నాయకులు మారినా, అధికారులు మారిన రోడ్డు మాత్రం మారడం లేదు.

అటవీ ప్రాంతం కాబట్టి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదా కావాలనే రాజకీయ నాయకులు అధికారులు పట్టించుకోవడం లేదా అనే సందేహం చూసిన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. నర్సంపేట ప్రాంతం గిరిజన గ్రామాలకు పెద్ద టౌన్ ప్రాంతంగా ఉంటుంది. ఏ అవసరం కావాలన్నా చుట్టుపక్కల గిరిజన గ్రామాలు నర్సంపేట నగరానికి రావాల్సిందే. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, సొంత ద్విచక్ర వాహనాలు సైతం ఈ రహదారి గుండా ప్రయాణిస్తుంటాయి.

ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారుల మనసుల్లో మాత్రం ఎందుకు చలనం రావడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు. ఒకవైపు పర్యాటక ప్రాంతం, మరొకవైపు గిరిజన ప్రాంతం.. అభివృద్ధి చేస్తే ఇటు పర్యాటక ప్రాంతం గాను గిరిజనులకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పాకాల కొత్తగూడా రహదారిని మరమ్మతులు చేసి గిరిజన ప్రజల రవాణా కష్టాలు తీర్చాలని గిరిజన ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు